t20 world cup 2014
-
విరాట్ కోహ్లికి ఏమైంది..? మళ్లీ ఫెయిల్! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కీలకమైన సెమీఫైనల్లోనూ కోహ్లి నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో విరాట్ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ బౌలింగ్‌లో రెండో బంతికి విరాట్ భారీ సిక్స్ బాదాడు. దీంతో కింగ్ ఫామ్‌లోకి వచ్చాడని అంతా భావించారు. కానీ అదే ఓవర్లో నాలుగో బంతికి కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 75 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు డక్‌లు కూడా ఉన్నాయి. కాగా గత నాలుగు టీ20 వరల్డ్‌కప్‌ల సెమీస్‌లోనూ కోహ్లి హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కానీ ఈ సారి మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. దీంతో కోహ్లికి ఏమైందని పోస్ట్‌లు చేస్తున్నారు. ఓపెనర్‌గా రావడం వల్ల కోహ్లి విఫలమవుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.pic.twitter.com/DYt6XrZCq4— Azam Khan (@AzamKhan6653) June 27, 2024 -
‘సూపర్–8’లో భారత్ విజయారంభం..47 పరుగులతో అఫ్గానిస్తాన్ చిత్తు (ఫొటోలు)
-
'నీకు చాన్స్ ఇద్దామనే అలా చేశా'
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని.. మంచి ఫినిషర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియా ఓడిపోతుందనుకున్న చాలా మ్యాచ్‌ల్లో ధోని తనదైన ఫినిషింగ్‌తో గెలిపించేవాడు. చాలా మ్యాచ్‌ల్లో ఆఖరిబంతికి విన్నింగ్ షాట్ కొట్టి భారత అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి ధోని క్రీజులో ఉన్నాడంటే అవతలి బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వడం అరుదుగా చూస్తుంటాం. కానీ 2014 టీ20 ప్రపంచకప్‌లో ధోని విన్నింగ్ షాట్ కొట్టే అవకాశం కోహ్లికి ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 18.3 ఓవర్ బంతికి 167 పరుగుల వద్ద రైనా అవుటయ్యాడు. కోహ్లి 78 పరుగులతో అజేయంగా ఉన్నాడు. భారత్ విజయానికి ఇంకా 8 బంతుల్లో 2 పరుగలు కావాలి. ఓవర్ 5వ బంతి ఆడిన కోహ్లి సింగిల్ తీశాడు. స్ట్రైకింగ్లోకి వచ్చిన ధోనిని విన్నింగ్ షాట్ కొట్టమన్నట్లుగా కోహ్లి అతని వైపు నవ్వుతూ పేర్కొన్నాడు. కానీ ధోని అనూహ్యంగా ఆ బంతిని డిఫెన్స్ ఆడాడు. అయితే కోహ్లి రన్ కోసమని ముందుకు పరిగెత్తాడు.. కానీ ధోని స్పందించలేదు. ధోని ఇదేంటి.. అన్నట్లు కోహ్లి అతనివైపు కోపంగా చూశాడు. ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే ఫోర్ కొట్టిన కోహ్లి టీమిండియాను గెలిపించాడు.(చదవండి : 'కోహ్లికి ఇచ్చారు.. నటరాజన్‌కు ఎందుకివ్వరు') విజయం అనంతరం మైదానం వీడుతున్న తరుణంలో కోహ్లి ధోని దగ్గరికి వెళ్లి ఎందుకలా చేశావని ప్రశ్నించాడు.'నువ్వు విన్నింగ్ షాట్ ఆడాలనే అలా చేశా.. కేవలం నీ కోసమే కోహ్లి' అంటూ ధోని పేర్కొన్నాడు. తాజాగా ఈ వీడియోనూ ఐసీసీ మరోసారి ట్విటర్లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల చేసింది. డుప్లెసిస్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. భారత్ బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీశాడు. అనంతర బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా జట్టులో విరాట్ కోహ్లి 44 బంతుల్లోనే 72 పరుగులు చేయడంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ ఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం పాలై రెండోసారి టీ20 ప్రపంచకప్ సాధించే సువర్ణావకాశాన్ని కోల్పోయింది.(చదవండి : చిరుత కంటే వేగం.. అంత తేలిగ్గా మరిచిపోలేం) When MS Dhoni let Virat Kohli lay the finishing touch 📹 Revisit the sweet gesture by captain Dhoni from the 2014 T20 World Cup semi-final against South Africa 🇮🇳 pic.twitter.com/EKcWsCh9r1 — ICC (@ICC) December 23, 2020 -
టీ20 ప్రపంచకప్ విజేత శ్రీలంక
మిర్పూర్: టీ20 ప్రపంచకప్-2014ను శ్రీలంక చేజిక్కించుకుంది. ఆదివారమిక్కడ ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి లంక టీ20 చాంపియన్‌గా అవతరించింది. భారత్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక మరో 13 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. కుమార సంగక్కర అజేయ అర్థసెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. 35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. మహేల జయవర్థనే 24, పెరీరా 23, దిల్షాన్ 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రైనా, మొహిత్ శర్మ, అశ్విన్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సంగక్కర, జయవర్థనేను సహచరులు తమ భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించారు. వీరిద్దరూ టీ20ల నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
శ్రీలంక లక్ష్యం 131 పరుగులు
మిర్పూర్: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకకు భారత్ 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి అర్థ సెంచరీతో రాణించాడు. 58 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 29, యువరాజ్ సింగ్ 11 పరుగులు చేశారు. ఓపెనర్ రహానే(3) నిరాశపరిచాడు. ధోని నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో కులశేఖర, మాథ్యూస్, హిరాత్ తలో వికెట్ తీశారు. వర్షం కారణంగా ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. -
యువరాజ్ సింగ్ ఫిట్
ఢాకా: భారత క్రికెట్ అభిమానులకు ఉత్సాహపరిచే వార్త. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సెమీఫైనల్లో ఆడబోడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో సెమీస్ ఫైనల్లో యువీ బరిలోకి దిగబోతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆడేందుకు యువరాజ్ ఫిటెనెస్ సాధించాడు. దీంతో అతడు ఆడతాడా, లేదా అన్న సందిగ్దం తొలగిపోయింది. కాళ్లకు బూట్లు లేకుండా ఫుట్‌బాల్ ఆడి యువీ గాయపడిన సంగతి తెలిసిందే. యువీ ఫిట్‌గా ఉన్నాడని జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ ఫామ్‌లోకి వచ్చాడు. 43 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సెమీస్‌లోనూ అతడు సత్తా చాటుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ సాయంత్రం జరగనున్న సెమీస్ సమరం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
బంగ్లాదేశ్‌లో మాత్రం అలా కుదరడం లేదు
ఢాకా: సాధారణంగా భారత క్రికెటర్లు విదేశాలకు వెళితే కావలసినంత ఎంజాయ్ చేస్తారు. ప్రపంచకప్ సమయంలో మ్యాచ్‌ల మధ్య విరామం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాగా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక... ఇలా ఎక్కడ ప్రపంచకప్ జరిగినా.... పబ్‌లు, నైట్‌క్లబ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయడం ధోని సేనకు బాగా ఇష్టమైన వ్యాపకం. కానీ ఈసారి బంగ్లాదేశ్‌లో మాత్రం అలా కుదరడం లేదు. ఢాకాలో నైట్‌క్లబ్‌లు, పబ్‌లు ఉండవు. దీనికి తోడు ఈసారి భద్రత బాగా ఎక్కువ చేశారు. దీంతో మొత్తం ఆటగాళ్లంతా గ్రౌండ్‌కు, హోటల్‌కు పరిమితమవుతున్నారు. ప్రాక్టీస్, మ్యాచ్ లేకపోతే గదుల్లోంచి బయటకు కూడా రావడం లేదు. వీడియో గేమ్స్, చాటింగ్‌లతో కాలక్షేపం చేస్తూ ‘గూట్లో పక్షులు’గా మారారు. పాపం..! -
బౌలింగ్ పదును పెరగాలి: ధోని
మిర్పూర్: టి20 ప్రపంచకప్‌లో తమ బౌలింగ్ పదును పెరగాల్సిన అవసరముందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు. బ్యాట్స్‌మెన్ కూడా మెరుగ్గా రాణించి బౌలర్లపై భారం తగ్గిస్తారన్న నమ్మకాన్ని అతడు వ్యక్తం చేశాడు. టి20 ప్రపంచకప్‌లో తన ఆరంభ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో రేపు భారత్ తలపడనుంది. అయితే బ్యాటింగ్ పోలిస్తే బౌలింగ్‌లో తాము బలహీనంగా ఉన్నామని ధోని అంగీకరించాడు. బ్యాటింగ్‌లో శుభారంభం చేయడం ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ఓపెనింగ్ బాగుంటే 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసే అవకాశముందన్నాడు. బ్యాటింగ్ పరంగా ఎక్కువగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరముందన్నారు. మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ పెద్దగా టి20 మ్యాచ్‌లు ఆడనప్పటికీ ఐపీఎల్ అనుభవం వారికి పనికొస్తుందని ధోని అన్నాడు. యువరాజ్ సింగ్, సురేష్ రైనా ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. అజింక్య రహానేను ఓపెనింగ్ పంపే విషయం ఆలోచిస్తున్నామని చెప్పాడు. -
బ్లాక్ బస్టర్ ఫ్రైడే ఫైట్!
ఢాకా: పొట్టి ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి ఈ శుక్రవారం తెర లేవనుంది. బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న దాయాది దేశాల మధ్య పోరు క్రికెట్ అభిమానులను ఊర్రూతలూగించనుంది. టి20 ప్రపంచకప్‌లో బ్లాక్ బస్టర్ ఫ్రైడే సమరానికి భారత్, పాకిస్థాన్ జట్లు సమాయత్తమవుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్‌లు ఈనెల 21న ముఖాముఖి తలపడనున్నాయి. ఆసియాకప్‌లో పాక్ చేతిలో భంగపడిన టీమిండియా తన తొలి మ్యాచ్‌లో దాయాది జట్టును మట్టికరిపించి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌కు ముందు ఆటతీరును సరిచూసుకోవడానికి శ్రీలంక, ఇంగ్లండ్‌లతో జరగనున్న వార్మప్ మ్యాచ్‌లను ఉపయోగించుకోవాలని ధోని సేన యోచిస్తోంది. ఆసియాకప్‌లో భారత్‌పై పేచేయి సాధించిన పాక్ ఇక్కడ కూడా అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. అయితే టి20లో పాక్ కంటే భారత్ రికార్డు మెరుగ్గా ఉంది. భారత్‌తో ఐదుసార్లు తలపడిన పాక్ కేవలం ఒకసారి మాత్రమే విజయం సాధించింది. ప్రపంచకప్‌లో 8 సార్లు(5 వన్డేలు, మూడు టి20) తలపడినా పాక్ ఒక్కసారిగా విజయం సాధించలేకపోయింది. ఈ రికార్డు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తామని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి దీమా వ్యక్తం చేశాడు. ఆసియాకప్‌లో ఓడినప్పటికీ తమ ఆట పాక్ కంటే మెరుగ్గా ఉందన్నాడు. భారత్ బ్యాటింగ్‌లో, పాకిస్థాన్ బౌలింగ్‌లో మెరుగ్గా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌ను భారత్ బ్యాటింగ్, పాక్ బౌలింగ్ మధ్య జరుగుతున్న పోటీగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆసియా కప్‌కు దూరమైన ధోని, పొట్టి ఫార్మాట్ స్పెషలిస్టులు యువరాజ్ సింగ్, సురైనా రైనాలు జట్టులో చేరడంతో టీమిండియా బలం పెరిగింది. ఇదే విషయాన్ని పాక్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ కూడా అంగీకరించాడు. ధోని తిరిగి రావడం భారత్ కచ్చితంగా అనుకూలించే అంశమని అన్నాడు. మొదటి మ్యాచ్‌లోనే ధోనిసేనను ఎదుర్కొవాల్సిరావడం కొద్దిగా ఒత్తిడితో కూడుకున్న అంశమని అంగీకరించాడు. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మిగతా వాటిలో ఒత్తిడి అంతగా ఉండదని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌లో బలంగా ఉన్న భారత్‌ను తమ పదునైన బౌలింగ్ ఆయుధంతో ఎదుర్కొంటామని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లు ఉన్నప్పటికీ భారత్-పాక్ మ్యాచ్‌పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్‌తోనే టి20 వరల్డ్ కప్ సందడి మొదలవుతుందనడంలో అతిశయోక్తి లేదు.