
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కీలకమైన సెమీఫైనల్లోనూ కోహ్లి నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో విరాట్ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ బౌలింగ్‌లో రెండో బంతికి విరాట్ భారీ సిక్స్ బాదాడు. దీంతో కింగ్ ఫామ్‌లోకి వచ్చాడని అంతా భావించారు. కానీ అదే ఓవర్‌లో నాలుగో బంతికి కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు.
ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 75 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు డక్‌లు కూడా ఉన్నాయి. కాగా గత నాలుగు టీ20 వరల్డ్‌కప్‌ల సెమీస్‌లోనూ కోహ్లి హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కానీ ఈ సారి మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. దీంతో కోహ్లికి ఏమైందని పోస్ట్‌లు చేస్తున్నారు. ఓపెనర్‌గా రావడం వల్ల కోహ్లి విఫలమవుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
— Azam Khan (@AzamKhan6653) June 27, 2024