యువరాజ్ సింగ్ ఫిట్ | Team India says Yuvraj Singh fit for World T20 semi-final | Sakshi
Sakshi News home page

యువరాజ్ సింగ్ ఫిట్

Published Fri, Apr 4 2014 3:24 PM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

యువరాజ్ సింగ్ ఫిట్ - Sakshi

యువరాజ్ సింగ్ ఫిట్

ఢాకా: భారత క్రికెట్ అభిమానులకు ఉత్సాహపరిచే వార్త. డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సెమీఫైనల్లో ఆడబోడుతున్నాడు. టీ20 ప్రపంచకప్లో శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో సెమీస్ ఫైనల్లో యువీ బరిలోకి దిగబోతున్నాడు. ఈ మ్యాచ్లో ఆడేందుకు యువరాజ్ ఫిటెనెస్ సాధించాడు.  దీంతో అతడు ఆడతాడా, లేదా అన్న సందిగ్దం తొలగిపోయింది. కాళ్లకు బూట్లు లేకుండా ఫుట్‌బాల్ ఆడి యువీ గాయపడిన సంగతి తెలిసిందే.

యువీ ఫిట్గా ఉన్నాడని జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో యువరాజ్ ఫామ్లోకి వచ్చాడు. 43 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సెమీస్లోనూ అతడు సత్తా చాటుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ సాయంత్రం జరగనున్న సెమీస్ సమరం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement