Dhoni Team
-
సూపర్ కింగ్స్‌కు ఘన స్వాగతం
చెన్నై: చెన్నైలో ఒకే ఒక మ్యాచ్ ఆడి వెళ్లిపోయిన వారి అభిమాన జట్టు ఇప్పుడు ఏకంగా టైటిల్‌తోనే తిరిగొచ్చింది. అందుకే వారూ వీరనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో అభిమానులు తమ సూపర్ కింగ్స్‌కు అపూర్వ రీతిలో స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ధోని సోమవారం పూర్తి జట్టుతో చెన్నైకి తరలి వెళ్లింది. విమానాశ్రయం, హోటల్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఫ్యాన్స్ తమ కింగ్స్‌కు స్వాగతం చెప్పారు. జట్టు యజమాని, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్‌కు ఆటగాళ్లంతా రాత్రి హాజరయ్యారు. మరోవైపు జట్టు సీఈఓ కేఎస్ విశ్వనాథన్ స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం గుడిలో వెంకటేశ్వర స్వామి ముందు ఐపీఎల్ ట్రోఫీని ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. -
శుభసూచకమే!
ట్వంటీ20 క్రికెట్లో పేరుకే కాదు ఆటతో కూడా ఇప్పుడు ధోని సేన నంబర్‌వన్‌గా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాను వారి మైదానంలోనే చిత్తుగా ఓడించిన భారత జట్టు సొంతగడ్డపై తమ పదునేమిటో శ్రీలంకకు రుచి చూపించింది. పుణే మ్యాచ్ ఒక అరుదైన ఫలితం కాగా... ఆ తర్వాత మన అసలు సత్తా బయటపడింది. వెంటనే ఆసియాకప్‌లో పాల్గొనాల్సి ఉన్నా... అసలు లక్ష్యం మాత్రం ప్రపంచకప్. స్వదేశంలో జరుగుతుండటం, మొదటినుంచి చివరి ఆటగాడి వరకు అంతా ఫామ్‌లో ఉండటమే కాదు, మన కోసమే సిద్ధమయ్యే స్పిన్ పిచ్‌లు కూడా భారత్ గెలుపును కోరుతున్నట్లున్నాయి. లంకపై చివరి మ్యాచ్ విజయం కూడా అదే చూపించింది. పొట్టి క్రికెట్లో తాము ఎప్పుడైనా గట్టి పోటీదారులమే అంటూ ధోని సవాల్ విసురుతుండటం వరల్డ్ కప్‌పై మన అంచనాలు పెంచేస్తోంది. * సూపర్ ఫామ్‌లో ధోని సేన * వరల్డ్‌కప్‌కు అన్ని విధాలా రెడీ * లంకపై విజయం ఇచ్చిన ఉత్సాహం ఆ స్ట్రేలియాతో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్కటే జట్టు... శ్రీలంకతో సొంతగడ్డపైనే అయినా ఇక్కడా మూడు మ్యాచ్‌లకు జట్టులో మార్పు లేదు. కోహ్లి లేకపోవడంతో రహానేకు అవకాశం దక్కడం తప్ప అనూహ్య నిర్ణయమేదీ లేదు. వరల్డ్‌కప్‌లో ఆడే తుది జట్టుపై కెప్టెన్ ధోని ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకున్నాడని అర్థమవుతుంది. నేగిలాంటి ఆటగాడిని రిజర్వ్‌గానే చూడటం తప్ప అతడిని పరీక్షించి విశ్వ వేదికపై ఆడించే ఆలోచన కెప్టెన్‌కు ఉన్నట్లుగా లేదు. కాబట్టి ఇక జట్టు విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. యువరాజ్‌కు బ్యాటింగ్ అవకాశం వచ్చినా, రాకున్నా... సీనియర్ హర్భజన్ సేవలు అవసరమా, కాదా... ఇలా ఎవరు ఎలా భావించినా జట్టుకు సంబంధించి ఎవరైనా అనూహ్యంగా గాయపడితే తప్ప మార్పు ఉండకపోవచ్చు. ఈ ఆటగాళ్లే శ్రీలంకతో సిరీస్ విజయం అందించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. బ్యాటింగ్ బాగు బాగు టి20 రికార్డు, ఫామ్‌ను బట్టి టాప్-4 స్థానాల్లో ఎలాంటి మార్పు సాధ్యం కాదని ధోని గట్టిగానే చెప్పేశాడు. రోహిత్, కోహ్లిలతో పాటు ఈ ఫార్మాట్లో రైనా అత్యంత నమ్మదగిన బ్యాట్స్‌మెన్. శిఖర్ ధావన్‌పై ఏమైనా సందేహాలు ఉంటే ఈ సిరీస్‌తో తీరిపోయాయి. ఇక భారత్‌లో ఈ నలుగురి ఐపీఎల్ అనుభవం బ్రహ్మాండంగా పనికి రావడం ఖాయం. ‘టి20 క్రికెట్లో మేం ఎప్పుడైనా గట్టి పోటీదారులమే. మా జట్టులో దాదాపు అందరికీ భారత్‌లో ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. ముఖ్యంగా ఎనిమిది ఐపీఎల్ సీజన్లలో ఏడు ఇక్కడే ఆడాం. అది చాలా కీలక పాత్ర పోషిస్తుంది’ అని ధోని మన బ్యాటింగ్ బలమేమిటో చెప్పేశాడు. లోయర్ ఆర్డర్లో ధోని ఉండగా, తాను చెలరేగగలనని పాండ్యా రాంచీ మ్యాచ్‌లో చూపించాడు. మరోవైపు ఆస్ట్రేలియాలోనూ, ఇక్కడా బ్యాటింగ్‌లో చివర్లో వచ్చిన యువరాజ్ ప్రభావం చూపలేకపోయాడు. అయితే యువీకి ధోని మద్దతుగా నిలవడం బట్టి చూస్తే ఇది పెద్ద సమస్య కాదని అర్థమవుతుంది. ‘అందరికీ బ్యాటింగ్ రాకపోవడమనేది సమస్యే. కానీ 6,7,8 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవారు నేరుగా భారీషాట్లకు పోవాల్సి ఉంటుంది. ఇక్కడ వారు ఎన్ని పరుగులు చేశారనేదానికన్నా, ఎంత వేగంగా చేస్తే జట్టుకు అంత ఉపయోగపడుతుంది’ అని విశ్లేషించిన ధోని 9వ స్థానం వరకు బ్యాటింగ్‌పై ఢోకా లేదన్నాడు. స్పిన్...స్పిన్... లంకతో సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో పేస్ వికెట్, రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ పిచ్, చివరగా స్పిన్ వికెట్...భారత్‌లో వచ్చే వరల్డ్ కప్ పిచ్‌లు ఎలా ఉండాలి అంటూ ఎ, బి, సి చాయిస్ ఇస్తే బీసీసీఐ ఓటు కచ్చితంగా మూడోదానికే పడుతుంది. మన విజయం కోసం పిచ్ ఇలా ఉండాలి అంటూ వైజాగ్ క్యురేటర్ దేశంలోని ప్రపంచకప్ వేదికల క్యురేటర్లకు మార్గం చూపించినట్లుంది! ఎలాంటి విమర్శలు, వివాదాలు వచ్చినా స్పిన్ అనుకూల పిచ్లే ఉంటాయనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అశ్విన్, జడేజాలు ‘తిప్పుడు’కు ఇక్కడ ఎలాగూ ఎదురు లేదు. కానీ రైనా, యువీల బంతులకు కూడా పిచ్ గిరిగిరా అంటోంది. ‘భారత్‌లో స్పిన్నర్ల ప్రభావం గురించి కొత్తగా చెప్పేదేముంది. వరల్డ్ కప్‌లో అది మాకు అదనపు ప్రయోజనం. ఆరంభంలో అశ్విన్ బాగా బౌలింగ్ చేస్తే మధ్య ఓవర్లలో పేసర్లను వాడుకునే సౌకర్యం నాకు ఉంటుంది. ఇద్దరు ఆఫ్‌స్పిన్నర్లు, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు జట్టులో ఉన్నారంటే ఒకరు విఫలమైనా మిగతా ముగ్గురు చూసుకోగలరు. పైగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయగల బుమ్రాపై కూడా నాకు గట్టి నమ్మకం ఉంది’ అంటూ జట్టు స్పిన్‌పై ధోని అచంచల విశ్వాసం ప్రకటించాడు. లోపాలు లేవా! టి20 ఫార్మాట్లో ఉండే అనిశ్చితి గురించి ధోనికి తెలియనిది కాదు. మన జట్టు ఎవరూ ఓడించలేనంత పటిష్టంగా ఉందనే ధోనికి... ఓడిపోయే అవకాశం కూడా ఉందని తెలుసు. అతని అనుభవాన్ని బట్టి చూస్తే తన లోపాలూ తెలుసు. ‘ప్రత్యర్థి జట్టులో అందరికంటే విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ను ఆపడం మా ప్రధాన లక్ష్యం. ఎందుకంటే ఆ ఒక్కడు మ్యాచ్‌ను లాగేసుకోగలడు. ముఖ్యంగా నాకౌట్లో అత్యుత్తమ ఆటతీరు కనబర్చాలి. ఒకరకంగా చెప్పాలంటే ఈ దశ లాటరీ టికెట్ లాంటిది. కాబట్టి నిలకడగా ఆడాల్సి ఉంది’ అని కెప్టెన్ కూల్ వెల్లడించాడు. లంకతో ఫలితం చూస్తే ప్రపంచకప్‌కు ముందు సొంతగడ్డపై మనోళ్ల హోంవర్క్ బాగా జరిగినట్లే. అన్నీ అనుకూలాంశాలే కనబడుతున్న నేపథ్యంలో ఇదే జోరు కొనసాగిస్తే 20-20లో రెండో సారి ‘మెన్ ఇన్ బ్లూ’ విశ్వవిజేతగా నిలవడం ఖాయం. - సాక్షి క్రీడా విభాగం -
కుర్రాళ్లు హిట్ పెద్దోళ్లు ఫట్
అనూహ్య ఫలితాలు... కష్టపడతారనుకున్న భారత కుర్రాళ్లు శ్రీలంకను చిత్తు చేసి అండర్-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరితే... సులభంగా గెలుస్తారనుకున్న ధోనిసేన అదే శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడింది. అటు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో, ఇటు పుణేలో రెండు చోట్లా బ్యాట్స్‌మెన్‌కు గడ్డుకాలం ఎదురైనా... కుర్రాళ్లు తడబాటు లేకుండా పని పూర్తి చేస్తే... అనుభవజ్ఞులు మాత్రం చేతులెత్తేశారు. * అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ * సెమీస్‌లో శ్రీలంకపై విజయం మిర్పూర్: నాలుగో సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచేందుకు యువ భారత్ అడుగు దూరంలో నిలిచింది. అండర్-19 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ నుంచే ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న కుర్రాళ్లు అదే ఊపులో సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టారు. అన్మోల్ ప్రీత్ సింగ్ (92 బంతుల్లో 72; 6 ఫోర్లు; 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (71 బంతుల్లో 59; 6 ఫోర్లు; 1 సిక్స్) సముచిత ఆటతీరుతో మంగళవారం షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య గురువారం జరిగే సెమీస్ విజేతతో... 14న భారత్ టైటిల్ కోసం పోరాడనుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 267 పరుగులు సాధించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ (14) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా కెప్టెన్ ఇషాన్ (7) మళ్లీ నిరుత్సాహపరిచాడు. దీంతో 27 పరుగులకే జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించకపోవడంతో అన్మోల్, సర్ఫరాజ్ జోడి పరిస్థితులకు తగ్గట్టుగా ఆడారు.స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారీ సిక్స్‌తో సర్ఫరాజ్ ఈ టోర్నీలో నాలుగో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే కొద్దిసేపటికే పేలవ పుల్ షాట్‌కు అవుట్ అయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత అన్మోల్ కూడా అర్ధ సెంచరీ సాధించి వాషింగ్టన్ సుందర్ (45 బంతుల్లో 43; 3 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచాడు. అర్మాన్ జాఫర్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడాడు. ఫెర్నాండోకు నాలుగు.. కుమార, నిమేశ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం శ్రీలంక 42.4 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలింది. అయితే భారత ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో విఫలమైనా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో రాణించడంతో ఫలితం అనుకూలంగా వచ్చింది. తొలి ఓవర్లోనే అవేశ్ (2/41) వికెట్ తీసి లంకను దెబ్బతీశాడు. ఆ తర్వాత దాగర్ (3/21) పొదుపుగా బౌలింగ్ చేసి మిగతా పనికానిచ్చాడు. వరుసగా వికెట్లు కోల్పోయిన లంక తరఫున మెండిస్ (67 బంతుల్లో 39; 4 ఫోర్లు), అషన్ (49 బంతుల్లో 38; 4 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. స్కోరు వివరాలు:- భారత్ అండర్-19 ఇన్నింగ్స్: రిషబ్ (సి) డి సిల్వ (బి) ఫెర్నాండో 14; ఇషాన్ (సి) డి సిల్వ (బి) కుమార 7; అన్మోల్ ప్రీత్ (సి) డి సిల్వ (బి) నిమేష్ 72; సర్ఫరాజ్ (సి) ఆషన్ (బి) ఫెర్నాండో 59; సుందర్ (సి) డి సిల్వ (బి) నిమేష్ 43; అర్మాన్ (సి) అసలంక (బి) ఫెర్నాండో 29; లొమ్రోర్ (సి) కుమార (బి) ఫెర్నాండో 11; దాగర్ (సి) డి సిల్వ (బి) కుమార 17; బాథమ్ (రనౌట్) 1; అవేశ్ నాటౌట్ 1; ఖలీల్ అహ్మద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 267. వికెట్ల పతనం: 1-23, 2-27, 3-123, 4-193, 5-218, 6-241, 7-254, 8-260, 9-264. బౌలింగ్: ఫెర్నాండో 10-0-43-4; కుమార 10-0-50-2; నిమేష్ 10-0-50-2; డి సిల్వ 4-0-20-0; సిల్వ 7-0-31-0; మెండిస్ 1-0-10-0; అసలంక 8-0-59-0. శ్రీలంక అండర్-19 ఇన్నింగ్స్: బండార (రనౌట్) 2; ఫెర్నాండో ఎల్బీడబ్ల్యు (బి) అవేశ్ 4; మెండిస్ (సి) సుందర్ (బి) దాగర్ 39; అసలంక (సి) లొమ్రోర్ (బి) బాథమ్ 6; ఆషన్ (రనౌట్) 38; డి సిల్వ (సి) రిషబ్ (బి) అవేశ్ 28; సిల్వ (బి) సుందర్ 24; హసరంగ డి సిల్వ (సి) అవేశ్ (బి) అహ్మద్ 8; నిమేశ్ (సి) సర్ఫరాజ్ (బి) దాగర్ 7; కుమార నాటౌట్ 0; ఫెర్నాండో (సి) అన్మోల్ (బి) దాగర్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (42.4 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1-5, 2-13, 3-42, 4-91, 5-108, 6-133, 7-149, 8-170, 9-170, 10-170. బౌలింగ్: అవేశ్ 9-0-41-2; ఖలీల్ అహ్మద్ 8-1-34-1; బాథమ్ 6.5-1-19-1; సుందర్ 7-0-27-1; సర్ఫరాజ్ 4.4-0-16-0; దాగర్ 5.4-0-21-3; లొమ్రోర్ 0.3-0-1-0; అన్మోల్ 1-0-6-0. నేలకు దిగారు! ఆస్ట్రేలియాలో అద్భుతం చేసి వచ్చిన భారత జట్టు సొంత మైదానంలో చతికిల పడింది. పరుగుల వరద పారిస్తారనుకున్న స్టార్ క్రికెటర్లంతా చేతులెత్తేశారు. ప్రత్యర్థి జట్టులో ఉంది కుర్రాళ్లే కదా అని ‘లైట్’ తీసుకున్నారేమో... ఘోరంగా భంగపడ్డారు. ఫలితంగా... తొలి టి20లో ధోనిసేన పరాభవాన్ని మూటగట్టుకుంది. * తొలి టి20లో భారత్ ఓటమి * ఐదు వికెట్లతో లంక విజయం * రాణించిన రజిత, షనక * రెండో మ్యాచ్ శుక్రవారం పుణే: అనుభవం లేకపోయినా... పరిస్థితులకు తగ్గట్టుగా చక్కటి ప్రణాళికతో ఆడిన శ్రీలంక జట్టు... ధోనిసేనను నేలకు దించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ (24 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రజిత (3/29), షనక (3/16) భారత్‌ను దెబ్బ తీశారు. అనంతరం శ్రీలంక 18 ఓవర్లలో 5 వికెట్లకు 105 పరుగులు చేసింది. కెప్టెన్ చండీమల్ (35 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. అశ్విన్, నెహ్రా చెరో 2 వికెట్లు తీశారు. ఈ ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టి20 శుక్రవారం రాంచీలో జరుగుతుంది. టపటపా వికెట్లు కెరీర్ తొలి మ్యాచ్‌ను లంక పేసర్ రజిత సంచలన రీతిలో ప్రారంభించాడు. ఇన్నింగ్స్ రెండో, ఆరో బంతులకు అతను రోహిత్ (0), రహానే (4)లను పెవిలియన్ పంపించాడు. ఆ వెంటనే రెండో ఓవర్‌ను తిసార మెయిడిన్‌గా వేయగా, రజిత వేసిన మరుసటి ఓవర్లో సున్నా వద్ద గుణతిలకే సునాయాస క్యాచ్ వదిలేయడంతో రైనా బతికిపోయాడు. కొద్ది సేపటికి రజిత బౌలింగ్‌లోనే మళ్లీ తప్పు చేయని గుణతిలక థర్డ్‌మ్యాన్‌లో క్యాచ్ పట్టడంతో ధావన్ (9) కూడా వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ స్కోరు 3 వికెట్లకు 40 పరుగులకు చేరింది. ఏ మాత్రం అనుభవం లేని లంక కుర్ర బౌలర్లు టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించాడు. చక్కటి బంతులతో ఒక వైపు వికెట్లు తీస్తూ మరో వైపు పరుగులు కూడా ఇవ్వకుండా నిరోధించారు. షనక ఒకే ఓవర్లో రైనా (20 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), ధోని (2)లను అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లో యువరాజ్ (10) కూడా పెవిలియన్ చేరడంతో భారత్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తొలి సారి బ్యాటింగ్ అవకాశం దక్కిన పాండ్యా (2) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఒక దశలో 35 బంతుల పాటు భారత్ బౌండరీ కొట్టలేకపోయింది! చివర్లో నెహ్రా (6) సహాయంతో అశ్విన్ తొమ్మిదో వికెట్‌కు 28 పరుగులు జోడించడంతో స్కోరు 100 పరుగులు దాటినా ఏడు బంతుల ముందే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఐదో ఓవర్లో 13 పరుగులు మినహా భారత్ ఇన్నింగ్స్‌లో మరే ఓవర్లోనూ కనీసం పది పరుగులు రాలేదు. చండీమల్ దూకుడు నెహ్రా ధాటికి శ్రీలంక కూడా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. డిక్వెలా (4), గుణతిలక (9) వెనుదిరగ్గా...పవర్‌ప్లేలో లంక 28 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే చండీమల్, కపుగెదెర (26 బంతుల్లో 25; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 42 బంతుల్లో 39 పరుగుల కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. జడేజా ఓవర్లో 12 పరుగులు రాబట్టి దూకుడు పెంచిన లంక వేగంగా విజయం దిశగా దూసుకుపోయింది. తక్కువ వ్యవధిలో ఆ జట్టు మరో మూడు వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠను ఎదుర్కొన్నా...లక్ష్యం చిన్నది కావడంతో ఇబ్బంది ఎదురు కాలేదు. సిరివర్దన (14 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ‘గత నెల రోజులుగా మేం ఆడుతున్న పిచ్‌లతో పోలిస్తే ఈ పిచ్ పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడి పేస్, బౌన్స్ చూస్తే భారత్‌లో కంటే ఇంగ్లండ్ తరహా వికెట్‌లాగా కనిపించింది. ఇలాంటి పిచ్‌పై మేం తప్పుడు షాట్లు ఆడాం. ఆరంభంలో బౌలర్లకు అనుకూలించినప్పుడు మరింత జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సింది. తర్వాతి మ్యాచ్‌లో తప్పులు సరిదిద్దుకుంటాం’ - ధోని 2 రైనా కెరీర్లో ఇది 50వ టి20 అంతర్జాతీయ మ్యాచ్. ధోని (56) తర్వాత ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్ రైనా. 0 అంతర్జాతీయ టి20ల్లో 50 ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కనీసం ఒక్క అర్ధ సెంచరీ లేని ఏకైక బ్యాట్స్‌మన్ ధోని ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడింది. లంక టాప్‌లోకి వచ్చింది. అయితే తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిస్తే మళ్లీ భారత్ నంబర్‌వన్‌గా నిలుస్తుంది. స్కోరు వివరాలు:- భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) చమీరా (బి) రజిత 0; ధావన్ (సి) గుణతిలక (బి) రజిత 9; రహానే (సి) చండీమల్ (బి) రజిత 4; రైనా (బి) షనక 20; యువరాజ్ (సి) అండ్ (బి) చమీరా 10; ధోని (సి) డిక్వెలా (బి) షనక 2; పాండ్యా (ఎల్బీ) (బి) షనక 2; జడేజా (ఎల్బీ) (బి) సేననాయకే 6; అశ్విన్ (నాటౌట్) 31; నెహ్రా (సి) సిరివర్దన (బి) చమీరా 6; బుమ్రా (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 101. వికెట్ల పతనం: 1-0; 2-5; 3-32; 4-49; 5-51; 6-53; 7-58; 8-72; 9-100; 10-101. బౌలింగ్: రజిత 4-0-29-3; తిసార 3-1-10-0; సేనానాయకే 3-0-18-1; చమీరా 3.5-0-14-2; షనక 3-0-16-3; ప్రసన్న 2-0-11-0. శ్రీలంక ఇన్నింగ్స్: డిక్వెలా (సి) ధావన్ (బి) నెహ్రా 4; గుణతిలక (సి) ధావన్ (బి) నెహ్రా 9; చండీమల్ (ఎల్బీ) (బి) రైనా 35; కపుగెదెర (ఎల్బీ) (బి) అశ్విన్ 25; సిరివర్దన (నాటౌట్) 21; షనక (సి) రైనా (బి) అశ్విన్ 3; ప్రసన్న (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 105. వికెట్ల పతనం: 1-4; 2-23; 3-62; 4-84; 5-91. బౌలింగ్: నెహ్రా 3-0-21-2; బుమ్రా 4-1-19-0; జడేజా 3-0-18-0; పాండ్యా 3-0-18-0; అశ్విన్ 3-0-13-2; రైనా 2-0-13-1. -
కొత్త అధ్యాయం
* ఆసీస్ గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన ధోని బృందం * 2-0తో టి20 సిరీస్ కైవసం * రెండో మ్యాచ్‌లో 27 పరుగులతో ఓడిన ఫించ్‌సేన మెల్బోర్న్: దుమ్మురేపే బ్యాటింగ్... కళ్లు చెదిరే క్యాచ్‌లు... మెరుపు ఫీల్డింగ్... బౌలర్ల రాణింపు... ప్రతీకారేచ్ఛతో రెచ్చిపోయిన భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో చేసిన సమష్టిపోరాటం ఇది. ఏమాత్రం అలసత్వం చూపకుండా... ఏ అవకాశాన్ని వదలకుండా... అదరహో అన్న రీతిలో ఆడుతూ కంగారూల గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శుక్రవారం ఎంసీజీలో జరిగిన రెండో టి20లోనూ 27 పరుగుల తేడాతో ఫించ్‌సేనపై నెగ్గిన ధోని బృందం... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టి20 సిరీస్‌ను కైవసం చేసుకుని ఈ ఘనత అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 184 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (47 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫామ్‌ను కొనసాగించగా, శిఖర్ ధావన్ (32 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులకే పరిమితమైంది. ఫించ్ (48 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేశాడు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరి టి20 ఆదివారం సిడ్నీలో జరుగుతుంది. సూపర్ భాగస్వామ్యం: తొలి మూడు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసిన రోహిత్, ధావన్ ఆ తర్వాత చెలరేగిపోయారు. బంతి ఎలాంటిదైనా బౌండరీ దాటించడంతో స్కోరు బోర్డు కదం తొక్కింది. ఏడో ఓవర్లో ఫాల్క్‌నర్ సంధించిన బౌన్సర్‌ను ధావన్ సిక్సర్‌గా మల్చడం అతని బ్యాటింగ్‌కే హైలైట్. లయోన్, మ్యాక్స్‌వెల్‌లకు రోహిత్ సిక్సర్ల రుచి చూపెట్టాడు. ఆరు ఓవర్లలో 50 పరుగులు చేసిన భారత్... 11.2 ఓవర్లలో 100 పరుగులను అందుకుంది. తొలి వికెట్‌కు 97 పరుగులు జత చేశాక ధావన్ రివర్స్ స్వీప్‌తో అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన కోహ్లి కూడా ఏమాత్రం తగ్గలేదు. 13వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి ఊపు తెచ్చాడు. ఓవర్‌కు 9 పరుగుల చొప్పున రాబట్టిన కోహ్లి, రోహిత్ రెండో వికెట్‌కు 46 పరుగులు జత చేశారు. 16వ ఓవర్లో రోహిత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన ధోని (14) వేగంగా ఆడాడు. 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లితో కలిసి ధోని మూడో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. ఫించ్ పోరాడినా...: లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఫించ్, మార్ష్ (23) మెరుపు ఆరంభాన్నిచ్చారు. బౌండరీల వర్షం కురిపించడంతో రన్‌రేట్ దూసుకుపోయింది. దీనికి తోడు 9, 10 ఓవర్లలో ఫించ్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను ఉమేశ్, రిషి ధావన్, శిఖర్ ధావన్‌లు జారవిడిచారు. అయితే 10వ ఓవర్లో మార్ష్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో పాండ్యా చక్కగా అందుకోవడం, ఆ వెంటనే తన బౌలింగ్‌లో లిన్ (2)ను వెనక్కిపంపడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఫించ్, మార్ష్‌లు తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 94 పరుగులు జోడించారు. 12వ ఓవర్లో ‘డేంజర్ మ్యాన్’ మ్యాక్స్‌వెల్ (1)ను ధోని స్టంప్ చేశాడు. తర్వాత ఫించ్‌తో జత కలిసిన వాట్సన్ (15) నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా జడేజా కుదురుకోనీయలేదు. 15వ ఓవర్లో కళ్లు చెదిరే రీతిలో రిటర్న్ క్యాచ్ తీసుకోవడంతో ఆసీస్ స్కోరు 124/4గా మారింది. తర్వాతి ఓవర్లో ఎక్స్ట్రా కవర్ నుంచి జడేజా విసిరిన బంతికి ఫించ్ రనౌట్ కావడంతో కంగారులు కుదేలయ్యారు. విజయానికి 61 పరుగులు చేయాల్సిన దశలో జడేజా మరోసారి మ్యాజిక్ చూపెట్టాడు. 17వ ఓవర్లో ఫాల్క్‌నర్‌ను అవుట్ చేస్తే... చివరి ఓవర్లో బుమ్రా యార్కర్లతో హాస్టింగ్స్ (4), టై (4)లను వెనక్కి పంపి చిరస్మరణీయ విజయాన్ని పూర్తి చేశాడు. 1 ఆసీస్ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ గెలవడం భారత్‌కు ఇదే మొదటిసారి. అంతకుముందు 2007-08లో ముక్కోణపు సిరీస్, 1985లో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ను గెలిచారు. స్కోరు వివరాలు:- భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ రనౌట్ 60; ధావన్ (సి) లిన్ (బి) మ్యాక్స్‌వెల్ 42; కోహ్లి నాటౌట్ 59; ధోని (సి) వాట్సన్ (బి) టై 14; రైనా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1-97; 2-143; 3-181. బౌలింగ్: వాట్సన్ 3-0-17-0; హాస్టింగ్ 3-0-35-0; బోలాండ్ 4-0-30-0; ఫాల్క్‌నర్ 3-0-35-0; టై 4-0-28-1; లయోన్ 1-0-15-0; మ్యాక్స్‌వెల్ 2-0-17-1. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ రనౌట్ 74; మార్ష్ (సి) హార్డిక్ పాండ్యా (బి) అశ్విన్ 23; లిన్ (సి) ధోని (బి) హార్డిక్ పాండ్యా 2; మ్యాక్స్‌వెల్ (స్టంప్) ధోని (బి) యువరాజ్ 1; వాట్సన్ (సి అండ్ బి) జడేజా 15; వేడ్ నాటౌట్ 16; ఫాల్క్‌నర్ (స్టంప్) ధోని (బి) జడేజా 10; హాస్టింగ్స్ (బి) బుమ్రా 4; టై (బి) బుమ్రా 4; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-94; 2-99; 3-101; 4-121; 5-124; 6-137; 7-152; 8-157. బౌలింగ్: నెహ్రా 4-0-34-0; బుమ్రా 4-0-37-2; జడేజా 4-0-32-2; అశ్విన్ 4-0-27-1; హార్డిక్ పాండ్యా 2-0-17-1; యువరాజ్ 2-0-7-1. -
బంగ్లాదేశ్‌లో మాత్రం అలా కుదరడం లేదు
ఢాకా: సాధారణంగా భారత క్రికెటర్లు విదేశాలకు వెళితే కావలసినంత ఎంజాయ్ చేస్తారు. ప్రపంచకప్ సమయంలో మ్యాచ్‌ల మధ్య విరామం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాగా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక... ఇలా ఎక్కడ ప్రపంచకప్ జరిగినా.... పబ్‌లు, నైట్‌క్లబ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయడం ధోని సేనకు బాగా ఇష్టమైన వ్యాపకం. కానీ ఈసారి బంగ్లాదేశ్‌లో మాత్రం అలా కుదరడం లేదు. ఢాకాలో నైట్‌క్లబ్‌లు, పబ్‌లు ఉండవు. దీనికి తోడు ఈసారి భద్రత బాగా ఎక్కువ చేశారు. దీంతో మొత్తం ఆటగాళ్లంతా గ్రౌండ్‌కు, హోటల్‌కు పరిమితమవుతున్నారు. ప్రాక్టీస్, మ్యాచ్ లేకపోతే గదుల్లోంచి బయటకు కూడా రావడం లేదు. వీడియో గేమ్స్, చాటింగ్‌లతో కాలక్షేపం చేస్తూ ‘గూట్లో పక్షులు’గా మారారు. పాపం..!