అమ్మకు ప్రేమతో...
తల్లి పేరుతో బరిలోకి దిగిన భారత క్రికెటర్లు
భారత క్రికెటర్లు అమ్మలకు అభిషేకం చేశారు. తమ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో నాన్నతో పాటు అమ్మకు కూడా అంతే భాగం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. టీమ్ స్పాన్సర్ స్టార్ ప్లస్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘నయీ సోంచ్’ అనే కార్యక్రమం కోసం శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో వారి పేర్లను ప్రదర్శించి తమ ప్రేమను, గౌరవాన్ని చాటారు. మన ఆటగాళ్లం తా తల్లి పేరు రాసి ఉన్న జెర్సీలను ధరించి బరిలోకి దిగారు.
ధోనికి బదులుగా దేవకి, కోహ్లికి బదులుగా సరోజ్, రోహిత్ జెర్సీపై పూర్ణిమ, బుమ్రా చొక్కాపై దల్జీత్... ఇలా పేర్లు కనిపించారుు. ఇలా క్రికెటర్లు తమ పేరు కాకుండా మరో పేరుతో మైదానంలో ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం. స్టార్ ప్లస్, బీసీసీఐ కలిసి ఈ ‘కొత్త ఆలోచన’ను అమల్లోకి తీసుకు వచ్చారుు. కొన్నాళ్లుగా దీని గురించి టీవీలో ప్రముఖంగా ప్రచారం చేయగా, ఇప్పు డు మ్యాచ్‌ను కూడా అదే డ్రెస్‌తో ఆడారు.