న్యూఢిల్లీ: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తమకు కొత్తగా జారీ చేసిన రెండో షోకాజ్ నోటీసులకు బదులిస్తూ తమను మన్నించాలని వీరిద్దరు విజ్ఞప్తి చేశారు. అయితే సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ ఆదేశాలను అనుసరించి బోర్డు నిబంధన 41 (సి) ప్రకారం వీరిద్దరిపై సీఈఓ రాహుల్ జోహ్రి విచారణ కొనసాగిస్తారు.
అయితే ఇటీవలే అమ్మాయిలను వేధించిన ఆరోపణలు ఎదుర్కొన్న జోహ్రితోనే విచారణ జరిపించడంపై సీఓఏ మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే విచారణ ‘కంటితుడుపు’గానే భావించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. దీనిపై వినోద్ రాయ్ వివరణ ఇస్తూ...ఎడుల్జీకి లేఖ రాశారు. ‘పాండ్యా, రాహుల్‌ను సరిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది. వారి కెరీర్‌ను నాశనం చేయాలనుకోవడం లేదు. బోర్డు నియమావళి ప్రకారమే సీఈఓ విచారణ చేస్తున్నారు తప్ప అది కంటితుడుపు కాదు’ అని రాయ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment