smruthi mandhana
-
WPL 2024: అలుపెరుగక దూసుకుపోయిన.. సూపర్ 'స్మృతి' మందాన
సాంగ్లీ.. మహారాష్ట్రలో ఒక చిన్న పట్టణం.. శ్రవణ్ అనే కుర్రాడు క్రికెట్ నెట్స్‌లో తీవ్రంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రాష్ట్ర జట్టులోకి ఎంపికయ్యేందుకు ఆ అబ్బాయి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. అతని చెల్లెలు తన తండ్రితో కలిసి అక్కడే అన్న ఆటను చూస్తోంది. అప్పటి వరకు క్రికెట్ అంటే ఏమిటో కూడా ఆ అమ్మాయికి తెలీదు. అయితే అప్పటికే కొన్నిసార్లు అన్న పేరు, అతను సాధించిన స్కోర్లతో న్యూస్పేపర్లలో వచ్చింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూతురి ఆసక్తి చూసిన నాన్న ‘నువ్వు కూడా ఆడతావా’ అని అడిగాడు. ఆ వెంటనే అమ్మాయి నా పేరు కూడా పేపర్లో వస్తుందా అని నాన్నను అడిగేసింది. వెంటనే కల్పించుకున్న తల్లి.. ‘పదో తరగతి పరీక్షల్లో 96 శాతం వస్తే నీ పేరు కచ్చితంగా వస్తుంది’ అని సర్దిచెప్పింది. కానీ ఆ అమ్మాయి మనసులో మాత్రం ఒక మాట ఉండిపోయింది. పదో తరగతి పరీక్షా ఫలితాల కంటే క్రికెట్ ద్వారా పేరు తెచ్చుకోవడమే బాగుంటుందనిపించింది. అంతే.. తన మనసులో మాట చెప్పగానే తండ్రి అభ్యంతరం చెప్పలేదు. నాన్న అండగా ఉంటే తిరుగేముంది.. ఆ అమ్మాయి తర్వాతి రోజుల్లో అన్నీ పక్కన పెట్టి పూర్తిగా క్రికెట్ పైనే దృష్టి పెట్టింది. 16 ఏళ్ల వయసు తిరిగే సరికే భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించి తానేంటో రుజువు చేసుకుంది. అండర్–19 స్థాయి తర్వాత అన్న ఆటకు గుడ్‌బై చెప్పిన ఉద్యోగ వేటలో పడిపోగా.. చెల్లెలు మాత్రం కుటుంబం ప్రోత్సాహంతో దూసుకుపోయింది. ఆ ప్లేయరే భారత ఓపెనర్ స్మృతి మంధానా. ప్రస్తుతం మన మహిళల టీమ్‌లో టాప్ బ్యాటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్ హోదాలో బెంగళూరు టీమ్‌ను విజేతగా నిలిపి తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించింది. స్మృతి విజయప్రస్థానంలో కీలకమైన అంశం ఆమెకు కుటుంబసభ్యుల నుంచి లభించిన ప్రోత్సాహం. వస్త్రవ్యాపారి అయిన తండ్రి మొదటి రోజు నుంచే క్రికెట్లో ప్రోత్సహించగా, ఒక టీనేజ్ అమ్మాయి అవసరాలను దగ్గరి నుంచి చూసుకుంటూ తల్లి అన్ని రకాలుగా వెంట నిలిచింది. ఇక క్రికెట్ మానేసి బ్యాంక్ ఉద్యోగంలో చేరిన అన్న శ్రవణ్ ఆమెకు మార్గదర్శిగా వ్యవహరించడమే కాకుండా స్మృతి ప్రాక్టీస్‌లో అన్ని సమయాల్లో తానే వెంట ఉంటూ ఆమెకు నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ తన వంతు సహకారం అందించాడు. సరిగ్గా చెప్పాలంటే ఒక్కసారి కెరీర్‌ను ఎంచుకున్న తర్వాత ఏ దశలోనూ ఆమె ప్రయాణానికి అడ్డంకులు రాలేదు. మధ్యలో ఒక్కసారి మాత్రం అన్నలాగే ఆటను మానేసి తనకిష్టమైన సైన్స్ చదువుకుందామనే ఆలోచన వచ్చినా, అప్పటికే ఆమె ఎదుగుతున్న తీరు ఆ ఆలోచనకు ఫుల్స్టాప్ పెట్టేశాయి. ఎందుకంటే 11 ఏళ్ల వయసుకే మహారాష్ట్ర అండర్–19 టీమ్‌లో చోటు దక్కించుకున్న స్మృతికి మున్ముందు దూసుకుపోవడమే మిగిలింది. నాలుగేళ్ల తర్వాత మహారాష్ట్ర సీనియర్ టీమ్‌లో అవకాశం లభించింది. తొలి మ్యాచ్‌లోనే సౌరాష్ట్రపై 155 పరుగులు బాది ఆమె వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర జట్టుకు వరుస విజయాలు అందించిన తర్వాత మహిళల టీమ్‌ల కోసం ప్రత్యేకంగా బీసీసీఐ నిర్వహించిన చాలెంజర్ టోర్నీలో టాప్‌స్కోరర్‌గా సత్తా చాటడంతో స్మృతి ఆట పదును ఏమిటో అందరికీ తెలిసింది. అంచెలంచెలుగా దూసుకుపోయి.. భారత టి–20 జట్టు తరఫున తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన స్మృతి మరో ఐదు రోజులకే వన్డేల్లోనూ అరంగేట్రం చేసింది. అంతర్జాతీయ వేదికపై ఆడటానికి కొద్ది రోజుల ముందే భారత దేశవాళీ వన్డేలో డబుల్ సెంచరీ (224) బాదిన స్మృతి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచింది. ఒక్కసారి టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఆమె ఏ దశలోనూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఓపెనర్‌గా జట్టు వరుస విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. వరుసగా నాలుగేళ్ల పాటు వన్డేలు, టి–20ల్లో రెగ్యులర్ మెంబర్‌గా తనకు పోటీ లేకుండా జట్టులో స్మృతి కొనసాగింది. 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ నుంచి ఏకంగా ఎనిమిది మంది అరంగేట్రం చేయగా, వారిలో స్మృతి కూడా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో జట్టు విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఇదే జోరులో విదేశీ లీగ్ టీమ్‌లను కూడా ఆకర్షించడంతో ఆస్ట్రేలియా విమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో తొలిసారి ఆడే అవకాశం దక్కింది. అయితే అనూహ్యంగా అది స్మృతికి కొంత సమస్యగా కూడా మారింది. కాలికి తీవ్ర గాయం కారణంగా టోర్నీనుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో పాటు భారత జట్టుకు కూడా ఐదేళ్లు దూరం కావాల్సి వచ్చింది. కొత్తగా బరిలోకి దిగి.. ఇంగ్లండ్ వేదికగా 2017 జూన్‌లో వన్డే వరల్డ్ కప్.. భారత్, ఆతిథ్య ఇంగ్లండ్ మధ్య లీగ్ మ్యాచ్. ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్మృతి 72 బంతుల్లోనే 90 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా భారత్‌ను గెలిపించింది. అయితే ఆట కంటే ఆమె మరో రకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. నాలుగేళ్ల కెరీర్ తర్వాత తొలిసారి స్మృతి కంటి అద్దాలు లేకుండా మైదానంలోకి దిగింది. అప్పటి వరకు ఆమెను గ్రౌండ్లో కంటి అద్దాలతోనే అందరూ చూశారు. గాయం కారణంగా వచ్చిన విరామంలో ఆమె తన శస్త్ర చికిత్సతో తన లుక్‌ను కూడా మార్చుకుంది. ఈ సమయం తన కెరీర్లో కొత్త మార్పుకు సూచికగా భావించానని, ఇకపై కొత్త స్మృతిని చూస్తారని ఆమె స్వయంగా చెప్పుకుంది. నిజంగానే కెరీర్ పరంగా కూడా స్మృతికి సంబంధించి అదో మరో మలుపు. తర్వాతి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌పై సెంచరీ కూడా సాధించి వరల్డ్ కప్‌లో ఆమె తన జోరు కొనసాగించింది. వరల్డ్ కప్ తర్వాత వెంటనే జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ శతకంతో చెలరేగింది. ఏడాది తిరిగే లోపే న్యూజిలాండ్ వేదికగా మరో సెంచరీ కొట్టేసింది. ఈ రెండేళ్ల కాలం ఆమె కెరీర్లో అత్యద్భుతంగా సాగింది. రికార్డులే రికార్డులు.. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘకాలం పాటు భారత మహిళల క్రికెట్‌ను మిథాలీ రాజ్ శాసించింది. మన జట్టుకు సంబంధించి అన్ని ఘనతలనూ ఆమెనే సాధించింది. అయితే తర్వాతి తరంలో స్మృతి అలాంటి ఫామ్‌ను చూపించింది. పైగా వన్డేలతో పాటు ఈతరం ప్రతినిధిగా టి–20 క్రికెట్లో కూడా స్మృతి తన స్థాయిని చూపించింది. క్రికెట్‌కు సంబంధించి నాలుగు విదేశీ పర్యటనలను కఠినమైనవిగా భావిస్తారు. ‘సేన’ అంటూ పిలుచుకునే (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఇందులో ఉన్నాయి. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ నాలుగు దేశాల్లోనూ వన్డేల్లో సెంచరీ చేసిన అత్యంత అరుదైన రికార్డు స్మృతి పేరిట ఉంది. అంతర్జాతీయ టి–20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (24 బంతుల్లో) ఆమెనే సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో ఆమె సభ్యురాలు. అద్భుతమైన ఆటతో విదేశీ లీగ్‌లను కూడా ఆకట్టుకున్న స్మృతి బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్, సదరన్ బ్రేవ్, వెస్టర్న్ స్టార్మ్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించింది. అయితే బీసీసీఐ నిర్వహించే విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో బెంగళూరు టీమ్‌ను విజేతగా నిలపడం ఆమె స్థాయిని మరింత పెంచింది. పురుషుల విభాగంలో ఐపీఎల్లో 16 సీజన్లు ఆడినా బెంగళూరుకు ఇప్పటి వరకు ట్రోఫీ దక్కలేదు. కానీ రెండో ప్రయత్నంలోనే మహిళల టీమ్ దానిని సాధించడంలో అటు ప్లేయర్‌గా, ఇటు కెప్టెన్‌గా స్మృతికే ఘనత దక్కుతుంది. గత ఏడాది తొలి సీజన్లో 2 మ్యాచ్‌లే గెలిచి నాలుగో స్థానానికి పరిమితమైన టీమ్‌ను ఈ సారి విజేతగా మలచడం అసాధారణం. మున్ముందు భారత మహిళల క్రికెట్‌కు చుక్కానిలా ముందుండి నడిపించగల సామర్థ్యం స్మృతికి ఉందనేది వాస్తవం. 2018లో అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్షిక అవార్డుల్లో అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డును స్మృతి సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ఆమె ఆటకు అర్జున పురస్కారంతో గౌరవించింది. దీనికి తోడు బ్రాండింగ్ ప్రపంచంలో కూడా ఆమె ఇప్పుడు పెద్ద సెన్సేషన్. సహజంగానే ఆటకు అందం తోడవడంతో పలు కంపెనీలు స్మృతితో ఒప్పందాలు చేసుకున్నాయి. గల్ఫ్ ఆయిల్, హావెల్స్, పవర్ షూస్, హెర్బలైఫ్, రెడ్‌బుల్, ఈక్విటాస్, హీరో, బూస్ట్, హ్యుందాయ్ మోటార్స్, మాస్టర్‌కార్డ్, గార్నియర్, పీఎన్బీ మెట్‌లైఫ్ తదితర సంస్థల కోసం స్మృతి పని చేసింది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, నేర్పించింది ఆమె! -
మథ్యూస్ ఆల్‌రౌండ్ షో.. ఆర్సీబీని చిత్తు చేసిన ముంబై
మథ్యూస్ ఆల్‌రౌండ్ షో.. ముంబై ఘన విజయం మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ముంబై విజయభేరి మోగించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. కేవలం 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి చేధించింది. ముంబై విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మాథ్యూస్ కీలక పాత్ర పోషించింది. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన మాథ్యూస్, బ్యాటింగ్‌లో 77 పరుగులతో ఆజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మాథ్యూస్‌తో పాటు నాట్ స్కివర్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. 29 బంతులు ఎదుర్కొన్న స్కివర్ 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. అమీలియా కేర్, ఇషాక్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో రిచా ఘోష్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతో పాటు మంధాన(23), కనికా అహుజా(22) పరుగులతో రాణించారు. ►10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్(50), నాట్ స్కివర్(22) పరుగులతో ఉన్నారు. ►6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్(31), నాట్ స్కివర్(0) పరుగులతో ఉన్నారు. ►156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 2 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్,యస్తికా భాటియా ఉన్నారు. ►టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. అమీలియా కేర్, ఇషాక్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో రిచా ఘోష్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతో పాటు మంధాన(23), కనికా అహుజా(22) పరుగులతో రాణించారు. ►18 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. క్రీజులో స్కాట్(14), రేణుకా సింగ్ ఉన్నారు. ►71 పరుగులు వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన పెర్రీ రనౌట్ రూపంలో వెనుదిరిగింది. 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో రిచాఘోష్, కనికా ఉన్నారు. 43 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ కేవలం 43 పరుగులుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధాన(11), డివైన్(6),దిశా కసత్(0), నైట్(0) పెవిలియన్‌కు చేరారు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్, సైకా ఇషాక్ చెరో రెండు వికెట్లు సాధించారు. ►2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన(11), డివైన్(6) పరుగులతో ఉన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్-2023 తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసిన ఆర్సీబీ.. ఇప్పుడు బ్రబౌర్న్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బెంగళూరు మాత్రం ఒక మార్పు చేసింది. తుది జట్లు: ముంబై ఇండియన్స్ : యస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, దిశా కసత్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, కనికా అహుజా, మేగన్ షుట్, శ్రేయాంక పాటిల్, ప్రీతీ బోస్, రేణుకా ఠాకూర్ సింగ్ -
మహిళల టీ20 ఛాలెంజ్.. జట్టులను ప్రకటించిన బీసీసీఐ
మహిళల టీ20 ఛాలెంజ్-2022 కోసం బీసీసీఐ జట్టులను సోమవారం ప్రకటించింది. టీ20 ఛాలెంజ్ కప్ మే 23న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ట్రైల్‌బ్లేజర్స్‌తో సూపర్నోవాస్ తలపడనుంది. ఫైనల్ మే 28న జరుగుతుంది. కాగా మ్యాచ్‌లు అన్నీ పూణెలోని ఎంసీఎ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ట్రైల్‌బ్లేజర్స్‌కు స్మృతి మందాన సారథ్యం వహిస్తుండగా.. సూపర్నోవాస్కు హర్మన్‌ప్రీత్ కౌర్, వెలాసిటీకు దీప్తి శర్మ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక మహిళ టీ20 ఛాలెంజ్ చివరగా 2020లో జరిగింది. గతేడాది కరోనా కారణంగా బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహించలేదు. ట్రైల్బ్లేజర్స్ స్మృతి మంధాన (కెప్టెన్), పూనమ్ యాదవ్ (వైస్ కెప్టెన్), అరుంధతి రెడ్డి, హేలీ మాథ్యూస్, జెమీమా రోడ్రిగ్స్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎస్. మేఘన, సైకా ఇషాక్, సల్మా ఖాతున్, షర్మిన్ అక్టర్, సోఫియా బ్రౌన్, సోఫియా బ్రౌన్, మల్లిక్, ఎస్.బి.పోఖార్కర్ వెలాసిటీ: దీప్తి శర్మ (కెప్టెన్), స్నో రానా (వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, అయాబొంగా ఖాకా, కె.పి. నవ్‌గిరే, కాథరిన్ క్రాస్, కీర్తి జేమ్స్, లారా వోల్వార్డ్, మాయా సోనావానే, నత్తకాన్ చంతమ్, రాధా యాదవ్, ఆర్తీ కేదార్, సిమ్రాన్ షిండే, సిమ్రాన్ షిండే యాస్తిక భాటియా, ప్రణవి చంద్ర సూపర్నోవాస్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భాటియా (వైస్ కెప్టెన్), అలనా కింగ్, ఆయుష్ సోని, చందు వి, డియాండ్రా డోటిన్, హర్లీన్ డియోల్, మేఘనా సింగ్, మోనికా పటేల్ ముస్కాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పునియా, రాశి కనోజియా, సోఫీ ఎక్లెస్టోన్, సునే లూస్, మాన్సీ జోషి చదవండి: IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్.. సీనియర్ ఆటగాడు దూరం..! -
డివిలియర్స్‌ను గుర్తు చేస్తూ.. అద్భుతమైన షాట్ ఆడిన భారత ఓపెనర్!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న కీలక మ్యాచ్‌లో భారత యువ సంచలనం షఫాలీ వర్మ అదరగగొట్టింది. 46 బంతుల్లో 53 పరుగులు చేసిన షఫాలీ వర్మ భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ అద్భుతమైన షాట్లుతో అలరించింది. కాగా ఈ మ్యాచ్‌లో షఫాలీ... దక్షిణాఫ్రికా దిగ్గజం డివిలియర్స్‌ను తలపించేలా స్కూప్ షాట్ ఆడింది. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇస్మాయిల్ బౌలింగ్‌లో.. షఫాలీ వికెట్లు విడిచి పెట్టి ఆఫ్ సైడ్ వచ్చి అద్భుతమైన స్కూప్ షాట్ ఆడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(71), షఫాలీవర్మ(53) కెప్టెన్ మిథాలీ రాజ్(68), హర్మన్ ప్రీత్‌కౌర్ (48) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్, మసబాట క్లాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అయబోంగా ఖాకా,ట్రాయన్ ఒక్కో వికెట్ సాధించారు. చదవండి: World Cup 2022 Ind W Vs SA W: కీలక మ్యాచ్.. అదరగొట్టిన స్మృతి, షఫాలీ, మిథాలీ.. హర్మన్ సైతం. View this post on Instagram A post shared by ICC (@icc) -
క్రీడా స్ఫూర్తి చాటుకున్న మంధాన.. తనకు దక్కిన అవార్డును!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీలు సాధించి కీలక పాత్ర పోషించారు. మంధాన 119 బంతుల్లో 123 పరుగులు చేయగా, హర్మన్‌ప్రీత్ 107 బంతుల్లో 109పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో 119 పరగులు చేసిన స్మృతి మంధాన ఎంపికైంది. అయితే ఇక్కడే మంధాన తన క్రీడా స్పూర్తిను చాటుకుంది. తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పంచుకుంది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మంధాన మాట్లాడుతూ.. "నేను సెంచరీ సాధించాను, కాబట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపిక అవ్వాలని ఒక క్రికెటర్‌గా నేను ఎప్పుడూ కోరుకోను. మా జట్టు 300 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో మేమిద్దరం సమానంగా సహకరించామని నేను భావిస్తున్నాను. కాబట్టి, ట్రోఫీని హర్మన్‌తో పంచుకోవాలి అనుకున్నాను. అదే విధంగా అవార్డు పొందడానికి మేమిద్దరం అర్హులమని నేను అనుకుంటున్నాను. మేము న్యూజిలాండ్, పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మా తప్పులను మేము గ్రహించాం. ఇకపై వాటిని మేము పునరావృతం చేయబోమని భావిస్తున్నాను" అని మంధాన పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగల భారీ స్కోర్ సాధించింది. ఇక 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 162 పరుగులకే కుప్ప కూలింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టగా.. ఝులన్ గోస్వామి ఒకటి, మేఘన సింగ్ 2, రాజేశ్వరీ గైక్వాడ్ ఒకటి, పూజా వస్త్రాకర్ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: Ind Vs Sl 2nd Test: అప్పుడు సెహ్వాగ్ .. ఇప్పుడు మయాంక్ అగర్వాల్.. తొమ్మిదేళ్ల తర్వాత! -
ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు షాక్.. స్టార్ ఓపెనర్ తలకు గాయం!
ICC Women's World Cup: ఐసీసీ మహిళల ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తలకు గాయమైంది. భారత ఇన్నింగ్స్ 2 ఓవర్లో దక్షిణాఫ్రికా బౌలర్ ఇస్మాయిల్ బౌన్సర్ వేసింది. బౌన్సర్ బంతిని పుల్ షాట్ ఆడటానికి మంధాన ప్రయత్నించగా.. అది మిస్ అయ్యి మంధాన హెల్మెట్‌కు బలంగా తగిలింది. అయితే వెంటనే ఫీల్డ్‌లోకి ఫిజియో వచ్చి మంధానను పరిశీలించాడు. అయితే ఆమెకు ఎలాంటి కంకషన్ లక్షణాలు కనిపించలేదు. దీంతో ఆమెకు తగిలిన గాయం అంత తీవ్రమైనది కాదని ఫిజియో నిర్ధారించాడు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మంధాన ఫీల్డ్‌ను విడిచి వెళ్లింది. 12 పరుగులు చేసిన ఆమె రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు సాధించి. భారత బ్యాటర్లలో హర్మాన్ ప్రీత్ కౌర్ సెంచరీతో మెరిసింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మాన్ ప్రీత్ కౌర్(103), యస్తికా భాటియా(58) పరుగులతో రాణించారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటిస్ జట్టు 242 పరుగులకే పరిమితమైంది. చదవండి: Rohit Sharma: రోహిత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చేటపుడు జాగ్రత్త.. పట్టిందల్లా బంగారమే: టీమిండియా మాజీ క్రికెటర్ -
హమ్మయ్య.. మొత్తానికి భారత్ గెలిచింది
న్యూజిలాండ్ పర్యటనలో వరుస నాలుగు ఓటమిల తర్వాత.. ఐదో వన్డే గెలిచి భారత మహిళల జట్టు వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. ఓవల్ వేదికగా జరగిన అఖరి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత విజయంలో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కేర్(66), సోఫియా డివైన్(34),లారెన్ డౌన్(30) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గైక్వాడ్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(71), హర్మన్ ప్రీత్ కౌర్(63), మిథాలీ(57) పరగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా ఐదు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 4-0తేడాతో కైవసం చేసుకుంది. ఇక వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమీలియా కేర్‌కి మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. చదవండి: Bhanuka Rajapaksa: అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన లంకేయులు -
వన్డేల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ.. తొలి భారత క్రికెటర్‌గా!
భారత మహిళా క్రికెటర్ రిచా ఘోష్ వన్డే క్రికెట్లో అరుదైన రికార్డును సాధించింది. వన్డేల్లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ సాధించిన తొలి భారత మహిళా బ్యాటర్‌గా ఘోష్ రికార్డులకెక్కింది. న్యూజిలాండ్‌లో జరిగిన నాలుగో వన్డేలో 26 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన రిచా.. ఈ అరుదైన ఘనత సాధించింది. అంతకుమందు 2018లో దక్షిణాఫ్రికాపై వేదా కృష్ణమూర్తి 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. అదే విధంగా న్యూజిలాండ్‌లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ కూడా రిచాదే కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత జట్టుపై 63 పరుగుల తేడాతో ఘన విజయం న్యూజిలాండ్ సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 128 పరగులకే ఆలౌటైంది. చదవండి: ICC World Cup 2023: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్!? Richa Ghosh brings up the fastest fifty by an Indian batter in Women's ODI 🔥 She needed just 26 balls to reach the milestone 👏 Watch all the #NZvIND action LIVE or on-demand on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 pic.twitter.com/ad34maGg4A — ICC (@ICC) February 22, 2022 -
స్మృతి మంధాన కళ్లు చెదిరే క్యాచ్.. సూపర్ రీ ఎంట్రీ కదా!
Smriti Mandhana Catch: న్యూజిలాండ్ మహిళలతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఓసెనర్ స్మృతి మంధాన అద్భుతమైన క్యాచ్‌తో మెరిసింది. క్వారంటైన్ నిభందనల కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన స్మృతి నాలుగో వన్డేకు తిరిగి జట్టులోకి వచ్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన రేణుకా సింగ్ బౌలింగ్‌లో.. సోఫియా డివైన్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించింది. అయితే పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న మంధాన డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. కాగా మంధాన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కేర్(68), బేట్స్(41),డివైన్(32) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 2 వికెట్లు పడగొట్టగా, మేఘనా సింగ్,దీప్తి శర్మ చెరో వికెట్ సాధించారు. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 128 పరగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్(52), మిథాలీ రాజ్(30) పరుగలతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కివీస్ బౌలర్లలో కేర్, జానేసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, జేస్ కేర్ చెరో రెండు వికెట్లు సాధించారు. Oh YAAAS! Smriti Mandhana!!#NZvIND #CricketTwitter pic.twitter.com/0fy0JJ60BE — Krithika (@krithika0808) February 22, 2022 -
న్యూజిలాండ్‌తో ఏకైక టీ20.. భారత జట్టు ఓటమి
క్వీన్స్టౌన్ వేదికగా జరిగిన ఏకైక టీ20లో భారత్‌పై న్యూజిలాండ్ మహిళల జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బ్యాటర్లలో సబ్భినేని మేఘన(37), యస్తికా భాటియా(26) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కేర్, అమేలియా కెర్, జాన్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సుజీ బేట్స్(36), డివైన్( 31) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌కు బారత జట్టు సీనియర్ ఓపెనర్ స్మృతి మంధాన దూరమైంది. ఇక న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు 5 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే శనివారం జరగనుంది. చదవండి: MS Dhoni Gym Video: అదీ ధోని భాయ్ అంటే.. ఎంతో ఓపికగా జిమ్‌లో.. వీడియో వైరల్ -
మిథాలీ రాజ్ ర్యాంక్ యథాతథం..
ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు మిథాలీ రాజ్, స్మృతి మంధాన స్థానాల్లో ఎటువంటి మార్పు లేదు. 738 రేటింగ్స్‌తో మిథాలీ మూడో స్థానంలో కొనసాగుతుండగా... 710 రేటింగ్స్‌తో స్మృతి ఆరో ర్యాంక్‌లో నిలిచింది. వీరిద్దరు మినహా మరో భారత బ్యాటర్ టాప్–10లో చోటు దక్కించుకోలేదు. బౌలింగ్ విభాగంలో టీమిండియా వెటరన్ పేసర్ జులన్ గోస్వామి రెండో స్థానంలో ఉంది. చదవండి: Trent Boult: బస్ డ్రైవర్‌ను హగ్ చేసుకున్న కివీస్ స్టార్ బౌలర్ -
మెరిసిన స్మృతి మంధాన .. సిడ్నీ థండర్స్ ఘన విజయం
మెక్కే (ఆ్రస్టేలియా): భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (39 బంతుల్లో 45; 6 ఫోర్లు) మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెరిసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చక్కని ప్రదర్శనతో పాటు జట్టుకు ఉపయోగపడే భాగస్వామ్యంతో డిఫెండింగ్ చాంపియన్ సిడ్నీ థండర్స్‌ను గెలిపించింది. మొదట సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. సిక్సర్స్ జట్టుకు ఆడుతున్న భారత ప్లేయర్ షఫాలీ వర్మ (8) నిరాశపరిచింది. సిడ్నీ థండర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో భారతీయ క్రికెటర్ దీప్తి శర్మ వికెట్లను నేరుగా గిరాటేయడంతో షఫాలీ రనౌటైంది. తర్వాత 15.2 ఓవర్లలోనే సిడ్నీ థండర్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కొరినె హాల్ (19)తో కలిసి తొలి వికెట్‌కు స్మృతి 53 పరుగులు జోడించడం విశేషం. చదవండి: T20 World Cup: మార్టిన్ క్రో ఆత్మ శాంతించేదెప్పుడు? -
డ్యాన్స్‌తో అదరగొట్టిన స్మృతి మంధాన... నెటిజన్లు ఫిదా
Smriti Mandhana Dance Video Viral: ఎప్పుడూ మ్యాచ్‌లు, టూర్లతో బిజీగా ఉండే క్రికెటర్లు అప్పుడప్పుడు వాళ్ల ఆటతోనే కాదు డ్యాన్స్‌లతోనూ సరదగా అభిమానులను అలరిస్తుంటారు. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఆమె సహచరులతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఆమె సహచరులు హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ , రాధా యాదవ్‌తో కలిసి 'ఇన్ డా ఘెట్టో' అనే పాటకు డ్యాన్స్ వేసింది. ఈ వీడియోను మంధాన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. స్మృతి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఈ వీడియో షేర్ చేసిన మంధాన.. వీడియో చేయాలనే ఆలోచన తనది కాదంటూ క్యాప్షన్ పెట్టింది. దీనిపై స్పందించిన ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్... ఇది కచ్చితంగా స్మృతి మంధాన పనేని ఫన్నీగా కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరింతా మహిళల బిగ్ బాష్ లీగ్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నారు. చదవండి: భారత్‌తో తలపడే పాక్ జట్టు ఇదే: ఆకాష్ చోప్రా View this post on Instagram A post shared by Smriti Mandhana (@smriti_mandhana) -
భారత మహిళా జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన..!
Powar Foresees A New Captain Smriti Mandhana: గోల్డ్‌కోస్ట్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా మహిళల చేతిలో ఓటమి పాలైన భారత్ సిరీస్‌ను చేజార్చుకుంది. అంతక ముందు జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఓటమి పాలై ఘోర పరాభవాన్ని భారత్ మూటకట్టుకుంది. ఈ క్రమంలో జట్టు హెడ్ కోచ్ రమేశ్ పవార్ కీలక వాఖ్యలు చేశారు. భారత జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన త్వరలోనే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటుందని పవార్ తెలిపారు. టెస్టులో స్మృతి మంధాన బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉందని, ఏదో ఒకరోజు ఆమె జట్టును నడిపిస్తుందని ఆయన అన్నారు. "మేము ఆమెను భారత జట్టు సారధిగా చూడాలని అనుకుంటున్నాము. ‘ఆమె ప్రస్తుతం జట్టు వైస్ కెప్టెన్‌గా ఉంది. ఏదో ఒక సమయంలో ఆమె ఈ జట్టుకు నాయకత్వం వహిస్తుంది. ఏ ఫార్మాట్‌కు స్మృతి కెప్టెన్‌గా ఎంపిక అవుతోందో నాకు తెలియదు. బీసీసీఐ, సెలెక్టర్లు, నేను తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాము’ అని పవార్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగినన రెండో వన్డే మ్యాచ్‌లో 86 పరుగులు చేసిన స్మృతి మంధాన, పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో 127 పరుగులు చేసి డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖరి టీ20 మ్యాచ్‌లోను 52 పరుగులు చేసి రాణించింది. చదవండి: IPL 2021: ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కీలక ప్రకటన -
మూడో టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియాదే
Australia seal the T20I series Against India: గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టుపై 14 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 2-0తో ఆస్ట్రేలియా సీరీస్‌ను కైవసం చేసుకుంది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే షఫాలీ వర్మ వికెట్ కోల్పోయినప్పటకీ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో స్మృతి మంధాన ఆర్ధసెంచరీనీ పూర్తి చేసుకుంది. మంధాన 49 బంతుల్లో 8 ఫోర్లుతో 52 పరుగులు సాధించింది. మంధాన ఔటయ్యక సారథి హర్మన్‌ప్రీత్ కౌర్, పూజా వస్త్రకర్, హార్లీన్ డియోల్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రిచా ఘోష్ (11 బంతుల్లో 22 నాటౌట్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చివరలో దూకుడుగా ఆడినా భారత్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయింది. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నికోలా క్యారీ రెండు వికెట్లు పడగొట్టగా, సదర్లాండ్, యాష్లే గార్డనర్, జార్జియా వారహమ్ చెరో వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 5వికెట్లకు 149 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్స్‌లో మెక్‌గ్రాత్(61), బెత్ మూనీ(44) పరుగలుతో రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్,రేణుకా సింగ్ చెరో వికెట్ సాధించారు. -
పింక్ బాల్ టెస్టుకు వరుణుడి అడ్డంకి..సెంచరీకి చేరువలో స్మృతి మంధాన
Pink Ball Test: భారత్, ఆస్ట్రేలియా మహిళల మధ్య జరుగుతున్నచరిత్రత్మాక డే అండ్ నైట్ టెస్టు మొదటి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. క్వీన్స్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 44.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 132 పరుగులు చేసింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన , షెఫాలి వర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 93 పరుగల బాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా 64 బంతుల్లో 31 పరగులు చేసిన షెఫాలి తొలి వికెట్‌గా వెనుదిరిగింది. స్మృతి మంధాన 144 బంతుల్లో 80 పరగులు చేసి సెంచరీకు చేరువలో ఉంది. ప్రస్తుతం మంధాన, పూనమ్ రౌత్ క్రీజులో ఉన్నారు. చదవండి: IPL 2021 2nd Phase RCB Vs RR: ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ బౌలర్ సరికొత్త రికార్డు.. -
బిగ్‌బాష్ టి20 లీగ్‌లో తొలిసారిగా ఆడనున్న భారత స్టార్ ఆల్‌రౌండర్..
Smriti Mandhana And Deepti Sharma Play In Women's Big Bash League: మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్‌లో భారత క్రికెటర్లు స్మృతి మంధాన, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ డిఫెండింగ్ చాంపియన్ ‘సిడ్నీ థండర్’ తరఫున ఆడతారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న ఇంగ్లండ్ ప్లేయర్లు హీతర్ నైట్, టామీ బీమండ్ స్థానాల్లో వీరికి చోటు దక్కింది. బిగ్‌బాష్ లీగ్‌లో స్మృతికి ఇది మూడో జట్టు. గతంలో ఆమె బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హరికేన్స్ జట్ల తరఫున ఆడింది. దీప్తి శర్మ ఈ టోర్నీలోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. చదవండి: Indw vs Ausw: తమ వన్డేల చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా -
భారత మహిళల రికార్డు ఛేజింగ్.... ఆసీస్ విజయాలకు బ్రేక్
Australia Women vs India Women: ఆస్ట్రేలియాతో జరిగన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా వైట్‌వాష్ పరాభవాన్ని తప్పించుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం 265పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇన్నింగ్స్ 10 ఓవర్లో ఫామ్‌లో ఉన్న మంధాన వికెట్‌ను భారత్ కోల్పోయింది. ఆనంతరం క్రీజులోకి వచ్చిన యస్తిక భాటియా, షఫాలీ వర్మ కలిసి 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యస్తిక భాటియా(69 బంతుల్లో 9 ఫోర్లతో 64), షెఫాలీ వర్మ(91 బంతుల్లో 7 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో చేలరేగారు. ఈ భాగస్వామ్యం భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. చివర్లో స్నేహ్ రాణా కాసేపు అలరించడంతో టీమిండియా లక్ష్యాన్ని సూనయాసంగా చేధించింది. కాగా భారత మహిళలకు వన్డేల్లో ఇదే అత్యధిక చేజింగ్ కావడం విశేషం. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ ఉమెన్‌లో ఆశ్లే గార్డ్నర్(67), బెత్ మూనీ (52) హాఫ్ సెంచరీలతో చేలరేగగా.. తహిలా మెక్‌గ్రాత్ (47), అలిసా హీలీ( 35) రాణించారు. భారత బౌలర్లలో జూలన్ గోస్వామి, పూజా వస్త్రాకర్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. స్నేహ్ రాణా ఒక వికెట్ సాధించింది. చదవండి: Mohammad Hafeez: పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్‌కు అస్వస్థత.. -
అదరగొట్టిన షఫాలీ
బ్రిస్టల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు భారత మహిళల క్రికెట్లో కొత్త కెరటాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇప్పటి వరకు కెరీర్లో టి20లు మాత్రమే ఆడిన షఫాలీ వర్మ టెస్టుల్లో కూడా తాను సత్తా చాటగలనంటూ తొలి మ్యాచ్‌లోనే నిరూపించింది. మ్యాచ్ రెండో రోజు అద్భుత ప్రదర్శన కనబర్చిన షఫాలీ (152 బంతుల్లో 96; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకుంది. అయితే తొలి మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా ఈ టీనేజర్ నిలిచింది. షఫాలీకి తోడుగా స్మృతి మంధాన (155 బంతుల్లో 78; 14 ఫోర్లు) కూడా ఆకట్టుకోవడంతో గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. షఫాలీ, స్మృతి తొలి వికెట్‌కు ఏకంగా 167 పరుగులు జోడించడం విశేషం. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి 20 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లతో పాటు శిఖా పాండే (0), కెప్టెన్ మిథాలీ రాజ్ (2), పూనమ్ రౌత్ (2) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ (4 బ్యాటింగ్), దీప్తి శర్మ (0 బ్యాటింగ్) జట్టును ఆదుకోవాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 59 పరుగులు చేయా ల్సి ఉంది. అంతకు ముందు 269/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 396 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. -
చెలరేగిన స్మృతి మంధాన.. దక్షిణాఫ్రికా చిత్తు
లక్నో: తొలి వన్డేలో ఎదురైన పరాజయం నుంచి భారత మహిళల క్రికెట్ జట్టు వెంటనే తేరుకుంది. రెండో వన్డేలో దక్షిణాఫ్రికాను ఆల్‌రౌండ్ ప్రదర్శన తో దెబ్బకొట్టి సిరీస్‌లో సమంగా నిలిచింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. బౌలింగ్‌లో వెటరన్ సీమర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జులన్ గోస్వామి (4/42) దక్షిణాఫ్రికాను వణికించగా... తర్వాత బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (64 బంతుల్లో 80 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగింది. స్మృతికి పూనమ్ రౌత్ (89 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు) తోడుగా నిలిచింది. దాంతో భారత్ 28.4 ఓవర్లలో కేవలం వికెట్ నష్టపోయి 160 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. ఛేజింగ్‌లో వరుసగా పది అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. అంతకుముందు టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు లిజెల్లి లీ (4), వోల్వర్డ్ (9) జట్టు స్కోరు 20 పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో లారా గుడ్‌ఆల్ (49; 2 ఫోర్లు), సునే లూస్ (36; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించాక కెప్టెన్ లూస్‌ను మాన్సీ జోషి అవుట్ చేసింది. అక్కడి నుంచి భారత బౌలర్లు పట్టుబిగించారు. కేవలం 58 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను పడేశారు. లూస్, గుడ్‌ఆల్ తర్వాత ఇంకెవరూ భారత బౌలింగ్‌కు అసలు క్రీజులో నిలిచే సాహసం చేయలేకపోయారు. స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ 3, మాన్సి జోషి 2 వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (9) తక్కువ స్కోరుకే వెనుదిరగగా... స్మృతి, పూనమ్ రౌత్‌తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్‌కు 138 పరుగులు జోడించడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే షబ్నిమ్ బౌలింగ్‌లో స్మృతి రెండు వరుస సిక్సర్లతో ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మృతి 46 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆమెకు అండగా నిలిచిన పూనమ్ రౌత్ 79 బంతుల్లో ఫిఫ్టీని అధిగమించింది. ఐదు వన్డేల సిరీస్ 1–1తో సమంగా ఉండగా... మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఆడటం ద్వారా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్ గుర్తింపు పొందింది. 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ ఇప్పటివరకు 310 మ్యాచ్‌లు (10 టెస్టులు+211 వన్డేలు+82 టి20లు) ఆడింది. 309 మ్యాచ్‌లతో (23 టెస్టులు+191 వన్డేలు+95 టి20లు) చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది. -
‘అర్జున’కు బుమ్రా, ధావన్!
న్యూఢిల్లీ: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి ‘అర్జున’ అవార్డు బరిలో నిలవనున్నాడు. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు బుమ్రా పేరును బీసీసీఐ నామినేట్ చేయనున్నట్లు సమాచారం. 2018లోనే బుమ్రా ఈ అవార్డు బరిలో నిలిచినా... సీనియారిటీ ప్రాతిపదికన రవీంద్ర జడేజా ‘అర్జున’ను కైవసం చేసుకున్నాడు. పురుషుల విభాగంలో ఒకరికంటే ఎక్కువ మంది పేర్లను నామినేట్ చేయాలని బీసీసీఐ అధికారులు భావిస్తే బుమ్రాతో పాటు సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు ఈ జాబితాలో చోటు దక్కే అవకాశముంది. రెండేళ్ల క్రితమే శిఖర్ ధావన్ పేరును బీసీసీఐ సిఫారసు చేసినప్పటికీ అవార్డుల కమిటీ మహిళల విభాగంలో స్మృతి మంధానకు మాత్రమే ఈ గౌరవాన్ని అందించింది. భారత్ తరఫున నాలుగేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న 26 ఏళ్ల బుమ్రా 14 టెస్టుల్లో 68 వికెట్లు, 64 వన్డేల్లో 104 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. ‘బుమ్రా కచ్చితంగా ఈ అవార్డుకు అర్హుడు. అతను ఐసీసీ నంబర్‌వన్ బౌలర్‌గానూ నిలిచాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ గడ్డలపై ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు దక్కించుకున్న ఏకైక ఆసియా బౌలర్’ అని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మహిళల విభాగానికొస్తే ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, పేసర్ శిఖా పాండే పేర్లను బోర్డు పరిశీలించే అవకాశముంది. -
మ...మ... మాస్క్... టీమిండియా ఫోర్స్!
ఇప్పుడు కరోనా చైన్‌ను తెంచే పనిలో మాస్క్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. భారత్‌లోనూ వేలల్లో వైరస్ బారిన పడుతున్న తరుణంలో బీసీసీఐ భారత క్రికెటర్ల ద్వారా మాస్క్‌లు ధరించేలా ప్రోత్సహిస్తోంది. స్టార్ క్రికెటర్లు కోహ్లి, సచిన్, స్మృతి మంధాన, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తదితరులతో రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. బయటికి వెళ్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే స్పృహ కల్పించేలా ‘టీమ్ మాస్క్ ఫోర్స్’ పేరిట ఈ వీడియో సందేశం ఉంది. ‘మాతో చేతులు కలపండి. కరోనాపై పోరాడండి. ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. సురక్షితంగా ఉండండి’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. -
‘లూడో కలిపింది అందరినీ’
ముంబై: కరోనా నేపథ్యంలో అసలు ఆటలన్నీ ఆగిపోవడంతో ప్లేయర్లంతా ఇతర వ్యాపకాల్లో బిజీగా మారుతున్నారు. ఇంటి డ్రాయింగ్ రూమ్‌లో ఆర్చరీ రేంజ్‌లు, వర్చువల్ షూటింగ్ రేంజ్‌లలో తమ సామర్థ్యం మెరుగుపర్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా, సరదాగా ఆన్లైన్ క్రీడలతో సమయం గడుపుతున్నవారు మరికొందరు. భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. వీరంతా ఆన్లైన్లో కలిసికట్టుగా లూడో గేమ్‌ను ఆడుతున్నారు. బ్యాట్, బంతి పక్కకు వెళ్లిపోగా పాచికలే ఇప్పుడు వారికి పరమపూజ్యంగా మారిపోయాయి. జట్టు ఓపెనర్ స్మృతి మంధాన ఈ విషయాన్ని వెల్లడించింది. ‘మేం ఫ్రెండ్స్ అంతా కలిసి ఆన్లైన్లో లూడో గేమ్‌ను ఆడుతున్నాం. ఇందులో జట్టు సభ్యులంతా పాల్గొంటున్నారు. మైదానంలో అందరితో కలిసి ఉండే తరహాలోనే ఇప్పుడు దీని ద్వారా కూడా అదే బంధం, సాన్నిహిత్యం కొనసాగిస్తున్నట్లుగా ఉంది. దీంతో పాటు ఫిట్‌గా ఉండటం కూడా కీలకం. మా ట్రైనర్ మాకందరికీ విడివిడిగా పంపించిన ట్రైనింగ్ షెడ్యూల్‌ను అనుసరిస్తూ మేమంతా ఫిట్నెస్ను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాం’ అని స్మృతి వెల్లడించింది. బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఎడంచేతి వాటం బ్యాటర్ లాక్డౌన్లో తాను ఎలా సమయం గడుపుతున్నానో చెప్పింది. ‘కుటుంబసభ్యులందరం సరదాగా గడుపుతున్నాం. పేకాట, ఇంటి పని, వంట పని, సోదరుడితో అల్లరి ఎలాగూ ఉన్నాయి. సినిమాలంటే బాగా ఇష్టం కాబట్టి వారానికి రెండు, మూడు సినిమాలు చూస్తున్నాను. అన్నింటికి మించి నాకు ఇష్టమైన వ్యాపకం నిద్ర. రోజుకు కనీసం 10 గంటలు పడుకుంటున్నాను. దాని వల్ల మిగిలిన రోజంతా హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తోంది’ అని స్మృతి చెప్పింది. ఇంటి పని చేస్తూ స్మృతి -
వచ్చేదంతా వాళ్ల నుంచే...
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి వచ్చే ఆదాయమంతా పురుషుల క్రికెట్ నుంచే వస్తుందని, అలాంటపుడు వారితో పాటు సమాన చెల్లింపులు మహిళలకు ఇవ్వాలంటే ఎలా వీలవుతుందని భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. భారత క్రికెట్లో పురుషులతో పోల్చుకుంటే తక్కువ ఫీజులు, పారితో షికాలు పొందడంపై తనకు ఎలాంటి బాధలేదని ఆమె స్పష్టం చేసింది. ఐసీసీ ‘మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన ఆమె ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచి్చంది. పురుష క్రికెటర్లకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు గరిష్టంగా రూ. 7 కోట్లు ఉంటే... అదే మహిళలకైతే గరిష్టంగా రూ. 50 లక్షలు మాత్రమే ఉంది. ‘ఒక్క విషయం అందరూ అర్థం చేసుకోవాలి... బీసీసీఐకి ఎప్పుడైతే మహిళల క్రికెట్ నుంచి కూడా భారీగా రాబడి వస్తే... అప్పుడు సమాన ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేయొచ్చు. అలా అడిగేవారిలో నేనే ముందుంటాను. కానీ ఇప్పుడైతే అలా అడగడం సమంజసం కాదు. నా తోటి క్రికెటర్లకు ఈ వ్యత్యాసంపై ఆలోచన లేదు’ అని పేర్కొంది. -
ఐసీసీ వన్డే, టి20 జట్లలో స్మృతి మంధాన
దుబాయ్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక వన్డే, టి20 జట్లలో చోటు దక్కింది. ఈ ఏడాది కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఐసీసీ వార్షిక అవార్డులు, వుమెన్ టీమ్స్ ఆఫ్ ఇయర్‌ను ఎంపిక చేస్తారు. 23 ఏళ్ల ఈ భారత ఓపెనర్ రెండు టెస్టులతోపాటు 51 వన్డేలు, 66 టి20లు ఆడింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఆమె 3476 పరుగులు చేసింది. ఈ సీజన్లో స్మృతి అద్భుతంగా రాణించింది. ఐసీసీ మహిళల వన్డే జట్టులో భారత్ నుంచి ఆమెతో పాటు బౌలర్లు జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శిఖా పాండేలకు చోటు దక్కగా... టి20 జట్టులో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, స్పిన్నర్ రాధా యాదవ్ కూడా ఎంపికయ్యారు. ఐసీసీ ఇరు జట్లకు మెగ్ లానింగ్ (ఆ్రస్టేలియా) కెపె్టన్‌గా వ్యవహరిస్తుంది. కాగా... ఆ్రస్టేలియాకే చెందిన ఎలీస్ పెర్రీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’... ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికైంది. ఎలిస్ పెర్రీ వన్డేల్లో ఈ సీజన్లో 73.50 సగటుతో 441 పరుగులు చేయడంతోపాటు 21 వికెట్లు తీసింది. ఈ ఏడాది ఆమె మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణించింది. మహిళల టి20 క్రికెట్లో 1000 పరుగులు చేయడంతోపాటు 100 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. టి20 ఫార్మాట్లో ఆసీస్‌కే చెందిన అలీసా హీలీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సొంతం చేసుకుంది.