
మెక్‌కే (ఆ్రస్టేలియా): భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (39 బంతుల్లో 45; 6 ఫోర్లు) మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెరిసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చక్కని ప్రదర్శనతో పాటు జట్టుకు ఉపయోగపడే భాగస్వామ్యంతో డిఫెండింగ్ చాంపియన్ సిడ్నీ థండర్స్‌ను గెలిపించింది. మొదట సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. సిక్సర్స్ జట్టుకు ఆడుతున్న భారత ప్లేయర్ షఫాలీ వర్మ (8) నిరాశపరిచింది.
సిడ్నీ థండర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో భారతీయ క్రికెటర్ దీప్తి శర్మ వికెట్లను నేరుగా గిరాటేయడంతో షఫాలీ రనౌటైంది. తర్వాత 15.2 ఓవర్లలోనే సిడ్నీ థండర్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కొరినె హాల్ (19)తో కలిసి తొలి వికెట్‌కు స్మృతి 53 పరుగులు జోడించడం విశేషం.
చదవండి: T20 World Cup: మార్టిన్ క్రో ఆత్మ శాంతించేదెప్పుడు?
Comments
Please login to add a commentAdd a comment