
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న కీలక మ్యాచ్‌లో భారత యువ సంచలనం షఫాలీ వర్మ అదరగగొట్టింది. 46 బంతుల్లో 53 పరుగులు చేసిన షఫాలీ వర్మ భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ అద్భుతమైన షాట్లుతో అలరించింది. కాగా ఈ మ్యాచ్‌లో షఫాలీ... దక్షిణాఫ్రికా దిగ్గజం డివిలియర్స్‌ను తలపించేలా స్కూప్ షాట్ ఆడింది. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇస్మాయిల్ బౌలింగ్‌లో.. షఫాలీ వికెట్లు విడిచి పెట్టి ఆఫ్ సైడ్ వచ్చి అద్భుతమైన స్కూప్ షాట్ ఆడింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(71), షఫాలీవర్మ(53) కెప్టెన్ మిథాలీ రాజ్(68), హర్మన్ ప్రీత్‌కౌర్ (48) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్, మసబాట క్లాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అయబోంగా ఖాకా,ట్రాయన్ ఒక్కో వికెట్ సాధించారు.
చదవండి: World Cup 2022 Ind W Vs SA W: కీలక మ్యాచ్.. అదరగొట్టిన స్మృతి, షఫాలీ, మిథాలీ.. హర్మన్ సైతం.