IND-W U19 Vs SA-W U19: Yashashri Stars India Clean Sweep South Africa - Sakshi
Sakshi News home page

SA W Vs Ind W: అదరగొట్టిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికా 54 పరుగులకే ఆలౌట్‌.. పరిపూర్ణ విజయం

Published Thu, Jan 5 2023 9:08 AM | Last Updated on Thu, Jan 5 2023 10:10 AM

U19 SA W Vs Ind W: Yashasri Stars India Clean Sweep South Africa - Sakshi

దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న అండర్‌-19 మహిళా జట్టు (PC: BCCI)

TeamIndia Win Final T20I Against South Africa Women- కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా అండర్‌–19 మహిళల జట్టుతో ఆరో టి20 మ్యాచ్‌లో భారత అండర్‌–19 మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం జరిగిన చివరిదైన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 4–0తో దక్కించుకుంది.

ప్రిటోరియా వేదికగా జరిగిన టీ20లో టాస్‌ గెలిచిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్ల ధాటికి 13.2 ఓవర్లలో 54 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్‌ అమ్మాయి యషశ్రీ 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది..

మిగతా వాళ్లలో.. ఫలక్‌ నాజ్, సోనమ్‌ యాదవ్, పార్షవి చోప్రా రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం భారత్‌ 9.2 ఓవర్లలో 3 వికెట్లకు 55 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్‌ షఫాలీ వర్మ (22; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హైదరాబాద్‌ అమ్మాయి గొంగడి త్రిష (10 నాటౌట్‌; 1 ఫోర్‌) రాణించారు.

చదవండి: 12 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ‘మట్టి కుస్తీ’ సవాల్‌.. ‘హింద్‌ కేసరి’ విశేషాలు.. పూర్తి వివరాలు
Sara Khadem: ఇరాన్‌లో అడుగుపెడితే చంపేస్తాం.. చెస్‌ ప్లేయర్‌కు బెదిరింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement