భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా ఫైనల్‌.. తుది జట్లు ఇవే | South Africa Women U19 Vs India Women U19 Final: SA Won The Toss And Choose To Bat First, Check Squads Inside | Sakshi
Sakshi News home page

IND vs SA: భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా ఫైనల్‌.. తుది జట్లు ఇవే

Published Sun, Feb 2 2025 11:42 AM | Last Updated on Sun, Feb 2 2025 1:12 PM

South Africa Women U19 vs India Women U19 Final: South Africa won the toss, chose to Bat First

మహిళల అండర్‌–19 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న తుది పోరులో దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ  మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. 

అజేయంగా ఫైన‌ల్లో అడుగుపెట్టిన భార‌త జ‌ట్టు.. ద‌క్షిణాఫ్రికాపై అదే జోరును కొన‌సాగించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. భారత్‌ మాదిరిగానే ఓటమి లేకుండా ఫైనల్‌ చేరిన దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను ముద్దాడాల‌ని ఉవ్విళ్లూరుతోంది. 

ఇక ఈ టోర్నీలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న తెలుగు అమ్మాయి గొంగడి త్రిషపై భార‌త్ మ‌రోసారి ఆధార‌ప‌డ‌నుంది. ఈ వ‌రల్డ్‌క‌ప్‌లో అత్యధిక పరుగుల బ్యాటర్‌గా త్రిష (265 పరుగులు)నే కొనసాగుతోంది.

తుది జట్లు
దక్షిణాఫ్రికా మహిళల U19 జ‌ట్టు: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్‌), కరాబో మెసో(వికెట్ కీప‌ర్‌), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నిని

భారత మహిళల U19 జ‌ట్టు:  కమలిని(వికెట్ కీప‌ర్‌), గొంగడి త్రిష, సానికా చల్కే, నికి ప్రసాద్(కెప్టెన్‌), ఈశ్వరి అవ్సరే, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత  షబ్నం షకీల్, పరుణికా సిసోడియా, వైష్ణవి శర్మ
చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో ఐదో టీ20.. భారత జట్టులో కీలక మార్పులు! వారికి ఛాన్స్‌?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement