భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో ఆఖరి టీ20 ఇరు జట్ల మధ్య ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను 4-1తో ముగించాలని భారత జట్టు భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. కాగా ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో నామమాత్రపు మ్యాచ్ అయితే ఐదో టీ20లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. నాలుగో టీ20కు దూరమైన స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ జట్టుతో వన్డే సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం అతడిని ఆడించాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తోంది. ఈ విషయాన్ని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ ధ్రువీకరించాడు.
కాగా షమీ తుది జట్టులోకి వస్తే అర్ష్‌దీప్ సింగ్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. మరోవైపు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి స్ధానంలో రమణ్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. కాగా గత కంకషన్‌కు గురైన శివమ్ దూబే ప్రస్తుతం కోలుకోనున్నట్లు సమాచారం. అతడు వాంఖడే టీ20లో కూడా ఆడే సూచనలు కన్పిస్తున్నాయి.
సూర్య, సంజూ మెరుస్తారా?
ఇక పేలవ ఆట తీరుతో నిరాశపరుస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ సంజూ శాంసన్‌లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ సిరీస్‌కు ముందు వరుస సెంచరీలతో సత్తాచాటిన శాంసన్.. స్వదేశంలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన సంజూ కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు.
నాలుగు మ్యాచ్‌ల్లో కూడా బౌన్సర్ బంతులకే సంజూ ఔట్ కావడం గమనార్హం. మరోవైపు సూర్యది కూడా అదే తీరు. సూర్యకుమార్ నాలుగు మ్యాచ్‌ల్లో 26 పరుగులే చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ రాణించాల్సిన అవసరముంది. కాగా బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారే అవకాశముంది. టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.
ఐదో టీ20కు భారత తుది జట్టు(అంచనా): సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, రమణ్‌దీప్ సింగ్, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ
చదవండి: నా భార్య లైవ్ చూస్తోంది.. నేను ఆ విషయం చెప్పలేను: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment