చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా విధించిన 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
షెఫాలీ వర్మ(24), సతీష్(13) పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 603 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ(205) డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన(146), రిచా ఘోష్(86) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.
అనంతరం దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 266 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాలోన్ గండం దాటలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా 8 వికెట్లతో దెబ్బతీసింది.
ఈ క్రమంలో ఫాలో ఆన్ ఆడిన సఫారీలు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో భారత్ ముందు దక్షిణాఫ్రికా కేవలం 37 పరుగులు మాత్రమే లక్ష్యంగా ఉంచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఊదిపడిసేన భారత్.. ట్రోఫీని సొంతం చేసుకుంది.
ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో సునే లూస్(109), వోల్వార్డ్ట్(109) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తీ శర్మ, గైక్వాడ్, రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షఫాలీ వర్మ, హర్మాన్ ప్రీత్ కౌర్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో 10 వికెట్లతో సత్తాచాటిన స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment