చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్‌.. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు | Sneh Rana becomes second Indian to register a ten-wicket match haul in Women's Tests | Sakshi
Sakshi News home page

IND vs SA: చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్‌.. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు

Published Mon, Jul 1 2024 3:34 PM | Last Updated on Mon, Jul 1 2024 5:04 PM

Sneh Rana becomes second Indian to register a ten-wicket match haul in Women's Tests

చెపాక్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళ స్పిన్నర్‌  స్నేహ రాణా అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది.. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు చుక్కలు చూపించిన రానా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా రెండు కీలక వికెట్లతో సత్తాచాటింది.

ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా రానా 10 వికెట్లు పడగొట్టి సఫారీలను కట్టడి చేసింది. ఈ క్రమంలో స్నేహ రాణా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టెస్టు క్రికెట్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా  స్నేహ రాణా రికార్డులకెక్కింది. 

ఈ జాబితాలో స్నేహ రాణా కంటే ముందు భారత మహిళ క్రికెట్‌ దిగ్గజం జులాన్‌ గోస్వామి ఉంది. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జులాన్‌ 10 వికెట్లు సాధించింది. అయితే ఈ ఫీట్‌ సాధించిన తొలి భారత మహిళా స్పిన్నర్‌ స్నేహనే కావడం విశేషం. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 266 పరుగులకు ఆలౌట్‌ కావడంతో ఫాలోన్‌ గండం దాటలేకపోయింది.

ఈ క్రమంలోనే ఫాలో ఆన్‌ ఆడిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌలైంది. దీంతో భారత్‌ ముందు కేవలం 37 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే దక్షిణాఫ్రికా ఉంచింది. అంతకముందు భారత్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 603 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement