
డబ్ల్యూపీఎల్-2025 సీజన్ తొలి మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీ నుంచి నుంచి తప్పుకుంది. శ్రేయంక ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతోంది.
దీంతో గతేడాది జరిగిన ఆసియాకప్‌కు దూరమైంది. ఆతర్వాత యూఏఈ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే తన గాయం మళ్లీ తిరగబెట్టడంతో స్వదేశంలో ఐర్లాండ్, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లకు దూరంగా ఉంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో కూడా ఆమె బరిలోకి దిగలేదు.
ఆమె పూర్తిగా కోలుకోవడానికి నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీజన్ మొత్తానికి పాటిల్ దూరమైంది. తాజాగా శ్రేయాంక పాటిల్ కూడా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. తన గుండె పగిలిందని, అయినా కానీ తాను మళ్లీ పుంజుకుంటాననే క్యాప్షన్‌తో ఊయల ఊగుతున్న ఫొటోను పంచుకుంది.
ఇక శ్రేయాంక స్థానంలో స్నేహ్ రాణాను ఆర్‌సీబీ జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని శనివారం ఆర్‌సీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడిన రాణా ఈ సారి వేలంలో ఎంపిక కాలేదు. రాణాను రూ.30 లక్షలకు బెంగళూరు ఎంచుకుంది.
గతేడాది సీజన్‌లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలవడంలో శ్రేయంకది కీలక పాత్ర. 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్లతో ఆమె సత్తాచాటింది. ఆర్బీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఈనెల 17న తలపడనుంది.
ఆర్సీబీ జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), ఆశా శోభన జాయ్, జోషిత విజయ్, రిచా ఘోష్, డానీ వ్యాట్, కనికా అహుజా, సబినేని మేఘన, ఏక్తా బిష్ట్, కేట్ క్రాస్, స్నేహ్‌రాణా, ఎల్లీస్ పెర్రీ, ప్రేమ రావత్, జార్జియా బాహ్మ్, రేణుకా సింగ్, సోఫీ మోలిన్యూక్స్.
చదవండి: IPL 2025: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ ఖారారు! తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
Comments
Please login to add a commentAdd a comment