Shreyanka Patil
-
Diwali 2024: ఆర్సీబీ ‘క్వీన్’ అలా.. అందమైన అలంకరణతో స్మృతి ఇలా(ఫొటోలు)
-
ప్రేమలో పడ్డానంటూ షాకిచ్చిన భారత స్టార్ క్రికెటర్ (ఫొటోలు)
-
గుర్తించారు... చాలు! క్రికెటర్ శ్రేయాంక పాటిల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
‘కుదిరితే క్షమించు. లేదంటే శిక్షించు. కానీ మేమున్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు. దయచేసి గుర్తించు..’ అని అనేది ఓ సినిమాలో డైలాగ్! నిజమే.. క్షమించినా, శిక్షించినా, విమర్శించినా, ద్వేషించినా... అసలంటూ గుర్తించటమే కావలసింది. ఆటలోనైనా, బతుకు పోరాటంలోనైనా గెలుపోటములు ఎలా ఉన్నా ముందైతే గుర్తింపు ముఖ్యం. ఆ విషయాన్నే భారత మహిళా క్రికెట్ జట్టులోని ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో చక్కగా వ్యక్తం చేశారు. ‘మీ అభిమానానికి, మీ విమర్శలకూ నిజంగా అభివందనాలు. ఈవిధంగానైనా మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. ఓటమి మమ్మల్ని ఒకవైపు బాధిస్తున్నా, గెలుపు కోసం మరింతగా ఆకలిని మాలో రాజేసింది.. ‘ అని రాశారు. యూఏఈలో ప్రస్తుతం జరుగుతున్న టి20 విమెన్ వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీస్‌కి క్వాలిఫై కాలేక సోయిన సంగతి అటుంచితే... ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రేయాంక పాటిల్ పెట్టిన ఈ పోస్ట్...ముఖ్యంగా స్పాన్సరర్లు మహిళల క్రికెట్ జట్టును గుర్తించి, మరింతగా ప్రోత్సహించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. View this post on Instagram A post shared by Shreyanka Patil (@shreyanka_patil31) -
ఆసియాకప్‌లో టీమిండియాకు ఊహించని షాక్..
మహిళల ఆసియాకప్-2024లో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైంది. జూలై 18న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాటిల్ గాయపడింది.ఈ మ్యాచ్‌లో క్యాచ్‌ను పట్టే ప్రయత్నంతో శ్రేయాంక చేతి వేలికి గాయమైంది. మ్యాచ్ అనంతరం ఆమెను స్కానింగ్ తరలించగా చేతి వేలి విరిగినట్లు నిర్ధారణైంది. ఈ క్రమంలోనే టోర్నీ మధ్యలోనే ఆమె వైదొలిగింది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఓ ప్రకటనలో ధ్రువీకరించింది.కాగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 3.2 ఓవర్లలో కేవలం 14 పరుగుల మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. ఇక ఆమె స్ధానాన్ని మరో యువ స్పిన్నర్ తనూజా కన్వర్‌తో బీసీసీఐ భర్తీ చేసింది. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ సీజన్లో కన్వర్ తన బౌలింగ్‌తో అందరని ఆకట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ తరపున 10 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఇక పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఆదివారం తమ రెండో మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది. -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
అతడికి నా పేరు కూడా తెలుసు: ఆర్సీబీ క్వీన్ పోస్ట్ వైరల్
భారత మహిళా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ శ్రేయాంక పాటిల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇంతకంటే ఇంకేం కావాలి అన్నట్లు గాల్లోతేలిపోయే అనుభూతిని ఆస్వాదిస్తోంది. తన రోల్ మోడల్‌ను నేరుగా కలవడమే గాకుండా.. అతడితో ప్రశంసలు అందుకోవడమే ఇందుకు కారణం. ఐపీఎల్ తర్వాత బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీ20 టోర్నీ వుమెన్ ప్రీమియర్ లీగ్ ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చిన బెంగళూరు అమ్మాయి శ్రేయాంక. దేశవాళీ క్రికెట్లో సొంత రాష్ట్రం కర్ణాటకకు ఆడుతున్న 21 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్ బౌలర్ గతేడాది భారత జట్టు తరఫున అరంగేట్రం చేసింది. గతేడాది ఆరంభమైన వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీకి ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. రూ. 10 లక్షలకు తనను కొనుక్కున్న ఆర్సీబీకి తాజా ఎడిషన్‌లో పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చింది. ముఖ్యంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో కీలక సమయంలో నాలుగు వికెట్లు తీసింది. తద్వారా డబ్ల్యూపీఎల్-2024లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంటోంది. ఇక సీజన్లో మొత్తంగా 9 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తీసిన శ్రేయాంక పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు) విజేతగా నిలిచింది. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2024 అంతేకాదు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డునూ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్-2024 ఆరంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రోఫీ గెలిచిన మహిళా జట్టును ఆర్సీబీ పురుష జట్టు గార్డ్ ఆఫ్ ఆనర్తో సముచితంగా గౌరవించింది. ఇక ఈ ఈవెంట్లో పేరు, లోగో మార్పులతో కొత్త జెర్సీని రివీల్ చేసింది ఆర్సీబీ. ఈ కార్యక్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కలిసే అవకాశం వచ్చింది శ్రేయాంకకు! ఈ నేపథ్యంలో కింగ్ కోహ్లితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనైందామె. ‘‘అతడి వల్లే క్రికెట్ చూడటం అలవాటు చేసుకున్నా. అతడిలాగే క్రికెటర్ కావాలని కలలు కంటూ పెరిగాను. ఎట్టకేలకు.. జీవితకాలానికి సరిపడా సంతోషాన్నిచ్చే క్షణం నిన్న రాత్రి చోటుచేసుకుంది. ‘హాయ్.. శ్రేయాంక.. అద్భుతంగా బౌల్ చేశావు’ అని విరాట్ నాతో అన్నాడు. అతడికి నా పేరు కూడా తెలుసు’’ అంటూ రోల్‌మోడల్‌తో కలిసి ఫ్యాన్‌గర్ల్ మూమెంట్‌ను ఆస్వాదించినట్లు శ్రేయాంక పాటిల్ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టగా వైరల్‌గా మారింది. చదవండి: Sachin Tendulkar: నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్ చేయలేవా? Started watching cricket cos of him. Grew up dreaming to be like him. And last night, had the moment of my life. Virat said, “Hi Shreyanka, well bowled.” He actually knows my name 😬😬😬#StillAFanGirl #rolemodel pic.twitter.com/z3DB0C8Pt0 — Shreyanka Patil (@shreyanka_patil) March 20, 2024 -
WPL 2024: ఆర్సీబీ క్వీన్.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
WPL 2024: ఫైనల్లో 4 వికెట్లు.. ఆర్సీబీ క్వీన్! ఎవరీ శ్రేయాంక?
రాయల్ ఛాలెజంజర్స్ బెంగళూరు నిరీక్షణకు తెరపడింది. గత 16 ఏళ్లగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ట్రోఫిని ఎట్టకేలకు ఆర్సీబీ ముద్దాడింది. అయితే ఆర్సీబీ అబ్బాయిలకు సాధ్యం కాని టైటిల్‌ను.. అమ్మాయిలు అందుకుని చూపించారు. డబ్ల్యూపీఎల్-2024 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆర్సీబీ తొలి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. అయితే ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడడంలో ఆ జట్టు యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌ది కీలక పాత్ర. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో 4 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. అంతకుముందు సెమీఫైనల్లో రెండు కీలక వికెట్లు ఆమె పడగొట్టింది. ఓ వైపు కాలి గాయంతో బాధపడుతూనే అద్బుతమైన ప్రదర్శన కనబరిచి తన జట్టుకు టైటిల్‌ను అందించింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన పాటిల్ 13 వికెట్లు పడగొట్టి.. పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకుంది. కాగా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన పాటిల్‌ను ఆర్సీబీ మేనెజ్మెంట్ రెండు మ్యాచ్‌లకు పక్కన పెట్టేసింది. ఆ తర్వాత మళ్లీ తుది జట్టులోకి వచ్చిన శ్రేయాంక దెబ్బతిన్న సింహంలా చెలరేగిపోయింది. ఈ క్రమంలో ఎవరీ శ్రేయాంక పాటిల్‌ను నెటిజన్లు తెగ వేతికేస్తున్నారు. ఎవరీ శ్రేయాంక పాటిల్.. 21 ఏళ్ల శ్రేయాంక పాటిల్ బెంగళూరులో జన్మించింది. శ్రేయాంక దేశీవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుంది. అయితే దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణించడంతో ఆమె భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి శ్రేయాంక అడుగుపెట్టింది. ఇప్పటివరకు భారత్ తరపున 2 వన్డేలు, 6 టీ20లు ఆడిన ఈ కర్ణాటక క్రికెటర్.. వరుసగా 4, 8 వికెట్లు పడగొట్టింది. కాగా డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో శ్రేయాంకను రూ.10 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఆమెను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. కాగా పాటిల్ మహిళల కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ భాగమైంది. ఈ లీగ్‌లో గయానా ఆమెజాన్ వారియర్స్‌కు శ్రేయాంక ప్రాతినిథ్యం వహిస్తుంది. చదవండి: T20 WC: టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్! Shreyanka Patil with her Purple Cap award. - The hero of the team! 💜 pic.twitter.com/ATA6DMiYqT — Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024 Ellyse Perry " Pretty bonkers to be honest. It's another level for us.Shreyanka Patil is such a young player and she has got the world at her feet, they are awesome.Shreyanka and Sophie devine will be owning the stage and they are the goat dangers 😄 "pic.twitter.com/ukWj0D4g9P — Sujeet Suman (@sujeetsuman1991) March 18, 2024