మహిళల ఆసియాకప్-2024లో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైంది. జూలై 18న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాటిల్ గాయపడింది.
ఈ మ్యాచ్‌లో క్యాచ్‌ను పట్టే ప్రయత్నంతో శ్రేయాంక చేతి వేలికి గాయమైంది. మ్యాచ్ అనంతరం ఆమెను స్కానింగ్ తరలించగా చేతి వేలి విరిగినట్లు నిర్ధారణైంది. ఈ క్రమంలోనే టోర్నీ మధ్యలోనే ఆమె వైదొలిగింది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఓ ప్రకటనలో ధ్రువీకరించింది.
కాగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 3.2 ఓవర్లలో కేవలం 14 పరుగుల మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. ఇక ఆమె స్ధానాన్ని మరో యువ స్పిన్నర్ తనూజా కన్వర్‌తో బీసీసీఐ భర్తీ చేసింది.
ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ సీజన్‌లో కన్వర్ తన బౌలింగ్‌తో అందరని ఆకట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ తరపున 10 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఇక పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఆదివారం తమ రెండో మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment