మహిళల ఆసియాకప్-2024లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యూఏఈ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. భారత జట్టులో మాత్రం ఒక మార్పు చోటు చేసుకుంది.
గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగిన స్పిన్నర్ శ్రేయంకా పాటిల్ స్ధానంలో తనుజా కన్వర్ తుది జట్టులోకి వచ్చింది. తనుజా కన్వర్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం.
ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ చేతుల మీదగా భారత టీ20 క్యాప్‌ను కన్వర్ అందుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. యూఏఈను కూడా మట్టికరిపించాలని పట్టుదలతో ఉంది.
తుది జట్లు
భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, దయాళన్ హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్, తనూజా కన్వర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: ఈషా రోహిత్ ఓజా(కెప్టెన్), తీర్థ సతీష్(వికెట్ కీపర్), రినిత రజిత్, సమైరా ధరణిధర్క, కవిషా ఎగోదాగే, ఖుషీ శర్మ, హీనా హాట్‌చందానీ, వైష్ణవే మహేష్, రితికా రజిత్, లావణ్య కెనీ, ఇంధుజా నందకుమార్
Comments
Please login to add a commentAdd a comment