‘కుదిరితే క్షమించు. లేదంటే శిక్షించు. కానీ మేమున్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు. దయచేసి గుర్తించు..’ అని అనేది ఓ సినిమాలో డైలాగ్! నిజమే.. క్షమించినా, శిక్షించినా, విమర్శించినా, ద్వేషించినా... అసలంటూ గుర్తించటమే కావలసింది. ఆటలోనైనా, బతుకు పోరాటంలోనైనా గెలుపోటములు ఎలా ఉన్నా ముందైతే గుర్తింపు ముఖ్యం. ఆ విషయాన్నే భారత మహిళా క్రికెట్ జట్టులోని ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో చక్కగా వ్యక్తం చేశారు.
‘మీ అభిమానానికి, మీ విమర్శలకూ నిజంగా అభివందనాలు. ఈవిధంగానైనా మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. ఓటమి మమ్మల్ని ఒకవైపు బాధిస్తున్నా, గెలుపు కోసం మరింతగా ఆకలిని మాలో రాజేసింది.. ‘ అని రాశారు. యూఏఈలో ప్రస్తుతం జరుగుతున్న టి20 విమెన్ వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీస్‌కి క్వాలిఫై కాలేక సోయిన సంగతి అటుంచితే... ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రేయాంక పాటిల్ పెట్టిన ఈ పోస్ట్...ముఖ్యంగా స్పాన్సరర్లు మహిళల క్రికెట్ జట్టును గుర్తించి, మరింతగా ప్రోత్సహించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment