ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. అదే విధంగా ఎప్పటిలాగే ఆమెకు డిప్యూటీగా స్మృతి మంధాన వ్యవహరించనుంది.
అయితే ఈ జట్టులో భారత స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు చోటు దక్కలేదు. జట్టు ఎంపికకు షఫాలీని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఆమెను పక్కన పెట్టడానికి గల కారణాన్ని అయితే సెలక్టర్లు వెల్లడించలేదు. షెఫాలీ మాత్రం ప్రస్తుతం పెద్దగా ఫామ్‌లో లేదు.
ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో షఫాలీ వర్మ కేవలం 56 పరుగులు మాత్రమే చేసింది. ఆమె వన్డేల్లో హాఫ్ సెంచరీ సాధించి ఏడాది దాటింది. మరోవైపు హర్లీన్ డియాల్, టిటాస్ సాధు తిరిగి జట్టులోకి వచ్చారు. హర్లీన్ చివరగా భారత్ తరపున 2023లో ఆడింది. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉంటుంది. డిసెంబర్ 5న బ్రిస్బేన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
భారత మహిళల జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు , అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, సైమా ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment