పింక్‌ బాల్‌ టెస్టుకు వరుణుడి అడ్డంకి..సెంచరీకి చేరువలో స్మృతి మంధాన | Persistent Rains Bring Curtains On Day One | Sakshi
Sakshi News home page

INDw Vs AUSw: పింక్‌ బాల్‌ టెస్టుకు వరుణుడి అడ్డంకి..సెంచరీకి చేరువలో స్మృతి మంధాన

Published Thu, Sep 30 2021 6:57 PM | Last Updated on Thu, Sep 30 2021 7:44 PM

Persistent Rains Bring Curtains On Day One - Sakshi

Pink Ball Test: భారత్, ఆస్ట్రేలియా మహిళల మధ్య జరుగుతున్నచరిత్రత్మాక  డే అండ్ నైట్ టెస్టు మొదటి రోజు ఆటకు వరుణుడు  ఆటంకం కలిగించాడు. క్వీన్స్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 44.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 132 పరుగులు చేసింది.  కాగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన  భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన , షెఫాలి వర్మ  అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 93 పరుగల బాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా 64 బంతుల్లో 31 పరగులు చేసిన షెఫాలి తొలి వికెట్‌గా వెనుదిరిగింది. స్మృతి మంధాన  144 బంతుల్లో 80 పరగులు చేసి సెంచరీకు చేరువలో ఉంది. ప్రస్తుతం మంధాన, పూనమ్ రౌత్‌  క్రీజులో ఉన్నారు.

చదవండి:  IPL 2021 2nd Phase RCB Vs RR: ఐపీఎల్‌ చరిత్రలో ఆర్సీబీ బౌలర్‌ సరికొత్త రికార్డు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement