
Smriti Mandhana Dance Video Viral: ఎప్పుడూ మ్యాచ్‌లు, టూర్‌లతో బిజీగా ఉండే క్రికెటర్లు అప్పుడప్పుడు వాళ్ల ఆటతోనే కాదు డ్యాన్స్‌లతోనూ సరదగా అభిమానులను అలరిస్తుంటారు. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఆమె సహచరులతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఆమె సహచరులు హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ , రాధా యాదవ్‌తో కలిసి 'ఇన్ డా ఘెట్టో' అనే పాటకు డ్యాన్స్ వేసింది.
ఈ వీడియోను మంధాన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. స్మృతి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఈ వీడియో షేర్ చేసిన మంధాన.. వీడియో చేయాలనే ఆలోచన తనది కాదంటూ క్యాప్షన్ పెట్టింది. దీనిపై స్పందించిన ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్... ఇది కచ్చితంగా స్మృతి మంధాన పనేని ఫన్నీగా కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరింతా మహిళల బిగ్ బాష్ లీగ్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నారు.
చదవండి: భారత్‌తో తలపడే పాక్ జట్టు ఇదే: ఆకాష్ చోప్రా