ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఆక్టోబర్16న క్వాలిఫైర్ మ్యాచ్‌లు ప్రారంభం కాగా.. ఆక్టోబర్ 22 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ విషయానికి వస్తే.. ఈ మెగా టోర్నమెంట్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. గత ఏడాది ప్రపంచ కప్‌లో పాక్ చేతిలో ఘోర ఓటమికు టీమిండియా బదులు తీర్చుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఇప్పటినుంచే ప్రపంచ కప్ సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2022లో పాల్గొనే భారత జట్టును టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అంచనా వేశాడు.
తన జట్టులో తొలి మూడు స్ధానాల్లో రోహిత్ శర్మ,కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లిను ఎంపిక చేశాడు. తరువాత యువ ఆటగాళ్లు కిషన్, శ్రేయస్ అయ్యర్,సూర్యకుమార్ యాదవ్‌ను ఎంచుకున్నాడు. జట్టులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేశాడు. ఆల్ రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, వెంకటేశ్ అయ్యర్,హార్ధిక్ పాండ్యాకు చోటు ఇచ్చాడు. కాగా గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన హార్ధిక్ పాండ్యాకి చోటు ఇవ్వడం గమనార్హం. ఇక బౌలర్ల కోటాలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్ లేదా దీపక్ చాహర్‌లో ఒకరు భారత జట్టులో చోటు దక్కించుకుంటారని చోప్రా తెలిపాడు. మూడో పేసర్ కోసం ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ లేదా అవేష్ ఖాన్‌లలో ఒకరు జట్టులో స్ధానం దక్కించుకుంటారు. అదే విధంగా మహమ్మద్ షమీ, టి నటరాజన్ లేదా ఖలీల్ అహ్మద్‌లలో ఒకరిని రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంది అని చోప్రా పేర్కొన్నాడు. ఇక టీ20ల్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను తన జట్టులో చోప్రా చోటు ఇవ్వక పోవడం గమనార్హం.
చదవండి: Ravichandran Ashwin: 'సోయి లేకుండా మాట్లాడొద్దు'.. జర్నలిస్ట్‌ను ఉతికారేసిన అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment