
ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియాతో జరిన రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక పరాజాయం పాలైంది. దీంతో అత్యంత చెత్త రికార్డును శ్రీలంక తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా శ్రీలంక నిలిచింది.
శ్రీలంక ఇప్పటివరకు 880 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 437 వన్డేల్లో ఓటమిపాలైంది. తద్వారా ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కాగా ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు టీమిండియా పేరిట ఉండేది. భారత్ ఇప్పటి వరకు 436 వన్డేల్లో ఓటమి చవిచూసింది. తాజా ఓటమితో భారత్‌ను లంక జట్టు అధిగిమించింది. ఇక మూడో 419 ఓటములతో పాకిస్తాన్ మూడో స్థానంలో కొనసాగుతుంది.
ఆస్ట్రేలియా రికార్డును సమం చేసిన భారత్
ఇక ఇదే మ్యాచ్‌లో టీమిండియా కూడా ఓ అరుదైన రికార్డు సాధించింది. లంకపై రెండో వన్డేలో గెలుపొందిన రోహిత్ సేన.. వన్డేల్లో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియాతో సంయుక్తంగా నిలిచింది. శ్రీలంకపై అత్యధికంగా 95 వన్డేల్లో భారత్ గెలవగా.. ఆస్ట్రేలియా కూడా న్యూజిలాండ్‌పై ఇప్పటివరకు 95 వన్డేల్లో విజయం సాధించింది.
చదవండి: Virat Kohli: ఇషాన్‌తో కలిసి డాన్స్ అదరగొట్టిన కోహ్లి! వీడియో వైరల్