మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో ఇవాళ (జులై 28) భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఓ మార్పు చేయగా.. భారత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. లంక జట్టులో అచిని కులసూర్య స్థానంలో సచిని నిసంసల తుది జట్టులోకి వచ్చింది. కాగా, సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్‌పై, శ్రీలంక.. పాకిస్తాన్‌పై విజయాలు సాధించి ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే.
తుది జట్లు..
శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్‌కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసల
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment