వన్డేల్లో వరుసగా 13 విజయాలు సాధించి జోరుమీదున్న శ్రీలంకకు టీమిండియా అడ్డుకట్ట వేస్తుందా అన్న ప్రశ్నపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతుంది. టీమిండియా తాజా ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని మెజార్టీ శాతం లంకేయుల జైత్రయాత్రకు బ్రేక్ పడటం ఖాయమని ధీమాగా చెబుతున్నారు.
కొందరేమో లంకేయులు హోమ్ అడ్వాంటేజ్ తీసుకుని టీమిండియాకు షాకిస్తుందని అంటుంటే, మరికొందరు శ్రీలంకకు అంత సీన్ లేదని ఆ జట్టును తేలిగ్గా తీసిపారేస్తున్నారు. మరి ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
Can Sri Lanka continue their winning streak against India?#INDvSL pic.twitter.com/wcUfm1yRxJ
— CricTracker (@Cricketracker) September 12, 2023
పై పేర్కొన్న అంశంపై మెజార్టీ శాతం అభిప్రాయం మేరకు టీమిండియాకే విజయావకాశాలు అధికంగా ఉన్నప్పటకీ, ఒక్క విషయంలో మాత్రం లంకేయుల విన్నింగ్ ఛాన్సస్‌ను కొట్టిపారేయడానికి వీళ్లేదు. ఆ విషయం ఏంటంటే.. టీమిండియా ఎంతటి ఫామ్‌లో ఉన్నా, గంటల వ్యవధిలో బరిలోకి దిగాల్సి రావడం (నిన్ననే పాక్‌తో మ్యాచ్) ఆ జట్టుకు పెద్ద ప్రతికూలాంశంగా మారింది.
ఎంతటి మేటి జట్టైనా ఇలా గ్యాప్ లేకుండా క్రికెట్ ఆడితే సత్ఫలితాలు రావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైపెచ్చు శ్రీలంకకు హోమ్ అడ్వాంటేజ్ ఉండనే ఉంది. దీనికి తోడు ఆ జట్టు ఇటీవలికాలంలో అద్భుతమైన క్రికెట్ ఆడుతుంది. ప్రస్తుత మ్యాచ్‌లోనూ వారు టీమిండియా టాప్-3 బ్యాటర్లను కేవలం 11 పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు పంపారు.
యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే (4-1-10-3) భారత టాపార్డర్‌కు చుక్కలు చూపించాడు. ఇన్ని ప్రతికూలతల నడుమ భారత్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (53), శుభ్‌మన్ గిల్ (19), విరాట్ కోహ్లి (3) ఔట్ కాగా.. ఇషాన్ కిషన్ (11), కేఎల్ రాహుల్ (7) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment