ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ ఈవెంట్‌లో టీమిండియా మొట్టమొదటి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో ఇవాళ (సెప్టెంబర్ 25) జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వర్ణం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది.
INDIA Women's Cricket Team wins 𝐆𝐎𝐋𝐃 at the 𝐀𝐬𝐢𝐚𝐧 𝐆𝐚𝐦𝐞𝐬 𝟐𝟎𝟐𝟑🥇 pic.twitter.com/o4NPpbqFix
— CricTracker (@Cricketracker) September 25, 2023
కాంస్య పతకం కోసం ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇవాళ ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది.
India women's team defeated Sri Lanka in the Asian Games 2023 final by 19 runs and clinched the Gold medal for the first time.🥇 pic.twitter.com/5Uf3CP1H9Q
— CricTracker (@Cricketracker) September 25, 2023
Comments
Please login to add a commentAdd a comment