
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ఆక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలుత రౌండ్ 1 మ్యాచ్‌లు జరగనుండగా.. ఆక్టోబర్ 22 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా ఈ మార్క్యూ ఈవెంట్ కోసం అన్ని ప్రధాన జట్లు సన్నద్దం అవుతున్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబిజీగా గడుపుతున్నాయి.
కాగా ఈ మెగా ఈవెంట్‌లో టైటిల్ బరిలో నిలిచే మూడు ఫేవరేట్ జట్లను ఆస్ట్రేలియన్ మాజీ బ్యాటర్ మైఖేల్ బెవన్ ఎంచుకున్నాడు. వాటిలో అతిధ్య ఆస్ట్రేలియా, టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అన్ని జట్ల కంటే భారత్, ఇంగ్లండ్ జట్లు అద్భుతంగా ఉన్నాయని బెవన్ తెలిపాడు.
"టీ20 ప్రపంచకప్-2022 టైటిల్ రేసులో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నిలుస్తాయని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం జట్లు ఫామ్ బట్టి చూస్తే టీమిండియా, ఇంగ్లండ్ ముందంజలో ఉన్నాయి. అదే విధంగా ఆస్ట్రేలియాను కూడా తక్కువగా అంచనా వేయకూడదు.
ఆస్ట్రేలియా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారు తమ ఫామ్‌ను కొనసాగిస్తే.. ఆసీస్‌కు కూడా టైటిల్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ మెగా ఈవెంట్ స్వదేశంలో జరగనుండడం ఆస్ట్రేలియాకు కలిసి వస్తుంది" అని బెవన్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: శ్రేయస్ అయ్యర్ బుల్లెట్ త్రో.. డికాక్ అస్సలు ఊహించలేదుగా!
Comments
Please login to add a commentAdd a comment