భారత్‌ ఘోర పరాజయం | Indian Women Cricket Team Lost The Second One Day Against England | Sakshi
Sakshi News home page

భారత్‌ ఘోర పరాజయం

Published Mon, Apr 9 2018 5:54 PM | Last Updated on Mon, Apr 9 2018 5:54 PM

Indian Women Cricket Team Lost The Second One Day Against England - Sakshi

నాగ్‌పూర్‌ : ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో చతికిలపడింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం విదర్భ క్రికెట్‌ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఎని​మిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు  1-1తో సమం చేసింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత జట్టు.. ఇంగ్లండ్‌ బౌలర్లు సోఫీ ఎక్లెస్టోన్(4/14), హాజెల్‌(4/32) ధాటికి 37.2 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. టీమిండియాలో స్మృతి మంధాన (42; 57బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్‌), దీప్తి శర్మ (26), దేవికా (11) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయకపోవడం గమనార్హం. ముగ్గురు ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరడంతో భారత్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

ఆపై 114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంతో 29 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో డానియెల్ వ్యాట్ (47;43బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు), బీమౌంట్‌ (39; 85 బంతుల్లో 3ఫోర్లు), కెప్టెన్‌ హీథర్ నైట్(26నాటౌట్‌; 42బంతుల్లో 3ఫోర్లు) రాణించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్‌ రెండు వికెట్లు సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement