ICC: తొలిసారి మెగా టోర్నీలోకి జింబాబ్వే.. భారత్‌ షెడ్యూల్‌ ఇదే | W FTP For 2025 29 Announced India To Host England Australia Bangladesh Zimbabwe | Sakshi
Sakshi News home page

ICC: ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, జింబాబ్వేలకు భారత్‌ ఆతిథ్యం

Published Mon, Nov 4 2024 5:05 PM | Last Updated on Mon, Nov 4 2024 6:43 PM

 W FTP For 2025 29 Announced India To Host England Australia Bangladesh Zimbabwe

అంతర్జాతీయ మహిళా క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రాం(FTP) ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఐసీసీ వుమెన్స్‌ చాంపియన్‌షిప్‌తో పాటు మహిళల వన్డే ప్రపంచకప్‌ 2029కు సన్నాహకంగా ఈ షెడ్యూల్‌ ఉండబోతోందని పేర్కొంది. 

అంతేకాదు.. ఈసారి వరల్డ్‌కప్‌ టోర్నీలో అదనంగా మరో జట్టు కూడా చేరుతోందని తెలిపింది. జింబాబ్వే తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో అడుగుపెట్టనుందని ఐసీసీ పేర్కొంది.

44 సిరీస్‌లు
ఇక 2025-29 మధ్యకాలంలో వుమెన్స్‌ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా 44 సిరీస్‌లు నిర్వహించబోతున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఇందులో 132 వన్డేలు ఉంటాయని.. ప్రతి సిరీస్‌లోనూ మూడు మ్యాచ్‌ల చొప్పున జట్లు ఆడతాయని తెలిపింది.

కాగా ఐసీసీ ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రాంలో భాగంగా భారత మహిళా క్రికెట్‌ జట్టు.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, జింబాబ్వేలతో స్వదేశంలో మ్యాచ్‌లు ఆడనుంది. ఇక విదేశీ గడ్డపై న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌ జట్లను ఎదుర్కోనుంది.

ఇదిలా ఉంటే.. భారత్‌ వేదికగా 2025లో ఐసీసీ వుమెన్స్‌ వనన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అదే విధంగా.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 2026లో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. అయితే, 2028 టీ20 వరల్డ్‌కప్‌నకు మాత్రం ఇంకా వేదికను ప్రకటించలేదు.

ఐసీసీ వుమెన్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోయే దేశాలు
ఆస్ట్రేలియా, ఇండియా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌, జింబాబ్వే.

ఆస్ట్రేలియా షెడ్యూల్‌
స్వదేశంలో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌లతో.. అదే విధంగా భారత్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, శ్రీలంక పర్యటన.

ఇండియా షెడ్యూల్‌
స్వదేశంలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, జింబాబ్వేలతో.. న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌ పర్యటన

బంగ్లాదేశ్‌ షెడ్యూల్‌
స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్‌, భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ పర్యటన

ఇంగ్లండ్‌ షెడ్యూల్‌
స్వదేశంలో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌లతో.. భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, శ్రీలంక పర్యటన

ఐర్లాండ్‌ షెడ్యూల్‌
స్వదేశంలో భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌లతో.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, జింబాబ్వే, శ్రీలంక పర్యటన

న్యూజిలాండ్‌ షెడ్యూల్‌
స్వదేశంలో భారత్‌, సౌతాఫ్రికా, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, ఐర్లాండ్‌ పర్యటన

పాకిస్తాన్‌ షెడ్యూల్‌
స్వదేశంలో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వేలతో.. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, శ్రీలంక, ఐర్లాండ్‌ పర్యటన

సౌతాఫ్రికా షెడ్యూల్‌
స్వదేశంలో భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌లతో.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే పర్యటన

శ్రీలంక షెడ్యూల్‌
స్వదేశంలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, ఐర్లాండ్‌లతో... న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే పర్యటన

వెస్టిండీస్‌ షెడ్యూల్‌
స్వదేశంలో భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, శ్రీలంకలతో.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌ పర్యటన

జింబాబ్వే షెడ్యూల్‌
స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, శ్రీలంక, ఐర్లాండ్‌లతో.. భారత్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ పర్యటన.

చదవండి: ఉత్కంఠ పోరులో పాక్‌పై ఆస్ట్రేలియా గెలుపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement