indian women cricket
-
ICC: తొలిసారి మెగా టోర్నీలోకి జింబాబ్వే.. భారత్ షెడ్యూల్ ఇదే
అంతర్జాతీయ మహిళా క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం(FTP) ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్‌తో పాటు మహిళల వన్డే ప్రపంచకప్ 2029కు సన్నాహకంగా ఈ షెడ్యూల్ ఉండబోతోందని పేర్కొంది. అంతేకాదు.. ఈసారి వరల్డ్‌కప్ టోర్నీలో అదనంగా మరో జట్టు కూడా చేరుతోందని తెలిపింది. జింబాబ్వే తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో అడుగుపెట్టనుందని ఐసీసీ పేర్కొంది.44 సిరీస్లుఇక 2025-29 మధ్యకాలంలో వుమెన్స్ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా 44 సిరీస్‌లు నిర్వహించబోతున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఇందులో 132 వన్డేలు ఉంటాయని.. ప్రతి సిరీస్‌లోనూ మూడు మ్యాచ్‌ల చొప్పున జట్లు ఆడతాయని తెలిపింది.కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాంలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో స్వదేశంలో మ్యాచ్‌లు ఆడనుంది. ఇక విదేశీ గడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఐర్లాండ్ జట్లను ఎదుర్కోనుంది.ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా 2025లో ఐసీసీ వుమెన్స్ వనన్డే వరల్డ్‌కప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అదే విధంగా.. యునైటెడ్ కింగ్డమ్లో 2026లో టీ20 ప్రపంచకప్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, 2028 టీ20 వరల్డ్‌కప్‌నకు మాత్రం ఇంకా వేదికను ప్రకటించలేదు.ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోయే దేశాలుఆస్ట్రేలియా, ఇండియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే.ఆస్ట్రేలియా షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లతో.. అదే విధంగా భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక పర్యటన.ఇండియా షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనబంగ్లాదేశ్ షెడ్యూల్స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ పర్యటనఇంగ్లండ్ షెడ్యూల్స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లతో.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక పర్యటనఐర్లాండ్ షెడ్యూల్స్వదేశంలో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, శ్రీలంక పర్యటనన్యూజిలాండ్ షెడ్యూల్స్వదేశంలో భారత్, సౌతాఫ్రికా, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఐర్లాండ్ పర్యటనపాకిస్తాన్ షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్ పర్యటనసౌతాఫ్రికా షెడ్యూల్స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వే పర్యటనశ్రీలంక షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఐర్లాండ్‌లతో... న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనవెస్టిండీస్ షెడ్యూల్స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంకలతో.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐర్లాండ్ పర్యటనజింబాబ్వే షెడ్యూల్స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్‌లతో.. భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పర్యటన.చదవండి: ఉత్కంఠ పోరులో పాక్‌పై ఆస్ట్రేలియా గెలుపు -
దక్షిణాఫ్రికాతో సిరీస్: వన్డేలకు మిథాలీ, టీ20లకు హర్మన్‌ప్రీత్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో లక్నోలో జరిగే మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్లను ప్రకటించారు. వెటరన్ మీడియం పేసర్ శిఖా పాండేతోపాటు వికెట్ కీపర్ తాన్యా భాటియా, వేద కృష్ణమూర్తిలకు రెండు జట్లలోనూ చోటు లభించలేదు. 31 ఏళ్ల శిఖా పాండే భారత్ తరఫున 52 వన్డేలు ఆడి 73 వికెట్లు... 50 టి20 మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు తీసింది. వన్డే జట్టుకు హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్... టి20 జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. టి20 జట్టులో హైదరాబాద్ పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భారత మహిళల వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, పూనమ్ రౌత్, ప్రియా పూనియా, యస్తిక భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్, హేమలత, దీప్తి శర్మ, సుష్మా వర్మ, శ్వేత వర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోస్వామి, మాన్సి జోషి, పూనమ్ యాదవ్, ప్రత్యూష, మోనికా పటేల్. భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, సుష్మా వర్మ, నుజత్ పర్వీన్, అయూషి సోని, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, మాన్సి జోషి, మోనికా పటేల్, ప్రత్యూష, సిమ్రన్. India have announced their squads for the white-ball home series against South Africa. They will play five ODIs and three T20Is, beginning 7 March.#INDvSA pic.twitter.com/5UdRos2u0j — ICC (@ICC) February 27, 2021 -
పరాజయ పరంపర ఆగేనా!
గువాహటి: వన్డేల్లో చాలా బాగా ఆడుతున్నా... టి20 క్రికెట్ మాత్రం భారత మహిళల జట్టుకు అచ్చి రావడం లేదు. వరల్డ్ కప్ సెమీఫైనల్‌తో మొదలుపెట్టి మంగళవారం ఇంగ్లండ్‌తో తొలి టి20 వరకు మన టీమ్ వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడింది. సొంతగడ్డపై కూడా జట్టుకు కలిసి రాలేదు. సిరీస్‌లో 0–1తో వెనుకబడిన దశలో భారత్ రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు జరిగే పోరులో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటి మన జట్టు సిరీస్‌ను సమం చేస్తుందా లేక జోరు మీదున్న ఇంగ్లండ్ 2–0తో సిరీస్ గెలుచుకుంటుందా అనేది ఆసక్తికరం. తొలి టి20 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. టాప్–4లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. చివర్లో శిఖా పాండే, దీప్తి శర్మ చలవతో స్కోరు అతి కష్టమ్మీద వంద పరుగులు దాటగలిగింది. ఈ నేపథ్యంలో జట్టులో ప్రతీ ఒక్కరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన గత మ్యాచ్‌లో అనూహ్యంగా విఫలమైంది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఒత్తిడి కూడా ఆమెపై పడి ఉండవచ్చు. మరో ఓపెనర్ జెమీమాతో పాటు కెరీర్లో తొలి మ్యాచ్ ఆడిన హర్లీన్ డియోల్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఈ సిరీస్ తర్వాత టి20ల నుంచి తప్పుకుంటుందని వినిపిస్తున్న మిథాలీ రాజ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆమె ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడితే బాగుంటుంది. వీరితో పాటు వేద కృష్ణమూర్తి కూడా రాణించాల్సి ఉంది. తొలి టి20లో బౌలింగ్‌లో దీప్తి, అరుంధతి, రాధాయాదవ్ పూర్తిగా విఫలమయ్యారు. మొత్తంగా గత మ్యాచ్ తప్పులను సరిదిద్దుకొని బరిలోకి దిగితే స్మృతి సేనకు విజయావకాశం ఉంటుంది. మరోవైపు వన్డే సిరీస్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న ఇంగ్లండ్ సిరీస్ విజయంపై గురి పెట్టింది. మొదటి మ్యాచ్‌ను గెలిపించిన బీమోంట్, కెప్టెన్ హీథెర్ నైట్, వ్యాట్ మరోసారి భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ జట్టు బౌలింగ్ కూడా బలంగా ఉంది. బ్రంట్, లిన్సీ స్మిత్, క్రాస్ కలిపి తమ పూర్తి కోటా 12 ఓవర్లలో కేవలం 66 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం భారత్‌ను దెబ్బ తీసింది. ఇదే ఫామ్‌ను కొనసాగించాలని వారు పట్టుదలగా ఉన్నారు. ఈ స్థితిలో భారత్ మ్యాచ్, ఆపై సిరీస్ చేజారిపోకుండా కాపాడుకోగలదా చూడాలి. Indian women looking to bounce back against England in second T20 -
ఏక్తా మాయాజాలం
ముంబై: సొంతగడ్డపై బౌలర్లు చెలరేగడంతో... ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 66 పరుగుల తేడాతో గెలిచింది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్‌కు రెండు పాయింట్లు లభించాయి. ఎడంచేతి వాటం స్పిన్నర్ ఏక్తా బిష్త్ మాయాజాలానికి ఇంగ్లండ్ చేతులెత్తేసింది. 8 ఓవర్లు వేసిన ఏక్తా 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకుంది. ఏక్తాకు లభించిన చివరి మూడు వికెట్లు ఐదు బంతుల తేడాలో రావడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 49.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టు 41 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. స్పిన్నర్లు ఏక్తా బిష్త్ (4/25), దీప్తి శర్మ (2/33) భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.అంతకుముందు భారత ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్ (58 బంతుల్లో 48; 8 ఫోర్లు), స్మృతి మంధాన (42 బంతుల్లో 24; 3 ఫోర్లు) దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. స్మృతి ఔటయ్యాక భారత ఇన్నింగ్స్ తడబడింది. ఒకదశలో ఒక వికెట్‌కు 85 పరుగులతో పటిష్టంగా కనిపించిన టీమిండియా పది పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయి ఐదు వికెట్లకు 95 పరుగులతో నిలిచింది. ఈ దశలో కెప్టెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ (74 బంతుల్లో 44; 4 ఫోర్లు), వికెట్ కీపర్ తానియా (41 బంతుల్లో 25; 2 ఫోర్లు) సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆరో వికెట్‌కు 54 పరుగులు జత చేశారు.తానియా, మిథాలీ ఔటయ్యాక చివర్లో జులన్ గోస్వామి (37 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో జార్జియా అమండా ఎల్విస్, నటాలీ షివెర్, సోఫీ ఎకిల్‌స్టోన్ రెండేసి వికెట్లు తీశారు. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం లభించలేదు. పేసర్ శిఖా పాండే (2/21) ధాటికి ఇంగ్లండ్ 38 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే నటాలీ షివెర్ (44; 5 ఫోర్లు), కెప్టెన్ హీతెర్ నైట్ (39 నాటౌట్; 2 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు క్రీజులో నిలదొక్కుకోవడంతో ఇంగ్లండ్ లక్ష్యం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ 31వ ఓవర్లో ఇంగ్లండ్ స్కోరు 111 పరుగుల వద్ద నటాలీ షివెర్‌ను ఏక్తా బిష్త్ రనౌట్ చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అనంతరం ఏక్తా తన స్పిన్ మాయాజాలంతో విజృంభించింది. తొలుత కేథరీన్ బ్రంట్‌ను ఔట్ చేసిన ఆమె... ఇన్నింగ్స్ 41వ ఓవర్లో ఐదు బంతుల తేడాలో ష్రబ్సోల్, సోఫీ ఎకిల్‌స్టోన్, అలెగ్జాండ్రా హార్ట్‌లెలను ‘డకౌట్’ చేసి భారత విజయాన్ని ఖాయం చేసింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చివరి ఏడు వికెట్లను 25 పరుగుల తేడాలో కోల్పోవడం గమనార్హం. -
లంకపై భారత్ జయభేరి
కౌలాలంపూర్: గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న భారత మహిళల జట్టు ఆసియా కప్ టి20 టోర్నీ నాలుగో లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక... భారత బౌలర్ల ధాటికి 7 వికెట్ల నష్టానికి 107 పరుగులకే పరిమితమైంది. హసిని పెరీరా (43 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. ఏక్తా బిష్త్ (2/20), జులన్ గోస్వామి (1/20), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనూజ పాటిల్ (1/19), పూనమ్ యాదవ్ (1/23) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టులో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం టాపార్డర్ సమష్టిగా రాణించడంతో భారత్ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. మిథాలీ రాజ్ (23), హర్మన్ ప్రీత్ కౌర్ (24), వేద కృష్ణమూర్తి (29 నాటౌట్; 4 ఫోర్లు) అనూజ పాటిల్ (19 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. ఈ టోర్నీలో థాయ్‌లాండ్, మలేసియాలపై వరుస విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం గత మ్యాచ్‌లో బంగ్లా చేతిలో ఓడింది. మిథాలీ@ 2000... ఈ మ్యాచ్ ద్వారా భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. 35 ఏళ్ల మిథాలీ 74 మ్యాచ్‌లు ఆడి 2015 పరుగులు చేసింది. మొత్తంగా ఈ మైలురాయిని దాటిన ఏడో మహిళా క్రికెటర్ మిథాలీ. ఇంగ్లండ్ స్టార్ ఎడ్వర్ట్స్ (2,605) అగ్రస్థానంలో ఉంది. టి20 గణాంకాల్లో పురుషుల జట్టు కెప్టెన్ కోహ్లి (1,983) కూడా మిథాలీ కంటే వెనుకే ఉండటం గమనార్హం. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో స్మృతి మంధాన
ఇంగ్లండ్ మహిళల జట్టుతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ స్మృతి మంధాన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం విడుదల చేసిన బ్యాట్స్ఉమెన్ వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి 10 స్థానాల పురోగతి సాధించి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. ఈ ఏడాది స్మృతి తొమ్మిది ఇన్నింగ్స్‌లు ఆడి ఐదు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 531 పరుగులు చేసింది. భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఏడో స్థానంలో నిలిచింది. ఆల్‌రౌండర్ల విభాగంలో దీప్తి శర్మ మూడో స్థానానికి ఎగబాకింది. -
భారత మహిళలదే వన్డే సిరీస్
నాగ్‌పూర్: గతేడాది ఇంగ్లండ్ చేతిలో ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి భారత మహిళల జట్టు సిరీస్ విజయంతో బదులు తీర్చుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 2–1తో కైవసం చేసుకుంది. గురువారం ఇక్కడ జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మిథాలీ బృందం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులకు పరిమితమైంది. వికెట్ కీపర్ అమి జోన్స్ (94; 7 ఫోర్లు, 1 సిక్స్) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచింది. జులన్ గోస్వామి, దీప్తి శర్మ, రాజేశ్వరి, పూనమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం మిథాలీ రాజ్ (74 నాటౌట్; 9 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు దీప్తి శర్మ (54 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (53 రిటైర్డ్ హర్ట్; 6 ఫోర్లు) చెలరేగడంతో భారత్ 45.2 ఓవర్లలోనే 202 పరుగులు చేసి గెలుపొందింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, స్మృతి మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇంగ్లండ్ జట్టుపై ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్ గెలవడం ఇది ఆరోసారి. మిథాలీ మరో రికార్డు ఈ మ్యాచ్‌తో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డే చరిత్రలో అత్యధికంగా 56సార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది. గతంలో ఈ ఘనత ఇంగ్లండ్ ప్లేయర్ చార్లోటి ఎడ్వర్ట్స్ (55) పేరిట ఉంది. వన్డేల్లో మిథాలీకి ఇది 50వ అర్ధశతకం కావడం మరో విశేషం. -
వన్డే సిరీస్ భారత్‌దే
నాగ్‌పూర్: భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తేడాతో గెలుచుకుంది. గురువారం విదర్భ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌ను భారీ స్కోర్ చేయకుండా భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జేమ్స్(94; 119 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్) రాణించడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. భారత బౌలర్లలో గోస్వామి, రాజేశ్వరీ గైక్వాడ్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ తలో రెండు వికెట్లు సాధించారు. ఆ తర్వాత 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 23 పరుగులకే రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో నిలిచింది. ఈ సమయంలో మరో ఓపెనర్ స్మృతి మంధన (53 రిటైర్డ్ హర్ట్;67 బంతుల్లో 6ఫోర్లు) తో కలిసి కెప్టెన్ మిథాలీ రాజ్(74నాటౌట్; 124 బంతుల్లో 9ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దింది. మంధన ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(54నాటౌట్; 61 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్స్) మెరుపు బ్యాటింగ్ చేసి భారత్ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్ ష్రబ్సోల్ రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన దీప్తిశర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్‌లో నిలకడగా రాణించిన స్మృతి మంధన ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నారు. -
భారత్ ఘోర పరాజయం
నాగ్‌పూర్ : ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో చతికిలపడింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం విదర్భ క్రికెట్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 1-1తో సమం చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు.. ఇంగ్లండ్ బౌలర్లు సోఫీ ఎక్లెస్టోన్(4/14), హాజెల్(4/32) ధాటికి 37.2 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. టీమిండియాలో స్మృతి మంధాన (42; 57బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్), దీప్తి శర్మ (26), దేవికా (11) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయకపోవడం గమనార్హం. ముగ్గురు ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఆపై 114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంతో 29 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో డానియెల్ వ్యాట్ (47;43బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు), బీమౌంట్ (39; 85 బంతుల్లో 3ఫోర్లు), కెప్టెన్ హీథర్ నైట్(26నాటౌట్; 42బంతుల్లో 3ఫోర్లు) రాణించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ రెండు వికెట్లు సాధించింది. -
భారత్‌ను గెలిపించిన పూనమ్, ఏక్తా
నాగ్‌పూర్: గత ఏడాది ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమికి భారత మహిళల జట్టు బదులు తీర్చుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. పూనమ్ (4/30), ఏక్తా (3/49) ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు. అనంతరం భారత్ 49.1 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన (86; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. 190/9తో ఓటమి అంచుల్లో ఉన్న భారత్‌ను ఏక్తా బిష్త్ (12 నాటౌట్), పూనమ్ యాదవ్ (7 నాటౌట్) గట్టెక్కించారు. మిథాలీ రికార్డు: ఈ మ్యాచ్‌తో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు (192) ఆడిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది. ఈ రికార్డు గతంలో ఇంగ్లండ్‌కు చెందిన చార్లోటి ఎడ్వర్ట్స్ (191) పేరిట ఉంది. -
మళ్లీ ఓడిన భారత మహిళలు
ముంబై: ఫార్మాట్ మారినా భారత మహిళా క్రికెట్ జట్టు రాత మారలేదు. ఆస్ట్రేలియా చేతిలో వన్డేల్లో 0–3తో చిత్తయిన మన జట్టు... ఇప్పుడు టి20 ముక్కోణపు టోర్నీని కూడా పరాజయంతో ప్రారంభించింది. గురువారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో భారత్‌పై సునాయాసంగా గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 156 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (41 బంతుల్లో 67; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిథాలీ రాజ్ (18) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరు 9.3 ఓవర్లలోనే 72 పరుగులు జోడించారు. ముఖ్యంగా మైదానం నలువైపులా షాట్లు కొట్టిన స్మృతిమంధాన 30 బంతుల్లోనే అర్ధశతకం అందుకుంది. మరో ఎండ్‌లో మిథాలీ అవుటైనా ఆమె జోరు కొనసాగించింది. టి20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధశతకం, అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మంధాన 13వ ఓవర్లో గార్డ్నర్ (2/21) బౌలింగ్‌లో అవుటైంది. తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (13), జెమీమా (1) విఫలమవడంతో రన్‌రేట్‌పై ప్రభావం పడింది. వేదా కృష్ణమూర్తి (10 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్), అనూజ పాటిల్ (21 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో బ్యాట్ ఝళిపించారు. లక్ష్య ఛేదనలో భారత పేసర్ జులన్ గోస్వామి (3/30) ధాటికి ఆసీస్ 29 పరుగులకే ఓపెనర్ అలీసా హీలీ (4), గార్డ్నర్ (15)ల వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ మూనీ (32 బంతుల్లో 45; 8 ఫోర్లు), విలానీ (33 బంతుల్లో 39; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆదుకున్నారు. లానింగ్ (25 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆసీస్ మరో 11 బంతులు ఉండగానే విజయం సాధించింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో తలపడుతుంది. -
భారత మహిళల ‘ఎ’ జట్టు కెప్టెన్ మేఘన
ముంబై: ముక్కోణపు టి20 సిరీస్ సన్నాహాల్లో భాగంగా... ఇంగ్లండ్ మహిళల టి20 జట్టుతో జరిగే రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో పాల్గొనే భారత మహిళల ‘ఎ’ జట్టును ప్రకటించారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన కెప్టెన్‌గా ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన వికెట్ కీపర్ రావి కల్పన, హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డిలకు కూడా ఈ జట్టులో చోటు లభించింది. ఈనెల 18, 19వ తేదీల్లో ముంబైలో వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 22 నుంచి 31 వరకు ముక్కోణపు టోర్నమెంట్ జరుగుతుంది. భారత మహిళల ‘ఎ’ జట్టు: సబ్బినేని మేఘన (కెప్టెన్), వనిత, హేమలత, మోనికా దాస్, తరన్నుమ్ పఠాన్, ప్రియాంక ప్రియదర్శిని, అరుంధతి రెడ్డి, రావి కల్పన (వికెట్ కీపర్), రాధా యాదవ్, కవితా పాటిల్, శాంతి కుమారి, ప్రీతి బోస్, షెరాల్ రొజారియో, హర్లీన్. -
బ్యాటింగ్ భారం తగ్గింది
కేప్‌టౌన్: భారత మహిళల క్రికెట్ జట్టులో మిథాలీ రాజ్‌ది చెరగని ముద్ర. వన్డేల్లో సారథిగా కొనసాగుతున్న ఈ వెటరన్ క్రికెటర్ ... ఇప్పుడు టి20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సఫారీ పర్యటనలో పొట్టి ఫార్మాట్లో సత్తా చాటుకుంది. మ్యాచ్‌లు గెలిపించే ఇన్నింగ్స్‌లతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచింది. ఇదే ఆత్మవిశ్వాసంతో టి20ల్లోనూ ముందడుగు వేస్తానని చెప్పింది. స్మృతి మంధన, వేద, జెమీమాలు కూడా నిలకడగా రాణిస్తుండటంతో తనపై బ్యాటింగ్ భారం తగ్గిందని తెలిపింది. త్వరలో జరిగే సిరీస్‌లు, జట్టు సన్నాహాలపై ఈ హైదరాబాదీ స్టార్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... ప్రపంచకప్ కోసమే... నిజాయితీగా చెప్పాలంటే... నాకు టి20లంటే అమితాసక్తి లేదు. అయితే టి20 ప్రపంచకప్ లక్ష్యంగా సన్నాహాలకు పదును పెట్టడం వల్లే ఈ ప్రదర్శన సాధ్యమైంది. ఇప్పుడు నేను కూడా టి20 ప్లేయర్‌ననే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఓపెనర్‌గా నేను ధాటిగా ఆడేందుకు మంచి అవకాశం దొరికింది. మొదటి ఆరు ఓవర్లు (పవర్ ప్లే) చాలా కీలకం. జట్టుకు శుభారంభమిచ్చే అవకాశం ఇక్కడే మొదలవుతుంది. పొట్టి ఫార్మాట్లో విదేశీగడ్డపై నేను ఓపెనర్‌గా విజయవంతమయ్యాను. ఇదే ఉత్సాహాన్ని తదుపరి సిరీస్‌లలో కొనసాగిస్తా. పెను భారం లేదిపుడు... ఇంతకుముందున్నట్లు... ప్రధానంగా బ్యాటింగ్ భారమంతా నా మీదే లేదు. హర్మన్‌ప్రీత్ (టి20 కెప్టెన్), వేద కృష్ణమూర్తి, టీనేజ్ సంచలనం జెమీమా రోడ్రిగ్స్‌లు నిలకడగా రాణిస్తున్నారు. దీంతో నేను స్వేచ్ఛగా నా ఆటతీరు కొనసాగించే వీలు చిక్కింది. ఆచితూచి ఆడటం కన్నా... ప్రయోగాత్మక షాట్లు ఆడేందుకు ఇదో కారణం. ఔట్ అవుతాననే బెంగేలేకుండా ఆడగలుగుతున్నా. జట్టులో ఇద్దరుముగ్గురు మ్యాచ్ విన్నర్లు ఉండటం నిజంగా అదృష్టం. ఇదే పటిష్టమైన జట్టుకు నిదర్శనం. లోయర్ ఆర్డర్ మెరుగవ్వాలి... టి20 ప్రపంచకప్ గెలవాలంటే జట్టులో ఐదారుగురు ఆడితే సరిపోదు. అందరు సమష్టిగా రాణించాలి. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా తమ వంతు పరుగులు సాధించిపెట్టాలి. టాప్, మిడిలార్డర్ విఫలమైనపుడు వీళ్లు చేసే స్కోర్లే కీలకమవుతాయి. వెస్టిండీస్‌లో అక్టోబర్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్లో స్పిన్నర్లు కూడా కీలకపాత్ర పోషిస్తారు. మా ఆటపైనా కన్నేశారు... క్రికెట్ వీక్షకుల్లో మార్పొచ్చింది. భారత అభిమానులు మా మ్యాచ్‌లపై కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. మహిళల జట్టు ఎంత స్కోరు చేసింది? ఎలా ఆడుతుంది? అని టీవీల్లో చూసేవారి సంఖ్య పెరుగుతోంది. వన్డే సిరీస్‌ను బ్రాడ్కాస్ట్ చేయలేకపోయినప్పటికీ టి20 మ్యాచ్‌లను ప్రసారం చేయడం మంచి పరిణామం. చూస్తు ఉండండి... టి20 ప్రపంచ కప్‌లో కూడా మేం అందరిని ఆశ్చర్యపరిచే ఆటతో అలరిస్తాం. -
టీమిండియాకు ఎదురుదెబ్బ
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న భారత స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ మూడో టీ20లో డకౌటైంది. గత రెండు టీ20 మ్యాచ్‌లలో అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చిన మిథాలీ నేటి మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టింది. తొలి ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా పేసర్ మరిజాన్నే కాప్ ఇన్నింగ్స్ ఐదో బంతికి షాట్ ఆడగా ఫీల్డర్ లీ క్యాచ్ పట్టడంతో మిథాలీ నిరాశగా వెనుదిరిగింది. అంతకుముందు భారత మహిళల క్రికెట్ జట్టుతో మూడో టీ20లో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. మరోవైపు ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సేన నేటి మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ నెగ్గాలని భావిస్తోంది. దీంట్లోనూ గెలుపొందితే దక్షిణాఫ్రికాలో వన్డే, టి20 సిరీస్‌లు సాధించిన తొలి జట్టుగా చరిత్రలో నిలుస్తుంది. రెండు జట్లలో చివరి నిమిషంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. భారత జట్టులో రాధా యాదవ్ స్థానంలో గైక్వాడ్ జట్టులోకి వచ్చింది. కాగా, ప్రొటీస్ జట్టులో ఖాకా స్థానంలో క్లాస్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు సఫారీ టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. వాండరర్స్ మైదానంలో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం పురుషుల జట్టు మ్యాచ్ మొదలవనుండటం విశేషం. -
గెలిస్తే... సిరీస్ మనదే
-
గెలిస్తే... సిరీస్ మనదే
జొహన్నెస్‌బర్గ్: ఓవైపు పురుషుల జట్టు వన్డేల్లో సఫారీలను చితగ్గొట్టి సిరీస్ కొల్లగొడితే, మరోవైపు మహిళల జట్టూ అదే పని చేసింది. ఈసారి పురుషుల జట్టు టి20లు ఆడబోయే సమయానికి మహిళలు పొట్టి ఫార్మాట్లో సిరీస్ విజయానికి చేరువగా వచ్చారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు గెలిచి ఊపు మీదున్న హర్మన్‌ప్రీత్ బృందం... ఆదివారం మూడో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. దీంట్లోనూ గెలుపొందితే దక్షిణాఫ్రికాలో వన్డే, టి20 సిరీస్‌లు సాధించిన తొలి జట్టుగా చరిత్రలో నిలుస్తుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30కు వాండరర్స్ మైదానంలో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం పురుషుల జట్టు మ్యాచ్ మొదలవనుండటం విశేషం. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, మిథాలీ అద్భుత ఫామ్, బౌలింగ్‌లో స్పిన్నర్లు అనూజ, పూనమ్ రాణిస్తుండటంతో మన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గాయంతో సిరీస్ నుంచి వైదొలగిన జులన్ గోస్వామి స్థానంలో రుమేలీ ధర్‌ను ఎంపిక చేశారు. -
మహిళల జట్టూ మెరిసింది
కింబర్లీ: సఫారీ గడ్డపై భారత పురుషుల జట్టు స్పిన్నర్ల ప్రదర్శనతో స్ఫూర్తి పొందారో ఏమోగానీ... మహిళల జట్టు స్పిన్నర్లూ చెలరేగిపోయారు. దక్షిణాఫ్రికాను వరుసగా రెండో వన్డేలోనూ చిత్తుగా ఓడించిన మిథాలీ సేన మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో చేజిక్కించుకుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో అన్ని రంగాల్లో ఆధిపత్యం చాటిన భారత్ 178 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. స్మృతి మంధాన (129 బంతుల్లో 135; 14 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన శతకానికి తోడు హర్మన్‌ప్రీత్ కౌర్ (69 బంతుల్లో 55; 2 ఫోర్లు, 1 సిక్స్), వేద కృష్ణమూర్తి (33 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలు చేయడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (20), పూనమ్ రౌత్ (20) ఫర్వాలేదనిపించారు. లక్ష్య ఛేదనలో లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ (4/24), ఎడంచేతి వాటం స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ (2/14)లకు తోడు దీప్తి శర్మ (2/34) ఆఫ్ స్పిన్ ధాటికి దక్షిణాఫ్రికా జట్టు చేతులెత్తేసింది. 30.5 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ లిజెల్లీ లీ (75 బంతుల్లో 73; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కాప్ (17) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ లౌరా వోల్‌వార్త్‌ను అవుట్ చేయడం ద్వారా మహిళల వన్డే క్రికెట్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా జులన్ గోస్వామి రికార్డులకెక్కింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 35 ఏళ్ల జులన్ 2002లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2007లో ఐసీసీ ఉమన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైంది. పురుషుల వన్డే క్రికెట్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్ దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ కావడం విశేషం. -
'మహిళా క్రికెట్ కీ ఐపీఎల్ తరహా టోర్నమెంట్ లు అవసరం'
న్యూఢిల్లీ:భారత్ లో మహిళా క్రికెట్ మరింత వెలుగులోకి రావడానికి ఐపీఎల్ తరహా టోర్నమెంట్ ఉంటే మరింత లబ్ధి చేకూరుతుందని మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఈ తరహా టోర్నమెంట్లు వల్ల మరింత ప్రతిభావంతులైన క్రీడాకారిణులు సత్తా చాటుకునేందుకు ఆస్కారం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి టోర్నమెంట్ ను ప్రవేశపెడితే అది ఒక దేశానికే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారిణులకు వెలుగులోకి వచ్చే ఆస్కారం లభిస్తుందన్నారు. భారత క్రికెట్ కు ప్రాతినిధ్య వహిస్తున్న ఓ క్రీడాకారిణిగా తాను ఈ విషయాన్ని క్రికెట్ పెద్దలకు విన్నవిస్తున్నానని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆటలకున్న ప్రాధాన్యతను బట్టి ఆలోచిస్తే లీగ్ మ్యాచ్ టోర్నీలు విజయవంతమైయ్యాయన్న సంగతిని ఆమె గుర్తు చేశారు. ప్రతీ ఆటలోనూ ఇప్పటివరకూ పలురకాలైన లీగ్ లు ఆకట్టుకుంటూనే ఉన్నాయన్నారు. భారత్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్థానం ఎప్పటికీ పదిలంగానే ఉంటుందన్నారు. ఎంతమంది ఆటగాళ్లు వచ్చినా ఆయన తరువాతేనని అంజుమ్ తెలిపారు.