చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన జరిగిన మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. కాగా గత నాలుగేళ్లలో స్వదేశంలో టీమిండియా సిరీస్‌ను కోల్పోవడం ఇదే తొలి సారి. మార్చి 2019 నుంచి అన్ని ఫార్మాట్లలో వరుసగా 24 సిరీస్‌లలో టీమిండియా విజయం సాధించింది. చివరగా 2019 ఆరంభంలో ఆసీస్‌పైనే భారత్ సిరీస్‌ను కోల్పోయింది.
అదే విధంగా రోహిత్ శర్మకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా స్వదేశంలో ఇదే తొలి సిరీస్ ఓటమి కావడం గమానార్హం. ఇక సిరీస్‌లో ఓటమిపాలైన టీమిండియా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని కూడా కోల్పోయింది. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఆసీస్‌తో 113 రేటింగ్ పాయింట్లతో టీమిండియా సమంగా ఉన్నప్పటికీ.. మ్యాచ్ విన్నింగ్ శాతం పరంగా కంగారూ జట్టు టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. టీమిండియా తరువాతి స్థానంలో 111 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ నిలిచింది.
చదవండి: IND Vs AUS: సొంతగడ్డపై బెబ్బులే.. కానీ ఆసీస్‌కు మాత్రం దాసోహం
IND vs AUS: అదే మా కొంప ముంచింది.. అస్సలు ఊహించలేదు! క్రెడిట్ మొత్తం వారికే
Comments
Please login to add a commentAdd a comment