ekta bisht
-
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
పసిడి పంట
జకార్తా: ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. పోటీల మూడో రోజు మంగళవారం భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలు చేరాయి. షూటింగ్లో పురుషుల 10 మీటర్ల పి–1 ఎయిర్ పిస్టల్ విభాగంలో మనీశ్ నర్వాల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో మనీశ్ 235.9 పాయింట్లు స్కోరు చేశాడు. అథ్లెటిక్స్‌లో ఏక్తా భ్యాన్ మహిళల క్లబ్ త్రో (ఎఫ్ 32/51) విభాగంలో, పురుషుల 100 మీటర్ల (టి35) విభాగంలో నారాయణ్ ఠాకూర్ బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఏక్తా ఇనుప గుండును 16.02 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచింది. నారాయణ్ ఠాకూర్ 14.02 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. పురుషుల షాట్‌పుట్ (ఎఫ్ 56/57)లో వీరేందర్, పురుషుల హైజంప్ (టి 45/46/47)లో రాంపాల్, డిస్కస్ త్రో (ఎఫ్ 43/44/62/64)లో సురేంద్రన్ పిళ్లై, అనీశ్ కుమార్ రజత పతకాలు గెలిచారు. పురుషుల షాట్‌పుట్ (ఎఫ్ 11)లో మోనూ ఘంగాస్, 200 మీటర్ల (టి 44/62/64)లో ఆనందన్ గుణశేఖరన్, డిస్కస్ త్రో (ఎఫ్ 46)లో గుర్జర్ సుందర్ సింగ్, డిస్కస్ త్రో (ఎఫ్ 43/44/62/64)లో ప్రదీప్, మహిళల 200 మీటర్ల పరుగు (టి 45/46/47)లో జయంతి బెహరా కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ 6 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి 28 పతకాలతో తొమ్మిదో స్థానంలోఉంది. -
భారత్ ఘోర పరాజయం
నాగ్‌పూర్ : ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో చతికిలపడింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం విదర్భ క్రికెట్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 1-1తో సమం చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు.. ఇంగ్లండ్ బౌలర్లు సోఫీ ఎక్లెస్టోన్(4/14), హాజెల్(4/32) ధాటికి 37.2 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. టీమిండియాలో స్మృతి మంధాన (42; 57బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్), దీప్తి శర్మ (26), దేవికా (11) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయకపోవడం గమనార్హం. ముగ్గురు ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఆపై 114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంతో 29 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో డానియెల్ వ్యాట్ (47;43బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు), బీమౌంట్ (39; 85 బంతుల్లో 3ఫోర్లు), కెప్టెన్ హీథర్ నైట్(26నాటౌట్; 42బంతుల్లో 3ఫోర్లు) రాణించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ రెండు వికెట్లు సాధించింది. -
అగ్రస్థానంలో రైల్వేస్
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే లీగ్ టోర్నమెంట్లో ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో రైల్వేస్ జట్టు విజయంతో తమ లీగ్ మ్యాచ్‌లను ముగించింది. హిమాచల్‌ప్రదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా నాలుగు విజయాలతో (16 పాయింట్లు) అజేయంగా రైల్వేస్ గ్రూప్ టాపర్‌గా నిలిచింది. స్థానిక ఏఓసీ గ్రౌండ్లో జరిగిన ఈమ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హిమాచల్‌ప్రదేశ్ 47.2 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. కేహెచ్ వర్మ (26), హెచ్‌బీ డియోల్ (27) పర్వాలేదనిపించారు. రైల్వేస్ బౌలర్లలో ఏక్తా బిష్త్ 5 వికెట్లతో చెలరేగింది. మోనా మేశ్రమ్, రాజేశ్వరి, సుకన్య, అరుంధతి తలా వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 110 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన రైల్వేస్ జట్టు 31.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. నుజత్ పర్వీన్ (65 బంతుల్లో 34; 5 ఫోర్లు), ఎండీ తిరుష్ కామిని (50 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఆంధ్ర ఘనవిజయం మరోవైపు ఆంధ్ర జట్టు మూడో విజయాన్ని సాధించింది. ఆర్ఆర్సీ గ్రౌండ్లో మధ్యప్రదేశ్‌తో గురువారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఆంధ్ర 54 పరుగులతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 224 పరుగులు చేసింది. ఝాన్సీ లక్ష్మి (95 బంతుల్లో 65; 5 ఫోర్లు), వి. పుష్పలత (70 బంతుల్లో 56; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఎన్. అనూష (53 బంతుల్లో 34; 4 ఫోర్లు) రాణించింది. అనంతరం మధ్యప్రదేశ్ జట్టు 39.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. రుచిత (71 బంతుల్లో 58; 3 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. ఆంధ్ర బౌలర్లలో మల్లిక 3 వికెట్లతో చెలరేగగా, ఝాన్సీలక్ష్మి, పద్మజ చెరో 2 వికెట్లు తీశారు. లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి ఆంధ్ర జట్టు నాలుగు మ్యాచ్లకుగానూ మూడు గెలిచి 12 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ కేవలం ఒకే విజయాన్ని సాధించి 4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. -
ఈ మహిళా క్రికెటర్ చాయ్ వాలా కూతురు..
న్యూఢిల్లీ: మహిళా ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఎక్తా బిష్త్ అబ్బాయిలతో క్రికెట్ ఆడటం మొదలు పెట్టిందని ఆమె తల్లి తండ్రులు పేర్కొన్నారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమది పేదకుటుంబ నేపథ్యమని అయినా ఎక్తా పట్టుదలతో రాణించి జట్టుకు ఎంపికైందని సంతోషం వ్యక్తం చేశారు. ఎక్తా నాన్న కుందన్ సింగ్ బిష్త్ మిలటీరి నుంచి రిటైర్మెంట్ అయిన తరువాత చాయ్ అమ్మెవాడినని తెలిపారు. తన కూతురు కలల కోసం ప్రోత్సహించేవాడినని చెప్పుకొచ్చారు . ఎక్తాకు క్రికెట్ అంటే పిచ్చి అని అదే ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు. ఓ చాయ్ వాల కూతురుగా దేశానికి ఆడటం గర్వంగా ఉందన్నారు. ఎక్తా 6 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతుందని, అబ్బాయిలతో ఆడటం మొదలు పెట్టిందని జట్టులో ఒక్కతే అమ్మాయి కావడంతో ఎక్తా ఆడే మ్యాచ్ లు చూడటానికి జనాలు ఎగబడేవారని కుందన్ తెలిపారు. ఎక్తా జాతీయ జట్టుకు ఎంపికైన అనంతరం మా ఆర్ధిక పరిస్తితి మెరుగుపడిందన్నారు. భారత్ మహిళలు ప్రపంచకప్ గెలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎక్తా బిష్త్ పాక్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లతో చెలరేగి పాక్ ను కుప్పకూల్చిన విషయం తెలిసిందే. -
ఏక్తా ధాటికి హైదరాబాద్ విలవిల
సాక్షి, హైదరాబాద్: రైల్వేస్ బౌలర్ ఏక్తా బిస్త్ (4/7) బౌలింగ్ ధాటికి హైదరాబాద్ జట్టు విలవిల్లాడింది. ఆలిండియా సీనియర్ మహిళల టి20 టోర్నీలో ఎలైట్ ‘ఎ’ గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. డయానా డేవిడ్ (33), మమతా కనోజియా (20) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రైల్వేస్ మహిళలు 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 103 పరుగులు చేసి నెగ్గింది. అనఘా దేశ్‌పాండే (28), పూనమ్ రౌత్ (26 నాటౌట్)లు ఆకట్టుకున్నారు. షాలిని, స్రవంతి నాయుడులకు రెండేసి వికెట్ల చొప్పున దక్కాయి. హర్యానాపై ఒడిషా గెలుపు మరో మ్యాచ్‌లో ఒడిషా మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో హర్యానాపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 73 పరుగులు మాత్రమే చేయగా, తేలికైన లక్ష్యాన్ని ఒడిషా 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించింది. ఎంపీ మెహతా 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.