సాక్షి, హైదరాబాద్: రైల్వేస్ బౌలర్ ఏక్తా బిస్త్ (4/7) బౌలింగ్ ధాటికి హైదరాబాద్ జట్టు విలవిల్లాడింది. ఆలిండియా సీనియర్ మహిళల టి20 టోర్నీలో ఎలైట్ ‘ఎ’ గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. డయానా డేవిడ్ (33), మమతా కనోజియా (20) రాణించారు.
అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రైల్వేస్ మహిళలు 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 103 పరుగులు చేసి నెగ్గింది. అనఘా దేశ్‌పాండే (28), పూనమ్ రౌత్ (26 నాటౌట్)లు ఆకట్టుకున్నారు. షాలిని, స్రవంతి నాయుడులకు రెండేసి వికెట్ల చొప్పున దక్కాయి.
హర్యానాపై ఒడిషా గెలుపు
మరో మ్యాచ్‌లో ఒడిషా మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో హర్యానాపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 73 పరుగులు మాత్రమే చేయగా, తేలికైన లక్ష్యాన్ని ఒడిషా 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించింది. ఎంపీ మెహతా 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
ఏక్తా ధాటికి హైదరాబాద్ విలవిల
Published Wed, Feb 5 2014 12:19 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM
Advertisement
Advertisement