
క్వీన్స్‌టౌన్ వేదికగా జరిగిన ఏకైక టీ20లో భారత్‌పై న్యూజిలాండ్ మహిళల జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బ్యాటర్లలో సబ్భినేని మేఘన(37), యస్తికా భాటియా(26) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కేర్, అమేలియా కెర్, జాన్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సుజీ బేట్స్(36), డివైన్( 31) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌కు బారత జట్టు సీనియర్ ఓపెనర్ స్మృతి మంధాన దూరమైంది. ఇక న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు 5 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే శనివారం జరగనుంది.
చదవండి: MS Dhoni Gym Video: అదీ ధోని భాయ్ అంటే.. ఎంతో ఓపికగా జిమ్‌లో.. వీడియో వైరల్