మహిళల క్రికెట్ భవిష్యత్ పర్యటనల కార్యక్రమంలో మార్పులు
మేటి జట్ల మధ్య క్రమం తప్పకుండా మ్యాచ్‌లు
వచ్చే నాలుగేళ్ల కాలానికి సంబంధించి ఎఫ్‌టీపీని విడుదల చేసిన ఐసీసీ
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా తదితర మేటి జట్లతో సిరీస్‌లు ఆడనున్న భారత్
దుబాయ్: మన మహిళల క్రికెట్‌కు మంచి రోజులు వస్తున్నాయి. గట్టి ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇకపై క్రమం తప్పకుండా భారత్‌లో పర్యటించనున్నాయి. 2025–29 సైకిల్‌కు సంబంధించిన మహిళల భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ)లో భాగంగా భారత జట్టు కీలక ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడనుంది. ఈ నాలుగేళ్ల కాలంలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికాల్లోనూ టీమిండియా పర్యటించనుంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లోని ప్రతి సభ్య దేశం ఇంటా బయటా నాలుగు సిరీస్‌ల చొప్పున పాల్గొనేలా కొత్త ఎఫ్‌టీపీని రూపొందించారు. భారత్ మేటి ప్రత్యర్థులతో పాటు పొరుగు దేశం బంగ్లాదేశ్, 11వ సభ్య దేశంగా ఉన్న జింబాబ్వేతోనూ తలపడుతుంది. ఎప్పుడో అరకొరగా జరిగే టెస్టులను ఈ నాలుగేళ్ల సైకిల్‌లో పెంచారు. సభ్యదేశాలన్నీ మూడు ఫార్మాట్ల సిరీస్‌లో పాల్గొనేందుకు సమ్మతించాయని ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) వసీమ్ ఖాన్ తెలిపారు. దీంతో గత ఎఫ్‌టీపీతో పోల్చితే తదుపరి సైకిల్‌లో మహిళల మ్యాచ్‌లు మూడు ఫార్మాట్లలోనూ గణనీయంగా పెరగనున్నాయి.
» కొత్త ఎఫ్‌టీపీ వచ్చే ఏడాది మేలో మొదలై 2029 ఏప్రిల్‌తో ముగుస్తుంది. ప్రతి దేశం పూర్తిస్థాయి సిరీస్ ఆడేందుకు ప్రాధాన్యమిచ్చాయి. దీంతో 2025–29 సైకిల్‌లో 400 పైచిలుకు అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో జరిగే 44 వన్డే సిరీస్‌లలో ఒక్కో సభ్యదేశం మిగతా పది జట్లతో మూడు వన్డేల చొప్పున ఆడుతుంది. అలా 132 వన్డేలు జరుగుతాయి.
» మహిళల ఎఫ్‌టీపీని 2029లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు అనుగుణంగా రూపొందించారు. ఇప్పుడున్న 10 జట్లతో పరిమితం కాకుండా ఆ మెగా టోర్నీ 11 జట్లతో జరుగనుంది. 11వ
దేశంగా జింబాబ్వే బరిలోకి దిగుతుంది. ఇటీవల జింబాబ్వే మహిళల జట్టుకు శాశ్వత సభ్యదేశం హోదా ఇచ్చారు.
» 2026లో ఇంగ్లండ్‌లో జరగబోయే టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్ అక్కడ సన్నాహాల్లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో కలిసి ముక్కోణపు టోర్నీలో ఆడుతుంది.
» ఐర్లాండ్‌లోనూ జరిగే సన్నాహక ముక్కోణపు టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్‌లు తలపడతాయి. అలాగే భారత ఉపఖండంలోని శ్రీలంక జట్టు వెస్టిండీస్, మరో జట్టుతో కలిసి ముక్కోణపు సిరీస్‌లో పాల్గొంటుంది.
» ఐసీసీ మహిళల చాంపియన్íÙప్‌లో భాగమైన జింబాబ్వే... వచ్చే నాలుగేళ్ల పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్, శ్రీలంకలతో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆతిథ్యమిస్తుంది. దీంతో పాటు భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో పర్యటిస్తుంది.
» అందరికంటే ఆ్రస్టేలియా గరిష్టంగా ద్వైపాక్షిక సిరీస్‌లలో భాగమవుతుంది. భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లాంటి గట్టి ప్రత్యర్థులతో ఇంటా బయటా సిరీస్‌లు ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment