Australia Women vs India Women: ఆస్ట్రేలియాతో జరిగన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా వైట్‌వాష్ పరాభవాన్ని తప్పించుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం 265పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ శుభారంభం ఇచ్చారు.
వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇన్నింగ్స్ 10 ఓవర్లో ఫామ్‌లో ఉన్న మంధాన వికెట్‌ను భారత్ కోల్పోయింది. ఆనంతరం క్రీజులోకి వచ్చిన యస్తిక భాటియా, షఫాలీ వర్మ కలిసి 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యస్తిక భాటియా(69 బంతుల్లో 9 ఫోర్లతో 64), షెఫాలీ వర్మ(91 బంతుల్లో 7 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో చేలరేగారు.
ఈ భాగస్వామ్యం భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. చివర్లో స్నేహ్ రాణా కాసేపు అలరించడంతో టీమిండియా లక్ష్యాన్ని సూనయాసంగా చేధించింది. కాగా భారత మహిళలకు వన్డేల్లో ఇదే అత్యధిక చేజింగ్ కావడం విశేషం. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ ఉమెన్‌లో ఆశ్లే గార్డ్‌నర్(67), బెత్ మూనీ (52) హాఫ్ సెంచరీలతో చేలరేగగా.. తహిలా మెక్‌గ్రాత్ (47), అలిసా హీలీ( 35) రాణించారు. భారత బౌలర్లలో జూలన్ గోస్వామి, పూజా వస్త్రాకర్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. స్నేహ్ రాణా ఒక వికెట్ సాధించింది.
చదవండి: Mohammad Hafeez: పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్‌కు అస్వస్థత..
Comments
Please login to add a commentAdd a comment