Women's World Cup 2022: Smriti Mandhana hit on head in warm up match against South Africa - Sakshi
Sakshi News home page

Women’s World Cup 2022: ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు షాక్‌.. స్టార్‌ ఓపెనర్‌ తలకు గాయం!

Published Sun, Feb 27 2022 1:38 PM | Last Updated on Sun, Feb 27 2022 2:13 PM

Smriti Mandhana hit on head in warm up match against South Africa - Sakshi

ICC Women's World Cup: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ వార్మప్ మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన తలకు గాయమైంది. భారత ఇన్నింగ్స్‌ 2 ఓవర్‌లో దక్షిణాఫ్రికా బౌలర్‌ ఇస్మాయిల్ బౌన్సర్‌ వేసింది. బౌన్సర్‌ బంతిని పుల్‌ షాట్‌ ఆడటానికి మంధాన ప్రయత్నించగా.. అది మిస్‌ అయ్యి మంధాన హెల్మెట్‌కు బలంగా తగిలింది. అయితే వెంటనే ఫీల్డ్‌లోకి  ఫిజియో వచ్చి మంధానను పరిశీలించాడు. అయితే ఆమెకు ఎలాంటి కంకషన్ లక్షణాలు కనిపించలేదు. దీంతో ఆమెకు తగిలిన గాయం అంత తీవ్రమైనది కాదని ఫిజియో నిర్ధారించాడు.

అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మంధాన ఫీల్డ్‌ను విడిచి వెళ్లింది. 12 పరుగులు చేసిన ఆమె రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై భారత్‌ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు సాధించి. భారత బ్యాటర్లలో హర్మాన్‌​ ప్రీత్‌ కౌర్‌ సెంచరీతో మెరిసింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మాన్‌​ ప్రీత్‌ కౌర్‌(103), యస్తికా భాటియా(58) పరుగులతో రాణించారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటిస్‌ జట్టు  242 పరుగులకే పరిమితమైంది.

చదవండి: Rohit Sharma: రోహిత్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చేటపుడు జాగ్రత్త.. పట్టిందల్లా బంగారమే: టీమిండియా మాజీ క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement