
PC: Inside sport
న్యూజిలాండ్ పర్యటనలో వరుస నాలుగు ఓటమిల తర్వాత.. ఐదో వన్డే గెలిచి భారత మహిళల జట్టు వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. ఓవల్ వేదికగా జరగిన అఖరి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత విజయంలో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కేర్(66), సోఫియా డివైన్(34),లారెన్ డౌన్(30) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గైక్వాడ్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు సాధించారు.
ఇక 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(71), హర్మన్ ప్రీత్ కౌర్(63), మిథాలీ(57) పరగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. కాగా ఐదు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 4-0తేడాతో కైవసం చేసుకుంది. ఇక వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమీలియా కేర్‌కి మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది.
చదవండి: Bhanuka Rajapaksa: అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన లంకేయులు