మహిళల టీ20 ఛాలెంజ్.. జట్టులను ప్రకటించిన బీసీసీఐ | BCCI announces squads for Womens T20 Challenge 2022 | Sakshi
Sakshi News home page

Women’s T20 Challenge 2022: మహిళల టీ20 ఛాలెంజ్.. జట్టులను ప్రకటించిన బీసీసీఐ

Published Mon, May 16 2022 8:27 PM | Last Updated on Mon, May 16 2022 8:27 PM

BCCI announces squads for Womens T20 Challenge 2022 - Sakshi

Courtesy: BCCI Twitter

మహిళల టీ20 ఛాలెంజ్-2022 కోసం బీసీసీఐ జట్టులను సోమవారం ప్రకటించింది. టీ20 ఛాలెంజ్ కప్‌ మే 23న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ట్రైల్‌బ్లేజర్స్‌తో సూపర్నోవాస్ తలపడనుంది. ఫైనల్‌ మే 28న జరుగుతుంది. కాగా మ్యాచ్‌లు అన్నీ  పూణెలోని ఎంసీఎ స్టేడియం వేదికగా జరగనున్నాయి.  ట్రైల్‌బ్లేజర్స్‌కు స్మృతి మందాన సారథ్యం వహిస్తుండగా.. సూపర్నోవాస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, వెలాసిటీకు దీప్తి శర్మ కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇక మహిళ టీ20 ఛాలెంజ్ చివరగా 2020లో జరిగింది. గతేడాది కరోనా కారణంగా బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహించలేదు.

ట్రైల్‌బ్లేజర్స్‌
స్మృతి మంధాన (కెప్టెన్‌), పూనమ్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), అరుంధతి రెడ్డి, హేలీ మాథ్యూస్, జెమీమా రోడ్రిగ్స్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎస్. మేఘన, సైకా ఇషాక్, సల్మా ఖాతున్, షర్మిన్ అక్టర్, సోఫియా బ్రౌన్, సోఫియా బ్రౌన్, మల్లిక్, ఎస్.బి.పోఖార్కర్

వెలాసిటీ: దీప్తి శర్మ (కెప్టెన్‌), స్నో రానా (వైస్‌ కెప్టెన్‌), షఫాలి వర్మ, అయాబొంగా ఖాకా, కె.పి. నవ్‌గిరే, కాథరిన్ క్రాస్, కీర్తి జేమ్స్, లారా వోల్వార్డ్, మాయా సోనావానే, నత్తకాన్ చంతమ్, రాధా యాదవ్, ఆర్తీ కేదార్, సిమ్రాన్ షిండే, సిమ్రాన్ షిండే యాస్తిక భాటియా, ప్రణవి చంద్ర

సూపర్నోవాస్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), తానియా భాటియా (వైస్‌ కెప్టెన్‌), అలనా కింగ్, ఆయుష్ సోని, చందు వి, డియాండ్రా డోటిన్, హర్లీన్ డియోల్, మేఘనా సింగ్, మోనికా పటేల్ ముస్కాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పునియా, రాశి కనోజియా, సోఫీ ఎక్లెస్టోన్, సునే లూస్, మాన్సీ జోషి

చదవండిIPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్‌.. సీనియర్‌ ఆటగాడు దూరం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement