
మిథాలీరాజ్ వికెట్ తీసిన ఆనందంలో ఆసీస్ ప్లెయర్స్
వడోదరా : దక్షిణాఫ్రికాపై విజయాలతో ఉత్సాహంగా కనిపించిన భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో ఆసీస్‌కు కోల్పోయింది. తొలి వన్డేలో ఓటమి చవిచూసిన మహిళా జట్టు తాజాగా గురువారం జరిగిన రెండో వన్డేలో 60పరుగుల తేడాతో ఓడిపోయింది. 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళా జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. స్మృతి మంధాన( 67; 53 బంతుల్లో 12ఫోర్లు, 1సిక్సర్) జోరుతో తొలి వికెట్‌కు 88పరుగుల భాగస్వామ్యం నమోదయింది. ఆ తరువాత మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు పరుగులు చేయడంలో విఫలమవడంతో ఓటమి తప్పలేదు. 227 పరుగులకు ఆలౌటై పరాజయం చవిచూసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జోనస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా, వెల్లింగ్టన్, పెర్రీ తలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నికోల్ బోల్టన్ (84; 88 బంతుల్లో 12 ఫోర్లు), ఎలైస్ పెర్రీ (70; 70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), బెత్ మూనీ (56; 40 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్‌కు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు సాధించగా, పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. ఏక్తా బిస్త్, హర్మన్ ప్రీత్ కౌర్‌లకు తలో వికెట్ వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment