
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ‘టాప్’లో ఉన్న స్మృతి మంధాన రెండో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాతో సోమవారం ముగిసిన వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమవ్వడం ఆమె వ్యక్తిగత ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. ప్రస్తుతం స్మృతి 755 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... 759 పాయింట్లతో న్యూజిలాండ్ ప్లేయర్ అమీ సాటర్త్‌వెయిట్ మొదటి ర్యాంక్‌కు ఎగబాకింది. క్రికెట్ కెరీర్‌లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సారథి మిథాలీ రాజ్ ఒక స్థానాన్ని కోల్పోయి ఏడో ర్యాంక్‌కు పరిమితం కాగా... టి20 కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 17వ స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment