
గువాహటి: వరల్డ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలవాలన్న తన కోరిక నెరవేరిందని, ఇక వరల్డ్ కప్ గెలవాలన్నదే తన ఆశ అని భారత స్టార్ బ్యాటర్, ఐసీసీ నంబర్‌వన్ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. ‘క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడే వరల్డ్ కప్ గురించి ఆలోచిస్తాం. నేనూ అదే చేశాను. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ కావాలనే స్వల్ప లక్ష్యాలు ఎలాగూ ఉన్నాయి. అది ఇప్పుడు నెరవేరింది. ఇక మరింతగా కష్టపడి దీనిని నిలబెట్టుకోవడం ముఖ్యం. ఒక బ్యాటర్‌గా నంబర్‌వన్ స్థానానికి చేరుకోవడం సంతోషకరం. అయితే అది చిన్నదే. అసలు లక్ష్యం మాత్రం వరల్డ్ కప్ సాధించడమే’ అని స్మృతి చెప్పింది.
మరోవైపు ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌ను గెలుచుకునే సత్తా తమ జట్టుకు ఉందని ఆమె పేర్కొంది. ‘కొత్తవారితో ప్రయోగాలు చేయడంకంటే సిరీస్ గెలుచుకోవడమే మాకు అన్నింటికంటే ముఖ్యం. ఒక వేళ సిరీస్ గెలిస్తే సహజంగానే కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది’ అని ఆమె చెప్పింది. 2020 ఫిబ్రవరిలో జరిగే టి20 ప్రపంచ కప్ కోసం కోచ్ రామన్‌తో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్మృతి వెల్లడించింది. వైస్ కెప్టెన్‌గా చేసినందుకు తాజాగా కెప్టెన్సీ బాధ్యత కొత్తగా అనిపించడం లేదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment