Ind W Vs Nz W: Smriti Mandhana Stunning Catch, Video Viral On Social Media - Sakshi
Sakshi News home page

NZ W vs IND W: స్మృతి మంధాన కళ్లు చెదిరే క్యాచ్‌.. సూపర్ రీ ఎంట్రీ కదా!

Published Tue, Feb 22 2022 12:30 PM | Last Updated on Tue, Feb 22 2022 1:14 PM

Smriti Mandhana pulls out a Stunning catch to dismiss Sophie Devine - Sakshi

Smriti Mandhana Catch: న్యూజిలాండ్‌ మహిళలతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఓసెనర్‌ స్మృతి మంధాన అద్భుతమైన క్యాచ్‌తో మెరిసింది. క్వారంటైన్‌ నిభందనల కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన స్మృతి నాలుగో వన్డేకు తిరిగి జట్టులోకి వచ్చింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ వేసిన రేణుకా సింగ్‌ బౌలింగ్‌లో.. సోఫియా డివైన్‌ పాయింట్‌ దిశగా కట్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించింది. అయితే పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మంధాన డైవ్‌ చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకుంది. కాగా మంధాన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. వర్షం​ కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో అమీలియా కేర్‌(68), బేట్స్‌(41),డివైన్‌(32) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్‌ 2 వికెట్లు పడగొట్టగా, మేఘనా సింగ్‌,దీప్తి శర్మ చెరో వికెట్‌ సాధించారు. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 128  పరగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్‌(52), మిథాలీ రాజ్‌(30) పరుగలతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. కివీస్‌ బౌలర్లలో కేర్‌, జానేసన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, జేస్‌ కేర్‌ చెరో రెండు వికెట్లు సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement