Jason Van Der Merwe and Jacob Mulder Take Brilliant Juggling Catch - Sakshi
Sakshi News home page

క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌.. ఇప్పటి వరకు చూసి ఉండరు! వీడియో వైరల్‌

Published Sat, Mar 25 2023 5:50 PM | Last Updated on Sat, Mar 25 2023 6:35 PM

Jason van der Merve and Jacob Mulder take brilliant juggling catch  - Sakshi

యూరోపియన్‌ క్రికెట్‌ టీ10 లీగ్‌లో భాగంగా శుక్రవారం సీవైఎంస్‌, డ్రీక్స్ హార్న్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌ థ్రిల్లర్‌ను తలిపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన  ఈ మ్యాచ్‌లో సీవైఎంస్‌పై 3 వికెట్ల తేడాతో డ్రీక్స్ హార్న్స్ విజయం సాధించింది.

తద్వారా యూరోపియన్‌ క్రికెట్‌ టీ10 లీగ్‌ ఫైనల్లో డ్రీక్స్ హార్న్స్ అడుగుపెట్టింది. 126 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన  డ్రీక్స్.. 9.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

వారెవ్వా.. సూపర్‌ క్యాచ్‌
ఇక ఈ మ్యాచ్‌లో సీవైఎంస్‌ ఆటగాళ్లు జాసన్ వాన్ డెర్ మెర్వ్, జాకబ్ ముల్డర్ అద్భుతమైన విన్యాసంతో అందరిని ఆశ్చర్యపరిచాడు. బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న వీరిద్దరూ ఓ సంచలన క్యాచ్‌తో మెరిశారు. డ్రీక్స్ హార్న్స్  ఇన్నింగ్స్‌ 4 ఓవర్‌ వేసిన ఆడామ్‌ కెన్నడీ బౌలింగ్‌లో నబీ డిప్‌ మిడ్‌ వికెట్‌ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు.

షాట్‌ కూడా సరిగ్గా కనక్ట్‌ కావడంతో అంతా సిక్స్‌ అని భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న వాన్ డెర్ మెర్వ్ జంప్‌ చేస్తూ సింగిల్‌ హ్యాండ్‌తో క్యాచ్‌ అం‍దుకునే ప్రయత్నం చేశాడు. అయితే బౌండరీ రోప్‌కు దగ్గరగా ఉండటంతో బంతిని వాన్ డెర్ మెర్వ్ గాల్లోకి విసిరాడు.

ఈ క్రమంలో జాకబ్ ముల్డర్ పరిగెత్తూ కుంటూ వచ్చి క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను చూసిన డ్రీక్స్ హార్న్స్  బ్యాటర్‌ బిత్తరిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌.. కీలక బౌలర్‌ దూరం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement