వారెవ్వా.. సూపర్‌ క్యాచ్‌! పక్షిలా ఎగురుతూ (వీడియో) | Ravi Bishnoi Pulls Off Stunner Against Zimbabwe | Sakshi
Sakshi News home page

IND vs ZIM: వారెవ్వా.. సూపర్‌ క్యాచ్‌! పక్షిలా ఎగురుతూ(వీడియో)

Published Thu, Jul 11 2024 10:00 AM | Last Updated on Thu, Jul 11 2024 11:00 AM

Ravi Bishnoi Pulls Off Stunner Against Zimbabwe

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్పిన్నర్‌ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో జింబాబ్వే బ్యాటర్‌ బ్రియాన్ బెన్నెట్‌ను బిష్ణోయ్‌ పెవిలియన్‌కు పంపాడు. 

జింబాబ్వే ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ వేసిన పేసర్‌ అవేష్‌ ఖాన్‌.. తొలి బంతిని బెన్నట్‌కు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌ దిశగా సంధిచాడు. ఈ క్రమంలో బెన్నట్‌  బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా పవర్‌ ఫుల్‌ కట్‌షాట్‌ ఆడాడు.

అయితే బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న బిష్ణోయ్‌.. సూపర్‌మేన్‌లా గాల్లోకి జంప్‌ చేస్తూ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అందరూ బిష్ణోయ్‌ వద్దకు వెళ్లి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. 

ఈ క్యాచ్‌ చూసిన  బ్యాటర్‌ బెన్నట్‌ కూడా బిత్తరపోయాడు. చేసేదేమి లేక బెన్నట్‌(4) పరుగులతో నిరాశతో మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఈ సూపర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్‌ దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జూలై 13న జరగనుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement