
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే బుధవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కరాచీ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన అబ్బాస్ అఫ్రిది బౌలింగ్‌లో వెటరన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి లాంగాన్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పొలార్డ్ ముందుకు వేగంగా కదిలి అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 13 పరుగులు చేసిన మాలిక్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.
ఇక సంచలన క్యాచ్‌ను అందుకున్న పొలార్డ్‌ను సహచర ఆటగాళ్లు దగ్గరకు వెళ్లి మరి అభినందించారు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ చేతిలో కరాచీ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
చదవండి: అలుపెరగని యోధుడు రషీద్ ఖాన్.. మనిషా.. రోబోనా అంటున్న జనం
BIG MAN @KieronPollard55 TAKES A RIPPER! 😲#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvKK pic.twitter.com/2ynzehnsp2
— PakistanSuperLeague (@thePSLt20) February 22, 2023