T20 World Cup 2021: అకేల్ హోసిన్ సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌ | Akeal Hosein Takes Sensational One Handed Catch To Dismiss Liam Livingstone | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: అకేల్ హోసిన్ సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌

Published Sun, Oct 24 2021 12:30 PM | Last Updated on Sun, Oct 24 2021 3:05 PM

Akeal Hosein Takes Sensational One Handed Catch To Dismiss Liam Livingstone - Sakshi

Courtesy: ICC Twitter

Akeal Hosein Takes Sensational One Handed Catch: టి20 ప్రపంచ కప్‌ 2021లో ఇంగ్లండ్‌ చేతిలో వెస్టిండీస్‌ చిత్తుగా ఓటమి చెందినప్పటికీ .. ఆ జట్టు స్పిన్నర్‌ అకేల్ హోసిన్ అద్భుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్య పరిచాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 6 ఓవర్‌ వేయడానికి వచ్చిన అకేల్ హోసిన్ బౌలింగ్‌లో  లివింగ్‌స్టోన్‌ బౌలర్‌ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే అకేల్ హోసిన్ వేగంగా లాంగ్‌ డ్రైవ్‌ చేస్తూ సింగిల్‌ హ్యాండ్‌తో స్టన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు.

అయితే ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్స్టాగ్రామ్‌లో  షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. హోసిన్ స్టన్నింగ్‌ క్యాచ్‌కు నెటిజన్లు ఫిధా అవుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అకేల్ హోసిన్..  రెండు కూడా కాట్ అండ్ బౌల్డ్  కావడం విశేషం. ఇక మ్యాచ్‌ విషయానకి వస్తే.. వెస్టిండీస్‌పై 6వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ కేవలం 55 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది.

చదవండి: T20 World Cup 2021 Ind vs Pak: ఆ ముగ్గురి పేరు మీదే ఎ​క్కువ బెట్టింగ్‌లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement