ENG Vs NZ : కివీస్‌ ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు | T20 World Cup 2021: Big Records Waiting New Zeland Players Vs ENG Semis | Sakshi
Sakshi News home page

T20 WC 2021 ENG Vs NZ Semi Final-1: కివీస్‌ ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు

Published Wed, Nov 10 2021 4:46 PM | Last Updated on Wed, Nov 10 2021 5:27 PM

T20 World Cup 2021: Big Records Waiting New Zeland Players Vs ENG Semis - Sakshi

3 Big Records For New Zeland Players Vs ENG Semi Final Match T20 Wc 2021.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి సెమీఫైనల్‌ జరగనుంది. కాగా 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో న్యూజిలాండ్‌ సూపర్‌ ఓవర్‌లో ఓడిన సంగతి తెలిసిందే. ఫైనల్‌, సూపర్‌ ఓవర్‌ టై కావడంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ అనూహ్యంగా  విశ్వవిజేతగా అవతరించింది. దీంతో న్యూజిలాండ్‌కు నిరాశే ఎదురైంది. తాజాగా టి20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు సెమీస్‌లో ఎదురుపడగా.. ఇంగ్లండ్‌ ఫెవరెట్‌గా కనిపిస్తుంది. అయితే కివీస్‌ ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. దీంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

చదవండి: Sunil Gavaskar: సెమిఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించడం అంత సులభం కాదు

టిమ్‌ సౌథీ: 


కివీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ.. శ్రీలంక దిగ్గజ బౌలర్‌ లసిత్‌ మలింగ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం లభించింది. ఇప్పటివరకు మలింగ 84 టి20ల్లో 107 వికెట్లు తీశాడు. టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మలింగ రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా సౌథీ 88 మ్యాచ్‌ల్లో 106 వికెట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో సౌథీ ఒక్క వికెట్‌ తీస్తే మలింగతో సమానంగా.. రెండు వికెట్లు తీస్తే మలింగను దాటి రెండో స్థానంలో నిలవనున్నాడు. ఇక మొదటి స్థానంలో బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌(94 మ్యాచ్‌ల్లో​117 వికెట్లు) ఉన్నాడు.

చదవండి: T20 WC 2021: ఇంగ్లండ్‌ ఫెవరెట్‌.. న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా!

కేన్‌ విలియమ్సన్‌:


న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ టి20ల్లో 2వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు 69 పరుగులు కావాల్సి ఉంది. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కేన్‌ మామ 69 పరుగులు చేస్తే ఈ మార్క్‌ను అందుకున్న మూడో కివీస్‌ బ్యాటర్‌గా నిలవనున్నాడు. ఇంతకముందు కివీస్‌ తరపున మార్టిన్‌ గప్టిల్‌, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ఉన్నారు.

మార్టిన్‌ గప్టిల్‌:


కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ 112 పరుగులు చేస్తే టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా నిలవనున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేయడం కాస్త కష్టసాధ్యమైనప్పటికీ గప్టిల్‌ వేగంగా ఆడితే మాత్రం రికార్డు అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం గప్టిల్‌ 107 మ్యాచ్‌ల్లో 3115 పరుగులు చేశాడు. ఇక తొలి స్థానంలో ఉన్న విరాట్‌ కోహ్లి 95 మ్యాచ్‌ల్లో 3227 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ఉన్న రోహిత్‌ శర్మ 116 మ్యాచ్‌ల్లో​ 3038 పరుగులతో ఉన్నాడు. 

చదవండి: Daryl Mitchell: ఇది ఫీల్డింగ్‌ అంటే.. క్యాచ్‌ పట్టకపోయినా హీరో అయ్యాడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement