T20 World Cup 2021: New Zealand Enters 1st Time Final T20 World Cup History - Sakshi
Sakshi News home page

T20 WC 2021: వారెవ్వా న్యూజిలాండ్‌.. దెబ్బకు దెబ్బ తీసింది

Published Wed, Nov 10 2021 11:28 PM | Last Updated on Thu, Nov 11 2021 9:37 AM

T20 World Cup 2021: New Zeland Enters 1st Time Final T20 World Cup History - Sakshi

New Zeland Enters 1st Time Final In T20 World Cup History.. టి20 ప్రపంచకప్‌ 2021లో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించిన న్యూజిలాండ్‌ తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. తద్వారా 2019 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి ఎదుర్కొన్న న్యూజిలాండ్‌ తాజా విజయంతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.

ఇక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌కు పెద్దగా అవకాశాలివ్వకుండా జాగ్రత్తపడింది. అయితే ఒకటి రెండుచోట్ల ఇంగ్లండ్‌ ఆటగాళ్లు క్యాచ్‌లు పట్టుకోవడంలోనూ.. ఫీల్డింగ్‌ మిస్‌ చేయడంలో విఫలమైంది. ఇక కివీస్‌ ఓపెనర్‌ డారెల్‌ మిచెల్‌ (72 పరుగులు, 47 బంతులు; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో నీషమ్‌(11 బంతుల్లో 27 పరుగులు) 3 సిక్సర్లతో హోరెత్తించి న్యూజిలాండ్‌ విజయానికి బాటలు పరిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement